Radhe Shyamలో టైటానిక్ రేంజ్ సీన్లు.. ప్రభాస్ మూవీలో అవే హైలెట్ అంటూ!
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన రాధేశ్యామ్ చిత్రం కోసం అభిమానులు, సినీ ప్రేక్షకులు ఎంతోకాలం ఎదురు చూస్తున్నారు. అయితే కరోనావైరస్ కారణంగా ఈ చిత్ర షూటింగ్ మాత్రమే కాకుండా రిలీజ్ డేట్లు కూడా వాయిదా పడుతూ వస్తున్నాయి. అయితే ఈ సినిమా షూటింగు ఇటలీ, తదితర దేశాల్లో చేయాల్సి ఉండేది. కానీ కరోనా కారణంగా విదేశాల్లో షూటింగ్ చేయడానికి వీలు పడకపోవడంతో హైదరాబాద్‌లో సెట్ వేసి షూటింగ్ చేయాలని నిర్ణయించారు.
అయితే రాధేశ్యామ్ సినిమాకు సంబంధించిన పలు విషయాలు అభిమానుల్లో ఆసక్తిని నింపుతున్నది. అయితే తాజాగా ఈ సినిమాలోని షిప్ సీన్ గురించి మీడియా వర్గాల్లో ఆసక్తికరమైన చర్చ జరుగుతున్నది. ఈ సీన్లు హైలెట్‌గా నిలుస్తాయని... టైటానిక్ రేంజ్‌లో సీన్లు ఉంటాయి. ఈ సీన్లు అద్భుతంగా వచ్చాయి. ప్రేక్షకులకు గొప్ప అనుభూతిని కలిగిస్తున్నది. ఎమోషన్స్ ఆకట్టుకొంటాయి. సీన్లు గ్రాండ్‌గా ఉంటాయనే విషయాన్ని పేర్కొంటున్నారు. అలాగే తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో రూపొందుతున్న రాధేశ్యామ్ సినిమాను ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేసేందుకు ప్లానింగ్ మొదలైంది.

తెర ముందు.. తెర వెనుక
నటీనటులు: ప్రభాస్, పూజా హెగ్డే, సచిన్ ఖేడ్కర్, ప్రియదర్శి పులికొండ, భాగ్య శ్రీ, మురళీ శర్మ, కునాల్ రాయ్ కపూర్, సత్యన్, సాషా చెత్రి తదితరులు
దర్శకత్వం: రాధా కృష్ణ కుమార్
నిర్మాతలు: వంశీకృష్ణారెడ్డి, ప్రమోద్, ప్రసీదా ఉప్పలపాటి
మ్యూజిక్: జస్టిన్ ప్రభాకరన్
సినిమాటోగ్రఫి: మనోజ్ పరమహంస
ఎడిటింగ్: కోటగిరి వెంకటేశ్వరరావు
బ్యానర్: యూవీ క్రియేషన్స్


Click it and Unblock the Notifications











