ప్రభాస్ ది గ్రేట్.. తెలంగాణలో అడవి ప్రాంతం దత్తతకు సిద్ధం
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హరిత హారాన్ని చేయూతనిచ్చారు. ఎంపీ జోగినపల్లి సంతోస్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగమయ్యారు. గత కొద్ది నెలలుగా ఎంపీ సంతోష్ కుమార్ దేశవ్యాప్తంగా చెట్లు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించి ప్రముఖులకు సవాల్ విసిరే కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. ఈ క్రమంలో గురువారం ప్రభాస్ తన నివాసంలో చెట్లు నాటి సంఘీభావం ప్రకటించారు. ప్రభాస్ చేపట్టిన హరిత హారం కార్యక్రమంలో ఎంపీ సంతోష్ కుమార్ కూడా పాల్గొనడం విశేషం.
ఈ సందర్భంగా ప్రభాస్ మాట్లాడుతూ.. పర్యావరణ పరిరక్షణకు ఎంపీ సంతోష్ కుమార్ మంచి కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ అద్భుతమైన ఛాలెంజ్‌లో తాను భాగం కావడం హ్యాపీగా ఉంది అని అన్నారు.

ఎంపీ సంతోష్ కుమార్ స్పందిస్తూ... తాను చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో ప్రభాస్ భాగం కావడం సంతోషంగా ఉంది. ప్రభాస్ ఈ కార్యక్రమంలో పాల్గొనడం వల్ల మరెంతో మందికి స్ఫూర్తిని కలిగిస్తుంది. ప్రభాస్ నివాసంలో ఆయనను కలుసుకొన్నాను. నేను కీసర అడవిని దత్తత తీసుకొన్నాననే విషయాన్ని తెలుసుకొని హ్యాపీగా ఫీలయ్యారు. తెలంగాణలో ఏదైనా ఓ ప్రదేశంలో అటవి ప్రాంతాన్ని తీసుకోవడానికి సుముఖంగా ఉన్నట్టు తెలిపారు. త్వరలోనే దీనికి సంబంధించిన కార్యచరణను ప్రకటిస్తానని చెప్పారు అని ఆయన అన్నారు.
ఇక ప్రభాస్ కెరీర్ విషయానికి వస్తే.. ప్రస్తుతం రాధాకృష్ణ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఈ చిత్రానికి ఓ డియర్ అనే టైటిల్ పరిశీలనలో ఉంది. ఈ చిత్రం తర్వాత మహానటి ఫేం నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించే ప్యాన్ ఇండియా చిత్రంలో నటించనున్నారు.


Click it and Unblock the Notifications











