రాముడి పాత్ర కోసం కోర మీసాలతో ప్రభాస్.. నెవర్ బిఫోర్ లుక్ వైరల్

రెబల్ స్టార్ ప్రభాస్ టాలీవుడ్ లోనే కాకుండా ఇతర ఇండస్ట్రీలోని దర్శకులతో కూడా సినిమాలు చేస్తున్న విషయం తెలిసిందే. ఇండియా మొత్తం ఉన్న అగ్ర హీరోల్లో అందరికంటే ఎక్కువ సినిమాలను లైన్ లో పెట్టిన ఏకైక హీరో మన ప్రభాస్. వరుసగా కమిట్మెంట్స్ ఇచ్చిన డార్లింగ్ ఎలాంటి సినిమా చేసినా కూడా పాన్ ఇండియా రేంజ్ లోనే వస్తాయని స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ఇక ఆదిపురుష్ అయితే మరో లెవెల్లో ఉంటుందని చెప్పవచ్చు. ఆ సినిమాకు సంబంధించిన లుక్ కూడా రెడీ చేసుకున్నాడు ప్రభాస్.

Recommended Video

Adipurush చిత్ర యూనిట్ కి తప్పిన పెను ప్రమాదం ! | Prabhas | Saif Ali Khan
ఆదిపురుష్ తో బిజీగా..

ఆదిపురుష్ తో బిజీగా..

ముందుగా ప్రభాస్ లైనప్ గురించి మాట్లాడుకుంటే.. ఒక సినిమా తరువాత మరొక సినిమాను స్టార్ట్ చేయకుండా రెండు మూడు సినిమాలను ఒకేసారి ఫినిష్ చేయాలని ప్లాన్ చేసుకుంటున్నాడు. ఇప్పట్లో అయితే మరో కొత్త సినిమాను ఎనౌన్స్ చేసే అవకాశం లేదని అర్ధమవుతోంది. ఇక రానున్న రోజుల్లో డార్లింగ్ ఎక్కువగా ఆదిపురుష్ సినిమాతో బిజీ కానున్నాడు.

నెక్స్ట్ రాధేశ్యామ్..

నెక్స్ట్ రాధేశ్యామ్..

రెబల్ స్టార్ లైనప్ మామూలుగా లేదు. ఇండియా మొత్తంలో ఎక్కువగా 6 సినిమాలను లైన్ లో పెట్టిన ఏకైక హీరో ప్రభాస్. ముందుగా 20వ సినిమా రాధేశ్యామ్ ను విడుదలకు సిద్ధం చేస్తున్న విషయం తెలిసిందే. సినిమాకు సంబంధించిన పనులన్ని దాదాపు ఏండింగ్ కు వచ్చేశాయి. చిన్న టీజర్ కూడా వచ్చేసింది. ఇక సినిమాను జూలై 31న విడుదల చేయనున్న విషయం తెలిసిందే.

సంక్రాంతికి సలార్

సంక్రాంతికి సలార్

రాధేశ్యామ్ తరువాత 21వ సినిమాగా సలార్ రానుంది. KGF డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తెరకెక్కించబోయే ఆ సినిమా షూటింగ్ కూడా ఇటీవల స్టార్ట్ అయ్యింది. ఈ సినిమా కోసం ప్రభాస్ ఒక స్పెషల్ షెడ్యూల్ ను ప్లాన్ చేసుకున్నాడు. వచ్చే ఏడాది సంక్రాంతికి ఎలాగైనా సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు రావాలని కష్టపడుతున్నాడు.

ఫుల్ గ్రాఫిక్స్ తో ఆదిపురుష్..

ఫుల్ గ్రాఫిక్స్ తో ఆదిపురుష్..


ఇక 22వ ప్రాజెక్ట్ ఆదిపురుష్ తో కూడా ప్రభాస్ సరికొత్త కిక్కివ్వబోతున్నట్లు తెలుస్తోంది. రామాయణం కథ ఆధారంగా తెరకెక్కబోతున్న ఆ సినిమాలో ప్రభాస్ రాముడి పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. పూర్తిగా VFX సపోర్ట్ తోనే ఆ సినిమాను షూట్ చేస్తున్నారు. ఇక ఆ సినిమాలో రావణుడిగా సైఫ్ అలీ ఖాన్ నటిస్తున్న విషయం తెలిసిందే.

ప్రభాస్ న్యూ లుక్

ప్రభాస్ న్యూ లుక్


ఇక ఆ సినిమాకు సంబంధించిన కొత్త షెడ్యూల్ ను త్వరలోనే స్టార్ట్ చేస్తుండడంతో ప్రభాస్ కోర మీసాలతో రెడీ అయ్యాడు. ఫిట్నెస్ లో కూడా మార్పులు చేసినట్లు తెలుస్తోంది. రాముడిగా కనిపించాలి అంటే ఫిట్నెస్ చాలా అవసరమని అలాగే సిక్స్ ప్యాక్ కూడా మరోసారి ట్రై చేస్తున్నట్లు సమాచారం. ప్రభాస్ న్యూ లుక్ కు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో అయితే బాగానే వైరల్ అవుతున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X