Prabhas: ఓ తోడు కోసం ఎదురుచూస్తున్నా.. ప్రేమ, రిలేషన్‌పై ఓపెన్ అయిన ప్రభాస్

ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో మళ్లీ పెళ్లిళ్ల సీజన్ మొదలైంది. టాప్ స్టార్స్ అంతా ఒక్కొక్కరిగా పెళ్లిపీటలెక్కుతున్నారు. టాలీవుడ్‌లో త్వరలో విజయ్ దేవరకొండ - రష్మిక మందన్న జంట వివాహం చేసుకోబోతున్నట్లుగా గాసిప్స్ వస్తున్నాయి. ఇక మార్చి 6వ తేదీన హీరో అల్లు శిరీష్ తన ప్రియురాలు నయనిక రెడ్డి మెడలో మూడు ముళ్లు వేయనున్నారు. వీరు కాకుండా పలువురు స్టార్స్ కూడా పెళ్లి చేసుకునేందుకు సిద్ధమవుతున్నట్లుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

అయితే ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్స్ లిస్ట్ చాలా పెద్దది. ప్రభాస్, అనుష్క, త్రిష, శృతిహాసన్ తదితరులు ఇంకా పెళ్లి మాటెత్తడం లేదు. వీరందరిలో ముందు వరుసలో ఉన్నారు ప్రభాస్. ఆల్రెడీ 45 క్రాస్ చేసిన డార్లింగ్.. ఇప్పటికీ పెళ్లంటే చాలు పారిపోతున్నారు. కానీ ప్రభాస్ పెళ్లి చేసుకుంటే చూడాలని అభిమానులు, సినీ ప్రముఖులు, కుటుంబ సభ్యులు కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు.

Prabhas Opens Up About Love and Marriage Amid Tollywood Wedding Buzz

అందరు హీరోలపై వచ్చినట్లే ప్రభాస్ పైనా ఎన్నో రూమర్స్ వచ్చాయి. ఎంతోమంది ముద్దుగుమ్మలతో డార్లింగ్‌కు లింక్‌లు పెట్టేశారు. అయినా వీటిపై ప్రభాస్ స్పందించేవాడు కాదు.. ఓ నవ్వు నవ్వి ఊరుకునేవాడు. అయితే ప్రభాస్ పెళ్లి అనగానే టక్కున గుర్తొచ్చే పేరు అనుష్క శెట్టి. కెరీర్‌లో తొలిసారిగా బిల్లా సినిమాలో కలిసి నటించిన ఈ జంట హిట్ పెయిర్ అనిపించుకుంది. ఇద్దరి కటౌట్లే కాదు.. వ్యక్తిగత అభిరుచులు, మనస్తత్వాలు దగ్గరగా ఉండటంతో ప్రభాస్ - అనుష్కల గురించి దారుణంగా గాసిప్స్ వచ్చాయి. ఏఐ రాకతో వీరిద్దరికి పెళ్లి అయిపోయినట్లుగా కూడా ఫోటోలు చక్కర్లు కొట్టాయి. అయితే తమ మధ్య ఫ్రెండ్‌షిప్ తప్పించి ఏం లేదని ప్రభాస్, అనుష్కలు పలుమార్లు తెలిపారు. అటు ప్రభాస్ కుటుంబం కూడా ఆయనకి సంబంధాలు వెతికే పనిలో బిజీగా ఉన్నారు. ఆయన పెద్దమ్మ శ్యామలా దేవి.. ఎప్పటికప్పుడు రూమర్స్‌ను ఖండిస్తూనే వచ్చారు.

తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ప్రభాస్.. తన పెళ్లి, ప్రేమ, రిలేషన్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సంతోష్ శోభన్, మానస వారణాసి హీరో హీరోయినల్లుగా అశ్విన్ చంద్రశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ కపుల్ ఫ్రెండ్లీ. ప్రేమికుల దినోత్సవం కానుకగా ఫిబ్రవరి 14వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకొచ్చింది. రాజీవ్ కనకాల, యోగి బాబు, గోపరాజు రమణ, ప్రమోదిని తదితరులు ఈ చిత్రంలో ఇతర పాత్రలు పోషించారు. యూవీ కాన్సెప్ట్స్, అజయ్ కుమార్ పీ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా కపుల్ ఫ్రెండ్లీ యూనిట్ .. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌తో ప్రత్యేకంగా ఓ చిట్ చాట్ కార్యక్రమాన్ని నిర్వహించాయి. ఈ సందర్భంగా ప్రభాస్‌ను పెళ్లికి సంబంధించిన ప్రశ్న అడగ్గా ఆయన సిగ్గుపడ్డారు.

అందరికీ నా ఫుడ్ గురించి ఆలోచన. అప్పుడప్పుడూ రైల్వే స్టేషన్ నుంచి కూడా స్విగ్గీ చేయిస్తా. ఆదిపురుష్ షూటింగ్ బాంబేలో చేస్తున్నాం.. అందరం రూమ్‌లో కూర్చొని సీరియస్‌గా డిస్కషన్స్ చేసుకుంటున్నాం. మీకు బాంబే కాదు.. చెన్నై ఫుడ్ తెప్పిస్తానని చెప్పా. చెన్నై ఫుడ్ కోసం అందరూ వెయిట్ చేస్తున్నారు.. టైం గడుస్తోంది, కానీ ఫుడ్ మాత్రం రావడం లేదు. నేను మాత్రం ఈరోజు చెన్నై ఫుడ్ తినాల్సిందేనని ఫిక్స్ అయ్యా. చెన్నై నుంచి రావాలంటే ఆ మాత్రం టైం పడుతుంది కదా అని చెప్పడంతో అంతా షాక్ అయ్యారు. చెన్నై నుంచి క్యారియర్ వేసుకుని ఫ్లైట్‌లో వస్తున్నాడని చెప్పగా.. ఒకడు నిజంగానే వేడి వేడిగా క్యారియర్ ఓపెన్ చేయగానే నువ్వు మామూలొడివి కాదు. నేను లైఫ్‌లో నీలాంటివాడిని చూడలేదని అందరూ ఆశ్చర్యపోయారని ప్రభాస్ తెలిపారు.

మీ దృష్టిలో ప్రేమంటే ఏంటీ అని హీరోయిన్ మానస వారణాసి అడగ్గా.. ఇది పర్సనల్ క్వశ్చన్ కదా అని నవ్వేశారు ప్రభాస్. ఇప్పుడైతే అడగ్గానే గుర్తొచ్చేది మీ మూవీయే. నాకు కూడా ప్రేమలో పడాలని ఉంది, ఆ ఫీలింగ్ బాగుంటుంది. ఏమాయ చేశావే చూసినప్పుడు అనిపించింది. ఆ సినిమా చూసినప్పుడల్లా అనిపిస్తూ ఉంటుంది. వీలైతే ప్రేమిద్దాం డ్యూడ్.. పోయేదేముంది మహా అయితే తిరిగి ప్రేమిస్తారు అనే డైలాగ్‌ని శివగారు చాలా బాగా రాశారు. సూపర్ ఫిలాసఫి అది, కాంప్లికేటెడ్ లైఫ్‌ని చాలా సింపుల్‌గా చెప్పేశారు. నాక్కూడా అది ఫేవరెట్ డైలాగ్స్‌లో ఒకటి అని ప్రభాస్ తెలిపారు. ప్రస్తుతం ఆయన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. ప్రభాస్ మనసు ప్రేమ, పెళ్లిపై ఉందంటూ అభిమానులు సంతోషిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X