50 రోజులు.. రూ.1200 కోట్లు.. రేర్ ఫీట్ కొట్టిన కల్కి 2898 ఏడీ
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్- నాగ్ అశ్విన్ కాంబినేషన్‌లో వచ్చిన మూవీ కల్కి 2898 ఏడీ. భారతీయ పురాణం మహాభారతానికి , సైన్స్ ఫిక్షన్, సాంకేతికత జోడించి సెల్యూలాయిడ్‌పై నాగీ ఆవిష్కరించిన విజువల్ వండర్‌గా కల్కి నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా జూన్ 27న రిలీజైన ఈ సినిమా మొన్నటికి 50 రోజులు కంప్లీట్ చేసుకుంది. బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు సృష్టిస్తూ కలెక్షన్ల కుంభవృష్టి కురిపించింది. వరల్డ్ వైడ్‌గా దాదాపు రూ.1200 కోట్ల వసూళ్లను సాధించి రికార్డు సృష్టించింది.
నాలుగు వారాలకే సినిమాలు చాప చుట్టేస్తున్న ఈ కాలంలో 50 రోజులు విజయవంతంగా పూర్తి చేసుకున్న మూవీగా కల్కి మరో ఘనతను సొంతం చేసుకుంది. అత్యధిక వసూళ్లు సాధించిన భారతీయ చిత్రాల్లో ఒకటిగా నిలిచి తెలుగు సినిమా ఖ్యాతీని మరోసారి ప్రపంచానికి చాటి చెప్పింది. సైన్స్ ఫిక్షన్ , టైమ్ ట్రావెల్ ఎలిమెంట్స్‌ని భారతీయులు చేయలేరంటూ వినిపించే మాటలకు కల్కి సమాధానం చెప్పి.. వాళ్ల నోళ్లు మూయించింది.

బాలీవుడ్ బిగ్‌బీ అమితాబ్ బచ్చన్, యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్, దీపికా పదుకొణె, మృణాల్ ఠాకూర్, మాళవిక మోహనన్, దిశాపటానీలు కీలక పాత్ర పోషించిన కల్కిలో ఎస్ఎస్ రాజమౌళి, రామ్ గోపాల్ వర్మ, విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్‌లు గెస్ట్ రోల్‌లో కనిపించి ప్రేక్షకులను అలరించారు. వైజయంతీ మూవీస్ బ్యానర్‌లో ఈ సినిమాను అశ్వినీదత్ నిర్మించారు. దాదాపు 40 ఏళ్ల తర్వాత దిగ్గజ నటులు కమల్ హాసన్ - అమితాబ్ బచ్చన్‌లు ఈ సినిమాలో నటించడం విశేషం.
50 రోజులు రన్ పూర్తి చేసుకున్న సందర్భంగా చిత్ర యూనిట్ ఓ పోస్టర్ రిలీజ్ చేసింది. ఇంతటి భారీ విజయాన్ని అందించినందుకు గాను ప్రేక్షకులకు వైజయంతీ మూవీస్ కృతజ్ఞతలు తెలిపింది. ఇదిలాఉండగా.. కల్కి 2898 ఏడీ 50 రోజులు పూర్తి చేసుకున్న సందర్భాన్ని పురస్కరించుకుని హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్‌లోని సంధ్య థియేటర్‌లో గ్రాండ్‌గా సెలబ్రేషన్స్ నిర్వహించారు. దర్శకుడు నాగ్ అశ్విన్ తదితరులు ఈ ఈవెంట్‌లో పాల్గొనగా.. సంధ్య థియేటర్ యాజమాన్యం, ప్రభాస్ అభిమానులు ఆయనను ఘనంగా సన్మానించారు.

ఇంతటి బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన కల్కి 2898 ఏడీ ఓటీటీలోకి ఎప్పుడొస్తుందా అని మూవీ లవర్స్ కొన్నిరోజులుగా వెయిట్ చేస్తున్నారు. ఈ ఉత్కంఠకు తెరదించుతూ చిత్ర యూనిట్ కీలక ప్రకటన చేసింది. కల్కిని రెండు ఓటీటీ ఫ్లాట్‌ఫామ్స్ వేదికగా రిలీజ్ చేస్తున్నట్లు వెల్లడించింది. హిందీ వెర్షన్ ఆగస్ట్ 22న నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతుందని.. అదే రోజున తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం తదితర భాషల్లో అమెజాన్ ప్రైమ్ వేదికగా రిలీజ్ అందుబాటులోకి వస్తుందని వెల్లడించింది. ఈ రెండు ఓటీటీ సంస్థలు కూడా ఈ విషయాన్ని ధ్రువీకరించాయి.


Click it and Unblock the Notifications











