ప్రభాస్ - నాగ్ అశ్విన్ మూవీపై లేటెస్ట్ అప్‌డేట్: అసలైన ముహూర్తం ఫిక్స్ చేసేశారట
కొంత కాలంగా వరుసగా సినిమాలను ప్రకటిస్తూ ఫుల్ జోష్‌తో కనిపిస్తున్నాడు యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్. ఇప్పటికే రాధాకృష్ణ కుమార్ రూపొందిస్తోన్న 'రాధే శ్యామ్'లో నటిస్తోన్న అతడు.. అది విడుదల కాకముందే మరికొన్ని ప్రాజెక్టులను ప్రకటించాడు. అందులో ప్రశాంత్ నీల్ రూపొందించే 'సలార్', బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఓం రౌత్ తెరకెక్కించే 'ఆదిపురుష్' ఇప్పటికే పట్టాలెక్కేశాయి. ఇక, మిగిలిందల్లా.. మహానటి దర్శకుడు నాగ్ అశ్విన్ తీయబోతున్న సినిమానే. ఎంతో ప్రతిష్టాత్మకంగా రాబోతున్న ఈ సినిమా గురించి తాజాగా ఓ ఆసక్తికరమైన వార్త బయటకు వచ్చింది.
'రాధే శ్యామ్' షూటింగ్ చేస్తున్న సమయంలోనే నాగ్ అశ్విన్‌తో ఓ మూవీ చేస్తున్నట్లు ప్రభాస్ అనౌన్స్ చేశాడు. కానీ, దాన్ని ఇప్పటి వరకూ ప్రారంభించలేదు. అంతెందుకు పూజా కార్యక్రమాలు కూడా నిర్వహించలేదు. ఇలాంటి పరిస్థితుల్లో అసలు ఈ ప్రాజెక్టు ఉంటుందా? ఉండదా? అన్న అనుమానాలు సైతం వ్యక్తం అయ్యాయి. ఈ నేపథ్యంలో దీనిపై క్లారిటీ వచ్చేసింది. తాజా సమాచారం ప్రకారం.. ఈ సినిమాను వచ్చే దీపావళి పండుగ రోజున మొదలు పెట్టబోతున్నారట. దీన్ని కూడా గ్రాండ్‌గా లాంఛ్ ఈవెంట్ ఏర్పాటు చేసి మరీ ప్రారంభించబోతున్నారని విశ్వసనీయంగా తెలిసింది.

ఇక, ఈ సినిమా కథ విషయానికి వస్తే.. ఇది టైమ్ మెషీన్ ఆధారంగా నడిచే కాన్సెప్టుతో వస్తుందని అంటున్నారు. అంతేకాదు, అప్పట్లో నందమూరి బాలకృష్ణ నటించిన 'ఆదిత్య 369'కు సీక్వెల్ అన్న టాక్ కూడా వినిపిస్తోంది. ఇందులో అమితాబ్ బచ్చన్ సైంటిస్టుగా నటిస్తున్నారు. అలాగే, బాలీవుడ్ బ్యూటీ దీపిక పదుకొనే హీరోయిన్‌గా చేస్తోంది. వీళ్లతో పాటు ఎంతో మంది ప్రముఖులు ఇందులో కీలక పాత్రలు చేయనున్నారు. ఈ చిత్రాన్ని వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై అశ్వనీదత్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోన్న విషయం తెలిసిందే.


Click it and Unblock the Notifications











