అప్పుడే మొదలైన చిరంజీవి బర్త్ డే సెలబ్రేషన్స్.. రంగంలోకి ప్రభాస్, ఇక రచ్చరచ్చే!
కొణిదెల శివశంకర ప్రసాద్ గా టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చి మెగాస్టార్ చిరంజీవి గా ప్రేక్షకుల మదిలో నిలిచిపోయారు చిరంజీవి. ఎలాంటి సినిమా బ్యాక్ గ్రౌండ్ లేకుండా సినిమాలలో ఎంట్రీ ఇచ్చిన ఈ రోజు దాదాపు సినిమా ఇండస్ట్రీ మొత్తానికి పెద్దదిక్కుగా ఎదిగారు. రేపు చిరంజీవి తన 66 వ పుట్టినరోజు జరుపుకోబోతున్నారు. ఈ పుట్టిన రోజు సందర్భంగా ఇప్పటికే ఆయన నటిస్తున్న సినిమాలకు సంబంధించి అనేక అప్ డేట్స్ ఇస్తూ సినిమా యూనిట్లు ఫ్యాన్స్ ని ఖుషీ చేసే పనిలో పడ్డాయి. అయితే ఈ రోజు చిరంజీవి కోసం ప్రభాస్ రంగంలోకి దిగబోతున్నారు అనే వార్తలు వినిపిస్తున్నాయి ఆ వివరాల్లోకి వెళితే..

పెద్ద ఎత్తున ప్లాన్స్
మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా పెద్ద ఎత్తున ప్లాన్ చేస్తున్నారు చిరంజీవి అభిమానులు. మరీ ముఖ్యంగా ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా బ్లడ్ డొనేషన్స్ అలాగే ఐ డొనేషన్స్ విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే చిరంజీవికి సంబంధించి కామన్ డీపీ కూడా విడుదల అయింది. ఇక ఆయన పుట్టిన రోజు సందర్భంగా సెలబ్రిటీల చేత మాట్లాడించాలి అని చిరంజీవి ఫ్యాన్స్ ఒక అద్భుతమైన ప్లాన్ సిద్ధం చేశారు.

గ్రీన్ ఇండియా ఛాలెంజ్
ఇప్పటికే చిరంజీవి తన పుట్టినరోజు సందర్భంగా అభిమానులు అందరూ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో పాల్గొనాలని ట్విట్టర్ ద్వారా పిలుపునిచ్చారు. ప్రస్తుతం ప్రకృతి వైపరీత్యాలు, కాలుష్యానికి చెక్ పెట్టాలంటే, భవిష్యత్ తరాలు బావుండాలంటే మొక్కలు నాటడం ఒక్కటే మార్గమని చిరంజీవి తన సందేశంలో పేర్కొన్నారు. అంతేకాక టిఆర్ఎస్ ఎంపీ కేసీఆర్ అత్యంత సన్నిహితుడిగా పేరు తెచ్చుకున్న సంతోష్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ మెగా సైనికులు అందరూ పాల్గొని ఆయన పిలుపునిచ్చారు.

రంగంలోకి ప్రభాస్
తాజాగా జరుగుతున్న ప్రచారం మేరకు చిరంజీవి కోసం ప్రభాస్ రంగంలోకి దిగినట్లు ప్రచారం జరుగుతోంది, చిరంజీవి అత్యంత సన్నిహితులు కొంత మంది 6 గంటలకు స్పెషల్ లైవ్ లో పాల్గొనాలని కోరగా దానికి ఆయన సంసిద్ధత వ్యక్తం చేశారని తెలుస్తోంది. ఈ మేరకు ఆయన ద్వారా మెగా అభిమానులను ఖుషీ చేయబోతున్నట్లు తెలుస్తోంది. అయితే ఆయన మెగాస్టార్ గురించి ఎలాంటి వివరాలు చెప్పబోతున్నారు ? ఆయన గురించి ఎలాంటి కామెంట్స్ చేయబోతున్నారు అనే విషయం మీద సోషల్ మీడియా అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

స్పెషల్ అప్డేట్
అలాగే చిరంజీవి హీరోగా నటిస్తున్న ఆచార్య సినిమా నుంచి కూడా ఏదైనా స్పెషల్ అప్డేట్ వచ్చే అవకాశం కనిపిస్తోంది సినిమాకు సంబంధించిన రిలీజ్ డేట్ ప్రకటించే అవకాశం ఉందని కూడా ముందునుంచే ప్రచారం జరుగుతుంది. అలాగే ఆయన లూసిఫర్ రీమేక్ సినిమాలో నటిస్తుండగా ఆ సినిమా నుంచి ఏదైనా లుక్ కూడా విడుదల చేసే అవకాశం ఉందని అభిమానులు భావిస్తున్నారు. మరి దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడే వరకు వేచిచూడాల్సి ఉంది.
Recommended Video

అప్డేట్స్ రేపు విడుదల
ఇక సినిమాల విషయానికి వస్తే మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతానికి ఆచార్య అనే సినిమాలో నటిస్తున్నారు. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రామ్ చరణ్ కీలక పాత్రలో నటిస్తున్నారు. చిరంజీవి సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుండగా రామ్ చరణ్ సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. ఇక ఈ సినిమా తరువాత ఏకంగా నాలుగు సినిమాలు లైన్ లో పెట్టారు ఆయన. ఇప్పటికే ఒక సినిమా పట్టాలెక్కగా మరో రెండు సినిమాలకు సంబంధించిన అప్డేట్స్ రేపు విడుదల అయ్యే అవకాశాలు ఉన్నాయి ఈ మేరకు అధికారిక ప్రకటనలు కూడా వెలువడ్డాయి.


Click it and Unblock the Notifications











