Prabhas లైనప్ మాములుగా లేదుగా.. మరో నాలుగేళ్ళు నో డేట్స్.. ఏ సినిమా ఎప్పుడు రిలీజ్ అంటే?
బాహుబలి తర్వాత యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్యాన్ ఇండియా స్టార్ అయిపోయాడు. పెద్ద ఎత్తున ఆయన మార్కెట్ పెరిగిపోవడంతో ఆయన చేస్తున్న అన్ని సినిమాలు ప్యాన్ ఇండియా లెవల్లో రిలీజ్ చేస్తున్నారు. చివరిగా సాహో సినిమా చేసిన ఆయన ప్రస్తుతం రాధేశ్యామ్ చేస్తున్నారు. అయితే ఆయన సినిమాల లైనప్ మాత్రం మామూలుగా లేదు. తాజాగా వచ్చిన ప్రభాస్ 25వ సినిమా ప్రకటనతో ఆ లైనప్ మరింత ఆసక్తికరంగా మారింది. ఆ వివరాల్లోకి వెళితే

సాహో ఎఫెక్ట్
బాహుబలి సిరీస్ తర్వాత ప్రభాస్ చేస్తున్న అన్ని సినిమాలు ప్యాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ అయ్యే పరిస్థితి ఉంది. సాహో అనే సినిమా ఊహించినంత ఆదరణ దక్కించుకోలేక పోవడంతో ప్రస్తుతం చేస్తున్న రాధేశ్యామ్ సినిమాకి కూడా మార్పులు చేర్పులు సూచించడంతో మార్పులు చేర్పులు చేసిన నేపథ్యంలో ఈ సినిమా షూటింగ్ అంతకంతకూ లేట్ అవుతుంది.

రెండు సినిమాల షూట్
ఇక ఈ సినిమా సెట్స్ మీద ఉండగానే ఆయన మరో రెండు సినిమాల షూటింగ్ కూడా మొదలు పెట్టాడు అనే సంగతి తెలిసిందే. బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వంలో ఆయన ఆది పురుష్ అనే సినిమా కూడా చేస్తున్నాడు. రామాయణ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా లో ప్రభాస్ రాముడిగా నటిస్తున్నాడు. సైఫ్ అలీఖాన్ రావణుడిగా, కృతిసనన్ సీతగా నటిస్తున్న ఈ సినిమా మీద భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి.

ఆదిపురుష్ మీదే ఫోకస్
ఈ సినిమా కాకుండా ఆయన ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ కూడా కొంత మేర తెలంగాణలో రామగుండం జిల్లాలో జరిగింది. ఈ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇక ప్రస్తుతానికి అయితే ప్రభాస్ ఇప్పుడు ఎక్కువ ఆది పురుష్ సినిమా మీదనే ఫోకస్ పెట్టారు.

ప్రాజెక్టు కే తరువాత
ఇక ఈ సినిమా పూర్తయిన వెంటనే ఆయన నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రాజెక్టు కే సినిమా చేయబోతున్నారు. ప్రాజెక్ట్ కే సినిమా పూర్తయిన తర్వాత ప్రభాస్ 24 సినిమా దిల్ రాజు నిర్మాణంలో ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందే అవకాశం ఉందని అంటున్నారు. నిజానికి దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన రాలేదు. 25వ సినిమా ప్రకటించేశారు కానీ 24వ ప్రకటన ఇంకా రావాల్సి ఉంది.

మరో నాలుగేళ్లు బిజీ
ఇక 25వ సినిమా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో టి సిరీస్ కోసం సినిమా చేస్తున్నారు. ఇక ప్రభాస్ 26వ సినిమాగా సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ కోసం సినిమా రూపొందే అవకాశం ఉందని అంటున్నారు. ఇక ఈ సినిమాలలో రాధేశ్యామ్, ఆదిపురుష్, సినిమాలు 2022వ సంవత్సరంలో విడుదల కాబోతుండగా సలార్ అలాగే ప్రాజెక్ట్ కే సినిమాలు మాత్రం 2023వ సంవత్సరంలో విడుదల కాబోతున్నాయి. ఇక 24వ సినిమా 25వ సినిమాలు 2024వ సంవత్సరంలో విడుదల అయ్యే అవకాశాలు ఉండగా ప్రభాస్ 26వ సినిమా మాత్రం 2025వ సంవత్సరం లో విడుదలయ్యే అవకాశం ఉంది. అంటే దాదాపు మరో నాలుగేళ్లపాటు ప్రభాస్ డేట్స్ దొరకడం అనేది అసాధ్యమనే చెప్పాలి.


Click it and Unblock the Notifications











