రాజా సాబ్ టీజర్ లీక్.. టెన్షన్ లో దర్శకుడు మారుతి.. వాళ్లకు స్ట్రిక్ట్ వార్నింగ్?
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ - మారుతీ కాంబినేషన్ లో రూపుదిద్దుకుంటున్న చిత్రం 'రాజా సాబ్'. ఈ చిత్రం కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో మేకర్స్ ఈ మూవీ నుంచి వరుసగా అప్డేట్స్ అందిస్తూనే వస్తున్నారు. బ్యాక్ టు బ్యాక్ అప్డేట్స్ ప్రేక్షకుల దృష్టిని ఈ సినిమా వైపు మళ్లెలా చేస్తున్నాయి. ఇప్పటికే మేకర్స్ రాజా సాబ్ చిత్రానికి సంబంధించిన రిలీజ్ డేట్ ను ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఈసినిమా విషయంలో మేకర్స్ బిగ్ షాక్ తగిలింది. ఈ మూవీ టీజర్ కోసం అంతా ఎదురు చూస్తుండగా టీమ్ కు పెద్ద షాక్ తగిలింది. ఆ వివరాల్లోకి వెళితే..
రాజా సాబ్ టీజర్ కు రెడీ..
ఇప్పటికే రాజా సాబ్ చిత్రం కోసం అభిమానులతో పాటు ప్రేక్షకులు ఎంతో ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో దర్శకుడు మారుతీ అభిమానులకు మరో గుడ్ న్యూస్ చెప్పారు. జూన్ 16న టీజర్ ను విడుదల చేయబోతున్నామని అనఫిషియల్ గా ప్రకటించారు. దీంతో అభిమానులు ఫుల్ ఖుషి అవుతున్నారు. టీజర్ రాక కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఇదే సమయంలో టీజర్ రిలీజ్ పైనా అఫిషీయల్ అప్డేట్ కోసం కూడా వెయిట్ చేస్తున్నారు. ఇక విడుదల సిద్ధంగా ఉన్న టీజర్ పై మేకర్స్ అప్డేట్ ఇచ్చే తరుణంలో బిగ్ షాక్ తగిలింది.

టీజర్ లీక్.. టెన్షన్ లో టీమ్..
ప్రస్తుతం రాజా సాబ్ చిత్రానికి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు చకచకా కొనసాగుతున్నాయి. అయితే ప్రస్తుతం టీజర్ ను రిలీజ్ చేసేందుకు ఎడిటింగ్ వర్క్ నడుస్తోంది. ఇదే సమయంలో కావాలనే టీజర్ వీడియోను లీక్ చేశారని తెలుస్తోంది. సోషల్ మీడియాలో పలు ట్వీట్లు కనిపించడంతో వెంటనే రాజా సాబ్ టీమ్ అలర్ట్ అయ్యింది. ఎలా టీజర్ వీడియో లీక్ అయ్యిందనే విషయంపై ఆరా తీస్తున్నారు. ఇక ఆ వీడియో ఎక్కువగా వ్యాప్తి చెందకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
కఠినమైన చర్యలు తప్పవు..
రాజా సాబ్ టీజర్ వీడియో బయటికి వచ్చిందనే వార్తలపై మేకర్స్ కూడా స్పందింారు. రాజా సాబ్ చిత్రం అధికారిక ఎక్స్ అకౌంట్ ద్వారా ఓ కీలకమైన విషయాన్ని పంచుకున్నారు... రాజా సాబ్ చిత్రానికి సంబంధించిన ఏదైనా లీక్డ్ కంటెంట్ కనిపిస్తే సోషల్ మీడియా అకౌంట్లు సస్పెన్డ్ అవుతాయని, కఠినమైన చర్యలు తీసుకుంటాని హెచ్చరించారు. అదే సమయంలో ప్రతి ఒక్కరిని ఈ విషయంలో గోప్యతను పాటించేందుకు సహకరించాలని కోరారు. తర్వలోనే బాధ్యతాయూతంగా సెలబ్రేట్ చేసుకొందాం. ఈ విషయం పట్ల అవగాహనతో ఉండండి అంటూ చెప్పుకొచ్చారు. ఇక ఈ ట్వీట్ తర్వాత రాజా సాబ్ టీజర్ కు సంబంధించిన లీక్ వీడియోలు, పోస్టులు కనిపించడం తగ్గాయి.
రాజా సాబ్ మూవీ వివరాలు..
ప్రభాస్ రాజా సాబ్ చిత్రానికి సంబంధించిన వివరాలు ఆసక్తికంగా ఉన్నాయి. ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ రూ.250 కోట్లతో నిర్మిస్తోంది. ప్రభాస్ సరసన ప్రియాంక మోహనన్ నటిస్తోంది. థమన్ సంగీతం అందిస్తుండటం విశేషం. డిసెంబర్ 05, 2025న గ్రాండ్ గా విడుదల కాబోతోంది.


Click it and Unblock the Notifications











