The Raja Saab Teaser Review : వింటేజ్ ప్రభాస్ బ్యాక్.. రాజా సాబ్ టీజర్ లో ఈ విషయాలు గమనించారా?
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ - మారుతీ కాంబినేషన్ లో రూపుదిద్దుకుంటున్న హర్రర్ ఫాంటసీ ఫిల్మ్ 'ది రాజా సాబ్'పై భారీ అంచనాలు నెలకొన్నాయి. బ్యూటీఫుల్ లవ్ స్టోరీలను తెరకెక్కించిన మారుతీ ఒకేసారి జోనర్ మార్చి హార్రర్ ఫిల్మ్ ను అది కూడా ప్రభాస్ తో తెరకెక్కిస్తుండటం అందరిలోనూ ఆసక్తిని రేకెత్తించింది. అయితే ఈ మూవీ టీజర్ ను తాజాగా విడుదల చేయడం విశేషం. 30 నిమిషాల్లోనే ఏకంగా 1 మిలియన్ వ్యూస్ దక్కించుకొని యూట్యూబ్ లో దుమ్ములేపుతోందీ టీజర్. అయితే ఈ టీజర్ ద్వారా మారుతీ పలు విషయాలపై మరింతగా ఆసక్తిని పెంచారు. ఆ అంశాలేంటనే వివరాల్లోకి వెళితే..
ది రాజా సాబ్ కు భారీ బడ్జెట్..
ఈ మూవీని కొంత షూటింగ్ అయ్యే వరకు అధికారికంగా ప్రకటించలేదు. మొదటి నుంచే సినిమాపై భారీ అంచనాలు పెరిగిపోయాయి. గతేడాది టైటిల్ పోస్టర్ విడుదల చేయడంతో సినిమాపై విపరీతమైన హైప్ వచ్చేసింది. అయితే ఈ సినిమాను పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీలో నిర్మిస్తుండటం విశేషం. రూ.250 కోట్లతో నిర్మాత టీజీ విశ్వ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా విషయంలో ఎక్కువగా విజువల్స్, సీజీ వర్క్ కే ఖర్చు పెడుతున్నారు. మరోవైపు వింటేజ్ ప్రభాస్ ను చూపించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈమేరకు అన్ని పనులు చకచకా కొనసాగుతున్నాయి.

ది రాజా సాబ్ టీజర్ విశేషాలు.. ఇవి గమనించారా?
రాజా సాబ్ టీజర్ విజువల్స్ గా, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ పరంగా ఆకట్టుకుంటోంది. అయితే ఈ సినిమాలో ప్రభాస్ ద్విపాత్రాభినయం చేయబోతున్నారని ముందుగానే తెలిసిపోయింది. కానీ టీజర్ లో యంగర్ ప్రభాస్ ను మాత్రమే చూపించారు. తాత పాత్రను చూపించలేదు. బహుశా మున్ముందు వచ్చే అప్డేట్స్ కోసం దాచి ఉంచారేమో. ఇక ది రాజా సాబ్ తో ప్రభాస్ ను యంగర్ గా చూపించే ప్రయత్నం చేశారు.
స్టైలిష్ లుక్ తో, వింటేజ్ ప్రభాస్ ను చూపించబోతున్నారని చెప్పారు. అలాగే కొన్నాళ్లుగా ప్రభాస్ అభిమానులు కోరుకుంటున్నట్టుగా డార్లింగ్ లోని హ్యూమర్ ను మళ్లీ తెరపై చూపించబోతున్నారు. అలాగే వెండితెరపై ఏకం ముగ్గురు హీరోయిన్లతో ప్రభాస్ రొమాన్స్ చేయబోతుండటం మరింత ఆసక్తికరంగా మారింది. కొన్నాళ్లుగా యాక్షన్ చిత్రాలతో రక్తపాతం చేస్తున్న ప్రభాస్ ను ఈ చిత్రంలో ప్రశాంతంగా, డార్లింగ్ గా చూపించబోతున్నట్టుగా హామీనిచ్చారు. మాళవిక మోహన్, నిధి అగర్వాల్ హీరోయిన్లు అందంగా మెరిశారు. వారి పాత్రలు కూడా ఆకట్టుకునేలా మారుతీ డిజైన్ చేశారని తెలుస్తోంది.
ది రాజా సాబ్ రిలీజ్ డేట్..
ప్రభాస్ మారుతీ డైరెక్షన్ లో వస్తున్న ఈ చిత్రం సమ్మర్ లోనే విడుదల అవుతుందని అందరూ ఊహించారు. కనీసం దసరాకైనా వస్తుందని ఆశించారు. కానీ క్రిస్టమస్ సందర్భంగా ఈ ఏడాది చివర్లో విడుదల కాబోతోంది. డిసెంబర్ 05, 2025న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ కాబోతోంది. ఇక ఈ చిత్రానికి టాప్ టెక్నీషియన్లు పనిచేశారు. థమన్ సంగీతం అందించారు.


Click it and Unblock the Notifications











