Prabhas Movies: ఆదిపురుష్ వలన కన్ఫ్యూజన్.. ప్రభాస్ రాబోయే సినిమాల రిలీజ్ డేట్స్ ఇవే!

బాహుబలి సినిమా తర్వాత మరో రేంజ్ లో బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేయాలి అని ప్రభాస్ ఎంత ట్రై చేస్తున్నప్పటికీ కూడా ఏ సినిమా కూడా కనీసం బాక్స్ ఆఫీస్ వద్ద పెట్టిన పెట్టుబడిని కూడా సరిగ్గా వెనక్కి తీసుకురావడం లేదు. దానికి తోడు విడుదల కాబోయే మరికొన్ని పెద్ద సినిమాలకు నెగిటివ్ టాక్ వస్తూ ఉండడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. టీజర్ తోనే తీవ్ర స్థాయిలో నిరాశ పరుస్తున్నాయి. అయితే ఆదిపురుష్ వాయిదా పడడంతో ఇప్పుడు ప్రభాస్ నుంచి రాబోయే సినిమాల రిలీజ్ డేట్స్ ఏమైనా చేంజ్ అవుతాయా లేదా అనే కన్ఫ్యూజన్ కూడా నెలకొంది. ఇక ప్రస్తుతం ప్లాన్ ప్రకారం ఏ సినిమా ఎప్పుడు విడుదల కాబోతోంది అనే వివరాల్లోకి వెళితే..

ఆదిపురుష్ వాయిదా

ఆదిపురుష్ వాయిదా

రాధే శ్యామ్ సినిమాతో బాక్సాఫీస్ వద్ద దారుణంగా డిజాస్టర్ ఎదుర్కోవడంతో ప్రభాస్ ఎలాగైనా తదుపరి సినిమాతో సక్సెస్ కొట్టాలని అనుకున్నాడు. అందుకే ఆదిపురుష్ సినిమాను గ్రాండ్ గా విడుదల చేయాలని ఆలోచించారు. ఆ సినిమా రామాయణం బ్యాక్ డ్రాప్ లో తెరపైకి రాబోతున్న విషయం తెలిసిందే. ఇక సంక్రాంతికి రావలసిన ఈ సినిమా గ్రాఫిక్స్ వర్క్ ను మరింత మెరుగుపరచాలని మళ్లీ వాయిదా వేశారు. దర్శకుడు ఓం రౌత్ ఈరోజు ఉదయం సినిమాను 2023 జూన్ 16న విడుదల చేయబోతున్నట్లు క్లారిటీ ఇచ్చాడు.

సలార్ 1 ముందే ఫిక్స్

సలార్ 1 ముందే ఫిక్స్

ఇక అదిపురుష్ వాయిదా పడడంతో ఇతర సినిమాలపై రిలీజ్ డేట్స్ విషయంలో మళ్ళీ ఏమైనా తేడాలు జరుగుతాయనే భయం కూడా అభిమానుల్లో నెలకొంది. ఇక సలార్ సినిమాను అయితే అనుకున్న సమయానికి విడుదల చేస్తామని గతంలోనే దర్శకుడు ప్రశాంత్ నీల్ వివరణ ఇచ్చాడు. సలార్ మొదటి భాగం 2023 సెప్టెంబర్ 28వ తేదీన విడుదల కాబోతున్న విషయం తెలిసిందే.

సలార్ 2 ఎప్పుడు?

సలార్ 2 ఎప్పుడు?

ఇక సలార్ రెండు భాగాలుగా రానుండగా రెండో భాగాన్ని ఎప్పుడు విడుదల చేస్తారనే విషయంలో కూడా ముందుగానే ఒక ప్లాన్ తో సిద్ధంగా ఉన్నారట. సలార్ సెకండ్ పార్ట్ ను 2024 ఫస్ట్ హాఫ్ లోనే విడుదల చేయవచ్చు అని తెలుస్తోంది. అంటే 2024 సంక్రాంతికి లేదా సమ్మర్ మొదట్లో ఆ సినిమా ప్రేక్షకుల ముందుకు రావచ్చు.

ప్రాజెక్ట్ K, మారుతి సినిమాలు

ప్రాజెక్ట్ K, మారుతి సినిమాలు

ఇక మారుతి దర్శకత్వంలో కూడా ప్రభాస్ ఒక సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ ప్రాజెక్టు స్టార్ట్ అయినట్లు ఇప్పటివరకు చిత్ర యూనిట్ సభ్యులు అధికారికంగా అయితే ప్రకటించలేదు. ఇక ఈ సినిమాను 2024 సమ్మర్ లో లేదా ఆ తర్వాత దసరా సమయంలో విడుదల చేయవచ్చని తెలుస్తోంది. ఇక మరో అతిపెద్ద మూవీ ప్రాజెక్టు K ను 2024 చివరలో ప్రేక్షకుల ముందుకు తీసుకు రావచ్చు. లేదంటే 2025 సంక్రాంతికి కూడా ఆ సినిమా రావచ్చు.

మరో రెండు ప్రాజెక్టులు

మరో రెండు ప్రాజెక్టులు

ఇక ప్రభాస్ లిస్టులో మరొక రెండు ప్రాజెక్టులు కూడా అయిన విషయం తెలిసిందే. ముందుగా అయితే సందీప్ రెడ్డి వంగాతో ప్రభాస్ సినిమా చేసేందుకు ఒప్పుకున్నాడు. అందులో పవర్ఫుల్.పోలీస్ ఆఫీసర్ గా అతను కనిపించబోతున్నాడు. సినిమా షూటింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అనే విషయంలో ఇంతవరకు ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. ఇక బాలీవుడ్ దర్శకుడు సిద్దార్థ్ ఆనంద్ దర్శకత్వంలో కూడా ప్రభాస్ ఒక సినిమా చేసేందుకు ఒప్పుకున్నాడు. ఈ రెండు ప్రాజెక్టులు కూడా 2024 తర్వాత పట్టాలేక్కే అవకాశం ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X