Adipurush Trailer: విజువల్ వండర్‌గా ఆదిపురుష్ ట్రైలర్.. ట్రోలింగ్‌కు చెక్? ఫ్యాన్స్‌కు పండగే!

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ వరుస చిత్రాలతో బిజీగా ఉన్నాడు. దాదాపుగా డార్లింగ్ చేతిలో 6 పెద్ద ప్రాజెక్ట్స్ ఉన్నాయి. వాటిలో ఒకటి ఆదిపురుష్. రామాయణ గాథతో తెరకెక్కుతున్న ఈ సినిమాపై ఎక్స్ పెక్టేషన్స్ భారీగానే నెలకొన్నాయి. అయితే ఈ సినిమా మొదటి నుంచి పలు వివాదాలు, విమర్శలకు గురి అవుతూ వచ్చిన విషయం తెలిసిందే. కానీ ఈ సినిమాపై డార్లింగ్ అభిమానులు మాత్రం గంపెడు ఆశలు పెట్టుకున్నారు. వారి అంచనాలకు తగినట్లుగా తాజాగా ట్రైలర్ విడుదల చేశారు.

దేశవ్యాప్తంగా ప్రమోషన్స్ : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ రాముడి పాత్రలో ఓం రౌత్ దర్శకత్వం వహించిన పౌరాణిక చిత్రం ఆదిపురుష్. ఈ సినిమాను జూన్ 16న ప్రపంచవ్యాప్తంగా పాన్ ఇండియా రేంజ్ లో గ్రాండ్ రిలీజ్‌ చేయనున్నారు. రామాయణం ఆధారంగా తెరకెక్కిన ఈ భారీ బడ్జెట్ మూవీ ప్రేక్షకులలో విపరీతమైన బజ్‌ని సృష్టిస్తోంది. దేశవ్యాప్తంగా ప్రమోషన్స్ ప్లాన్ చేస్తోంది చిత్ర బృందం. ఇందులో భాగంగానే ఆదిపురుష్ ట్రైలర్, ప్రీ రిలీజ్ ఈవెంట్స్ ను ప్లాన్ చేశారు.

adipurush

ట్రైలర్ రిలీజ్ : ఆదిపురుష్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుపతిలో నిర్వహించున్నారట. ఈ కార్యక్రమాన్ని మూవీ విడుదలయ్యే నెల మొదటి వారంలో అంటే జూన్ 3న చాలా గ్రాండ్ గా నిర్వహించనున్నారని టాక్ వస్తోంది. ఇక ఇదివరకే ఆదిపురుష్ ట్రైలర్ ను మే 9న అట్టహాసంగా రిలీజ్ చేస్తామని మేకర్స్ అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే. చెప్పినట్లుగానే తాజాగా ట్రైలర్ ను విడుదల చేశారు.

adipurush

రాముడి గొప్పతనం : ఆదిపురుష్ ట్రైలర్ విషయానికొస్తే.. ఇది నా రాముడి కథ. ఆయన మనిషిగా పుట్టిన భగవంతుడిగా మారిన మహనీయుడు. ఆయన నామం రాఘవ అంటూ హనుమంతుడు చెబుతున్నట్లుగా ట్రైలర్ ను ప్రారభించారు. ప్రాణాల కంటే మర్యాద గొప్పదని రాముడు భావిస్తాడని చెబుతూ ఆయన గొప్పదనాన్ని చూపించారు. రాముడి జీవితం, దర్మార్గానికి సన్మార్గానికి నిదర్శనం, ఆయన ధర్మం.. అధర్మానికి ఉన్న అహంకారాన్ని అంతం చేసిందంటూ పలు డైలాగ్స్ ఆకట్టుకున్నాయి.

adipurush

యుద్ధానికి సిద్ధం : సీతను రావణుడు ఎత్తుకెళ్లడం, ఒంటరిగా సీత ఉండటం, ప్రాణ సఖి సీతను కాపాడుకోవడం కోసం వానర సైన్యంత రాముడు యుద్ధానికి సిద్ధం కావడం వంటి సన్నివేశాలతో ఆసక్తిగా ట్రైలర్ మలిచారు. అలాగే హనుమంతుడి బలం ఏంటో చూపించేలా కొండను ఎత్తే సీన్ ఆకట్టుకుంది. సీతగా కృతీ సనన్ చాలా అందగా కనువిందు చేసింది. రాముడిగా ప్రభాస్ ఆకట్టుకున్నాడు. ఇక రావణ బ్రహ్మగా సైఫ్ అలీఖాన్, హనుమంతుడిగాదేవ దత్తా నాగే, లక్ష్మణుడిగా సన్నీ సింగ్ అలరించారు.

టీజర్ తో పోలిస్తే : గత టీజర్ తో పోలిస్తే ఈ ట్రైలర్ లో గ్రాఫిక్స్ చాలా వరకు బాగానే కనువిందు చేశాయి. ఓవైపు యానిమేటేడ్ వానర సైన్యం గ్రాఫిక్స్ తో పాటు నటీనటుల వేషధారణలు ఆకట్టుకున్నాయి. ఈ ట్రైలర్ తో ఇప్పటివరకు జరిగిన ట్రోలింగ్ కు చెక్ పడినట్లే అనిపిస్తోంది. ముందు ముందు ఎలాంటి అవంతారాలు రాకుండా సినిమాను ప్రేక్షకులు ఎలా ఆదరిస్తారో అనేది చూడాలి మరి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X