Prabhas: ప్రభాస్ న్యూ లుక్ వైరల్.. ఇది స్పిరిట్ అప్డేటా? ఫౌజీ సర్‌ప్రైజా?
సలార్,కల్కి వంటి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్స్ తర్వాత పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas) రేంజ్ పూర్తిగా మారిపోయింది. డార్లింగ్ నుండి వస్తున్న సినిమాలు అంటే సహజంగానే అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉంటాయి. ఈ సంక్రాంతికి 'ది రాజాసాబ్' సినిమా ఆశించిన ఫలితాన్ని అందుకోకపోయినా.. మిక్స్డ్ టాక్ లో కూడా భారీ వసూలు చేసి రికార్డు క్రియేట్ చేసింది. అయితే ఆ ఫలితాన్ని పక్కనపెట్టి... ప్రభాస్ నటిస్తున్న 'ఫౌజీ', 'స్పిరిట్' సినిమాల కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో ప్రభాస్ నుంచి వచ్చే ప్రతి చిన్న అప్‌డేట్ కూడా సోషల్ మీడియాలో భారీ బజ్ క్రియేట్ చేస్తుంది. అలా తాజాగా ప్రభాస్ న్యూ లుక్ నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది.
ఇలాంటి సమయంలో తాజాగా ప్రభాస్ సరికొత్త మేకోవర్‌తో మరోసారి సోషల్ మీడియాను షేక్ చేశారు. ఇటీవల విడుదలైన చిన్న చిత్రాల్లో 'కపుల్ ఫ్రెండ్లి'మంచి హిట్‌గా నిలిచింది. యంగ్ హీరో సంతోష్ శోభన్, అందాల భామ మానస వారణాసి జంటగా నటించిన ఈ ఫీల్ గుడ్ లవ్ స్టోరీకి ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. ఈ సక్సెస్ జోరులోనే పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ మూవీ ప్రమోషన్లకు సపోర్ట్ ఇవ్వడం హైలైట్‌గా మారింది. తాజాగా విడుదలైన స్పెషల్ ఇంటర్వ్యూ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఈ ఇంటర్వ్యూలో ప్రభాస్ అల్ట్రా స్టైలిష్ లుక్‌లో కనిపించడంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. పక్కాగా సెట్ చేసిన హెయిర్ స్టైల్, రఫ్ గడ్డం, ట్రెండీ డ్రెస్సింగ్‌తో డార్లింగ్ మునుపటి గ్లామర్‌ను గుర్తుచేశారు. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. అలాగే.. సోషల్ మీడియాలో వెంటనే డిస్కషన్ మొదలైంది. ఈ లుక్ హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న యుద్ధ నేపథ్య సినిమా 'ఫౌజీ' కోసమా? లేక సందీప్ రెడ్డి వంగా తెరకెక్కిస్తున్న 'స్పిరిట్' కోసమా అనేది హాట్ టాపిక్ గా మారింది. కొందరు 'ఫౌజీ కోసం ఈ రఫ్ లుక్ మెయింటైన్ చేస్తున్నాడు'అంటుంటే.. మరికొందరు మాత్రం 'ఇది కచ్చితంగా స్పిరిట్ లుక్!'అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.
ముఖ్యంగా స్పిరిట్ సినిమా విషయంలో ఇప్పటికే భారీ బజ్ నెలకొంది. సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్‌లో ప్రభాస్ నటించడం ఇదే తొలిసారి కావడంతో ఈ ప్రాజెక్ట్‌పై పాన్ ఇండియా స్థాయిలో అంచనాలు ఏర్పడ్డాయి. ఇటీవల ఏఐ ద్వారా క్రియేట్ చేసిన ప్రభాస్ పోలీస్ గెటప్ ఫోటోలు కూడా వైరల్ కావడంతో... 'ఇదే స్పిరిట్ లుక్ అయ్యుండొచ్చా?'అనే ఆసక్తి మరింత పెరిగింది. ప్రభాస్‌కు ఉన్న పాన్ ఇండియా ఇమేజ్ కారణంగా ఇప్పుడు ఏ చిన్న విజువల్ బయటకొచ్చినా దేశవ్యాప్తంగా నిమిషాల్లో వైరల్ అవుతోంది. ఇండియాలోనే కాదు, విదేశాల్లో ఉన్న అభిమానుల వరకూ ఈ అప్‌డేట్స్ చేరిపోతున్నాయి.
ప్రస్తుతం ప్రభాస్ లైనప్ కూడా అదే స్థాయిలో పవర్‌ఫుల్‌గా ఉంది. అందులో ఫౌజీ, స్పిరిట్, సలార్ పార్ట్ 2, కల్కి పార్ట్ 2 ఇలా వరుసగా భారీ ప్రాజెక్ట్స్ క్యూలో ఉన్నాయి. మొత్తానికి ప్రభాస్ తాజా లుక్ స్పిరిట్ కోసం అయినా, ఫౌజీ కోసం అయినా డార్లింగ్ మేకోవర్ మాత్రం అభిమానుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. అధికారిక క్లారిటీ ఇంకా రాకపోయినా.. ఈ లుక్‌తో ప్రభాస్ మరోసారి సోషల్ మీడియాను షేక్ చేయడంలో మాత్రం పూర్తిగా సక్సెస్ అయ్యారని చెప్పాల్సిందే.


Click it and Unblock the Notifications











