Don't Miss!
- News అయ్యయ్యో.. అపర చాణిక్యుడు కేసీఆర్ అస్తిత్వ పోరాటం!!
- Sports రోహిత్ శర్మ ప్లేస్లో..!!
- Lifestyle Love Horoscope For April 2024:ఈ రాశులకి ఏప్రిల్ లో LOVE సక్సెస్ అవుతుంది..మరికొందరికి అడ్డంకులు తప్పవు
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
ప్రభాస్ కూడా వచ్చాడంటే బాక్సాఫీస్ ఫైట్ మామూలుగా ఉండదు
పాన్ ఇండియా సినిమాలతో తన మార్కెట్ ని అంతకంతకు పెంచుకుంటున్న రెబల్ స్టార్ ప్రభాస్ నెక్స్ట్ రాధేశ్యామ్ సినిమాతో ఎలాంటి హిట్ అందుకుంటాడో అని ఆడియెన్స్ ఆతృతగా ఎదురుచూస్తున్నారు. బాహుబలి, సాహో అంటే యాక్షన్ సన్నివేశాలు ఉన్నాయి కాబట్టి హైప్ బాగా క్రియేట్ అయ్యింది. కలెక్షన్స్ కూడా నార్త్ లో సాలీడ్ గా వచ్చాయి. కానీ డార్లింగ్ ఈ సారి ఫుల్ రొమాంటిక్ లవ్ స్టోరీతో బాక్సాఫీస్ హిట్ అందుకోవాలని చూస్తున్నాడు.
రాధేశ్యామ్ సక్సెస్ అయితే గనక ప్రభాస్ కి వేరే భాషల్లో కూడా అలా డిఫరెంట్ ఇమేజ్ క్రియేట్ అవుతుందని చెప్పవచ్చు. ఇక ఆ సినిమా రిలీజ్ విషయంలో చిత్ర యూనిట్ ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. చిత్ర నిర్మాతలు దర్శకుడు ఇటీవల నిర్వహించిన చర్చలలో సంక్రాంతి ఫెస్టివల్ సరైన టార్గెట్ అని ఒక నిర్ణయానికి వచ్చినట్లు టాక్. సంక్రాంతి లోపు పరిస్థితులు ఎలా ఉంటాయో తెలియదు గాని ..అనుకూలిస్తే మాత్రం థియేటర్స్ నిండిపోవడం కాయం. ఎందుకంటే ఆడియెన్స్ బిగ్ స్క్రీన్ పై సినిమా చూసి చాలా కాలమవుతోంది.
ఇక కరోనా తీవ్రత తగ్గితే పెద్ద సినిమాలకు ఈజీగా డిమాండ్ పెరుగుతుంది. ఇక సంక్రాంతి రేసులో రెడ్, క్రాక్, వకీల్ సాబ్ లు కూడా ఉన్నాయి. అఖిల్ కూడా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాను అప్పుడే రిలీజ్ చేయాలని అనుకుంటున్నాడు. ఇక ఇప్పటికే పోటీ ఎక్కువయ్యింది అనుకుంటున్నా సమయంలో ప్రభాస్ కూడా అదే ఫెస్టివల్ ని టార్గెట్ చేయడంతో బాక్సాఫీస్ ఫైట్ పై అంచనాలు ఎక్కువవుతున్నాయి. ఇక కొందరు హీరోలు మళ్ళీ ఆలోచనలో పడ్డట్లు తెలుస్తోంది. ఇక రాధేశ్యామ్ సినిమాకు సంబంధించిన టీజర్ ని త్వరలో రిలీజ్ చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం.