‘సలార్’ షూటింగ్ స్పాట్ పిక్ లీక్: యాక్షన్ మోడ్‌లో దర్శనమిచ్చిన ప్రభాస్
వరుస సినిమాలతో ఫుల్ జోష్ మీదున్నాడు యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన 'బాహుబలి' కోసం దాదాపు ఐదేళ్లు గ్యాప్ తీసుకున్న అతడు.. ఆ తర్వాత 'సాహో' కోసం కూడా రెండేళ్లు పని చేశాడు. ఇక, ప్రస్తుతం రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో 'రాధే శ్యామ్' అనే సినిమాలో నటిస్తున్న అతడు.. దీని కోసం కూడా రెండేళ్లకు పైగానే సమయాన్ని తీసుకోవాల్సి వచ్చింది. అయితే, దీని తర్వాత మాత్రం ప్రభాస్ ఒకదాని తర్వాత ఒకటి ఇలా మూడు ప్రాజెక్టులను ప్రకటించాడు. అందులో KGF దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తోన్న 'సలార్' ఒకటి.
KGFతో ప్రపంచం దృష్టిని ఆకర్షించిన ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ చేస్తున్న చిత్రమే 'సలార్'. దీన్ని హొంబళే ప్రొడక్షన్స్ బ్యానర్‌పై విజయ్ కిరగందుర్ నిర్మిస్తున్నారు. తెలుగు, కన్నడం, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో ఈ చిత్రం రూపొందుతోంది. కోలీవుడ్ భామ శృతి హాసన్ ఇందులో హీరోయిన్. ఫస్ట్ లుక్ పోస్టర్‌తోనే అంచనాలు పెంచేశారు. ఈ మూవీ షూటింగ్ కొద్ది రోజుల క్రితం సింగరేణి బొగ్గు గనుల్లో ప్రారంభమైంది. అక్కడ దాదాపు పది రోజుల పాటు షూటింగ్ చేశారు. ఇందులో హీరో ఇంట్రడక్షన్ సీన్స్ చిత్రీకరించారని తెలుస్తోంది.

ఈ నేపథ్యంలో తాజాగా అక్కడ తీసిన ఓ ఫొటో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. సింగరేణి ఓపెన్ కాస్ట్ మైన్స్‌లో ప్రభాస్ బైక్‌పై చేజింగ్ చేస్తున్న యాక్షన్ సీన్స్ షూట్ చేశారు. దానికి సంబంధించిన ఫొటోనే బయటకు వచ్చింది. ఇందులో అతడు స్టైలిష్ లుక్‌లో దర్శనమిస్తున్నాడు. దీంతో ఈ పిక్ ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది. ఎంతో ప్రతిష్టాత్మకంగా రాబోతున్న ఈ చిత్రానికి రవి బస్రుర్ సంగీతం అందిస్తున్నాడు. వచ్చే ఏడాది సంక్రాంతికి దీన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది.


Click it and Unblock the Notifications











