twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ప్రభాస్, నాగ్ అశ్విన్ మూవీ: మ్యూజిక్ డైరెక్టర్ ఫిక్స్.. ఈ కాంబోను కలలో కూడా ఊహించి ఉండరు

    |

    పాన్ ఇండియా హీరో రెబల్ స్టార్ ప్రభాస్ వరుసగా నాలుగు సినిమాలను లైన్ లో పెట్టిన విషయం తెలిసిందే. ఆ సినిమాలన్నీ ఎప్పుడు వస్తాయో గాని సినిమాకు సంబంధించిన అప్డేట్స్ మాత్రం ఆగడం లేదు. ఒక దాని తరువాత మరొకటి వస్తూనే ఉన్నాయి. ముఖ్యంగా దర్శకుడు నాగ్ అశ్విన్ ఇంకా ప్రీ ప్రొడక్షన్ లోనే ఉన్నప్పటకి అప్డేట్స్ ఇవ్వడం మాత్రం ఆపడం లేదు. ఇక ఫైనల్ గా ప్రభాస్ సినిమాకు ఎవరు ఉహించని మ్యూజిక్ డైరెక్టర్ ను సెలెక్ట్ చేసుకున్నారు.

    ఇన్నాళ్లకు అసలైన సినిమా..

    ఇన్నాళ్లకు అసలైన సినిమా..

    టాలీవుడ్ ఇండస్ట్రీలో 50ఏళ్ళ చరిత్ర కలిగిన ప్రతిష్టాత్మక బ్యానర్ వైజయంతి నుంచి వస్తున్న అత్యంత బిగ్ బడ్జెట్ సినిమా ఇది. ఎవడే సుబ్రహ్మణ్యం, మహానటి వంటి సినిమాలతో క్రేజ్ అందుకున్న యువ దర్శకుడు నాగ్ అశ్విన్ భారీ సినిమాను తన భుజాలపై వేసుకున్నాడు. వైజయంతి నుంచి ఇన్నాళ్లకు అసలైన సినిమా రాబోతోంది అనేలా ప్రాజెక్టును డిజైన్ చేస్తున్నారు.

    ప్రభాస్ ఒప్పుకోవడానికి అసలు కారణం

    ప్రభాస్ ఒప్పుకోవడానికి అసలు కారణం

    సినిమా స్క్రిప్ట్ వినగానే ప్రభాస్ పెద్దగా ఆలోచించకుండా సినిమా చేయడానికి ఒప్పుకున్నట్లు గత ఇంటర్వ్యూలలోనే నాగ్ అశ్విన్ క్లారిటీ ఇచ్చాడు. ప్రభాస్ కు ఇష్టమైన నటిమణుల్లో సావిత్రి ఒకరు. అలాంటి మహానటి జీవితాన్ని వెండితెరపై అద్భుతంగా చూపించడంతోనే నాగ్ అశ్విన్ ప్రభాస్ అతనిపై ఇంప్రెస్ అయ్యాడు.

    అంచనాలను పెంచేస్తున్న నాగ్ అశ్విన్

    అంచనాలను పెంచేస్తున్న నాగ్ అశ్విన్

    ఇక సినిమాకు సంబంధించిన అప్డేట్స్ ఎప్పటికప్పుడు సినిమాపై అంచనాలను పెంచేస్తున్నాయు. దర్శకుడు నాగ్ అశ్విన్ రూమర్స్ కు ఏ మాత్రం అవకాశం ఇవ్వకుండా ఎనౌన్స్మెంట్స్ ఇస్తున్నాడు. ఇక ఇప్పటికే దీపికా పదుకొనె, ఆమోతాబ్ బచ్చన్ వంటి బాలీవుడ్ స్టార్స్ సినిమాలో నటిస్తున్నట్లు క్లారిటీ ఇచ్చిన విషయం తెలిసిందే.

     కలలో కూడా ఊహించని విధంగా..

    కలలో కూడా ఊహించని విధంగా..

    సాధారణంగా ప్రభాస్ సినిమా అనగానే టెక్నీషియన్స్ చాలా వరకు పెద్ద పెద్ద సినిమాలకు పని చేసినవారే ఉంటారు. ముఖ్యంగా మ్యూజిక్ డైరెక్టర్ విషయంలో దర్శకనిర్మాతలు ఏ మాత్రం రిస్క్ తీసుకోరు. కానీ కలలో కూడా ఊహించని విధంగా నాగ్ అశ్విన్ సరికొత్త కాంబినేషన్స్ సెట్ చేస్తున్నాడు. మహానటి సినిమాటోగ్రఫీ అందించిన డానీ ఈ సినిమాకు వర్క్ చేయనున్నాడు.

     మిక్కీ జె మేయర్ ఫిక్స్..

    మిక్కీ జె మేయర్ ఫిక్స్..

    ఇక ఈ సైన్స్ ఫిక్షన్ సినిమాకు మిక్కీ జె మేయర్ మ్యూజిక్ అందినున్నట్లు క్లారిటీ ఇచ్చేశారు. శేఖర్ కమ్ముల సినిమాలతో ఎంతగానో క్రేజ్ అందుకొని లవ్ స్టోరీలకు ఫ్యామిలీ డ్రామాలకు అద్భుతమైన మ్యూజిక్ అంధించాడు ఈ కంపోజర్. ఇక మహానటి సినిమాతో నాగ్ అశ్విన్ మిక్కీ జె మేయర్ తో వర్క్ చేసిన విషయం తెలిసిందే.

    మొదటిసారి పాన్ ఇండియా ప్రాజెక్ట్

    మొదటిసారి పాన్ ఇండియా ప్రాజెక్ట్

    మహానటి సినిమాకు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా అద్భుతంగా ఇచ్చాడు మిక్కీ జె మేయర్. ఈ కంపోజర్ గత 15 ఏళ్లకు పైగా ఇండస్ట్రీలో ఎన్నో లవ్ స్టోరీలకు మ్యూజిక్ అందించి మంచి క్రేజ్ అందుకున్నాడు. కానీ ఇంతవరకు అగ్ర హీరోల సినిమాలకు మ్యూజిక్ అందించే అవకాశం రాలేదు. ఇక ఫైనల్ గా నాగ్ అశ్విన్ ద్వారా ఏకంగా ప్రభాస్ పాన్ ఇండియా సినిమా రావడంతో అంచనాలు భారీగా పెరిగిపోయాయి. మరి మిక్కీ ఎలాంటి మ్యూజిక్ ఇస్తాడో చూడాలి.

    English summary
    Prabhas' 21st project is being produced in Vyjayanthi Movies under the direction of Mahanati fame Nag Ashwin. However, there are many types of rumors on the budget of this film. Pan India cinema is therefore likely to cost up to Rs 500 crore. There are reports that producer is planning the film in high range rather than RRR with confidence in the director.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X