Prabhas: అందుకే పెళ్లి చేసుకోలేదు.. కాబోయే భార్య గురించి ప్రభాస్
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) ప్రస్తుతం వరుస భారీ సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ది రాజా సాబ్ (The Raja Saab)సినిమాతో సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ కామెడీ అండ్ హర్రర్ మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో శనివారం ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ఆయన చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. ముఖ్యంగా ప్రభాస్ పెళ్లిపై ఇచ్చిన సరదా సమాధానం అభిమానులను ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురిచేసింది. ప్రభాస్ క్రేజీ ఆన్సర్ అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తించింది. ఇంతకీ ఏమన్నారంటే?
ప్రభాస్ - మారుతి కాంబో మూవీ 'ది రాజా సాబ్'. ఈ మూవీని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తుండగా.. ఈ సినిమాలో ప్రభాస్ సరసన రిద్ధి కుమార్, మాళవిక మోహనన్, నిధి అగర్వాల్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ కీలక పాత్రలో కనిపించనుండటంతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. ఈ నేపథ్యంలో శనివారం సాయంత్రం హైదరాబాద్ శివారులో నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ అభిమానులతో కిక్కిరిసిపోయింది.

పెళ్లిపై ప్రభాస్ ఓపెన్
ఈ ఈవెంట్‌లో యాంకర్ సుమ ప్రభాస్‌ను పెళ్లి గురించి ప్రశ్నించగా, అక్కడే ఉన్న ఓ లేడీ అభిమాని ప్లకార్డ్ ద్వారా ఆయనకు కాబోయే భార్యలో ఉండాల్సిన లక్షణాలపై అడిగింది. దీనికి ప్రభాస్ చాలా సరదాగా స్పందిస్తూ.. 'అదే తెలియక ఇప్పటివరకు పెళ్లి చేసుకోలేదు' అని చెప్పాడు. ఇదే సమాధానాన్ని రెండుసార్లు రిపీట్ చేయడంతో అక్కడున్నవారంతా షాక్ అయ్యారు. 46 ఏళ్ల వయసు వచ్చినా ఇప్పటికీ పెళ్లి చేసుకోకపోవడానికి ఇదే కారణమని జోక్ చేయడం అభిమానులను నవ్వుల్లో ముంచేసింది.
అభిమానుల కోసమే పెళ్లి చేయడం లేదట!
ఇంతకుముందు 'కల్కి' ఈవెంట్‌లో కూడా ప్రభాస్ తన పెళ్లిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. లేడీ అభిమానులు ఫీల్ అవుతారనే కారణంతోనే పెళ్లి చేసుకోవడం లేదని సరదాగా చెప్పాడు. అయితే ఇవన్నీ ఫన్ కోణంలో చేసిన కామెంట్లే తప్ప, ఆయన నిజమైన నిర్ణయం ఏమిటో ఇప్పటికీ స్పష్టత లేదు. మరోవైపు ప్రభాస్ పెద్దమ్మ శ్యామలాదేవి మాత్రం ఆయన పెళ్లి కోసం ఆలయాలు తిరుగుతున్నారనే వార్తలు అభిమానుల్లో చర్చనీయాంశంగా మారాయి.
'స్పిరిట్' లుక్‌లో మైండ్ బ్లోయింగ్ ఎంట్రీ
ఇదిలా ఉంటే.. 'ది రాజా సాబ్' ఈవెంట్‌లో ప్రభాస్ కొత్త లుక్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. గెడ్డం, పెద్ద మీసాలతో ఆయన ఇచ్చిన ఎంట్రీ అభిమానులకు పూనకాలు తెప్పించింది. ఇది సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'స్పిరిట్' మూవీకి సంబంధించిన లుక్ అని తెలుస్తోంది. అంతర్జాతీయ స్మగ్లింగ్ నేపథ్యంతో రూపొందుతున్న ఈ చిత్రంలో ప్రభాస్ పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించనున్నారు. ఆయనకు పై అధికారిగా ప్రకాష్ రాజ్ నటిస్తుండటం మరో హైలైట్. ఇటీవల ప్రభాస్-ప్రకాష్ రాజ్‌ల మధ్య జరిగిన కన్వర్జేషన్ ఆడియో గూస్‌బంప్స్ తెప్పించిన విషయం తెలిసిందే.
మొత్తంగా చూస్తే.. 'ది రాజా సాబ్' ఈవెంట్‌లో ప్రభాస్ తన సరదా మాటలతో అభిమానులను ఆకట్టుకున్నాడు. పెళ్లి విషయంపై ఇంకా క్లారిటీ ఇవ్వకపోయినా, తన ఫన్నీ సమాధానాలతో మాత్రం అభిమానుల మనసులు గెలిచాడు. ఇక 'స్పిరిట్'లో ఆయన లుక్ చూస్తుంటే, రాబోయే రోజుల్లో ప్రభాస్ మరోసారి బాక్సాఫీస్‌ను షేక్ చేయడం ఖాయంగా కనిపిస్తోంది.


Click it and Unblock the Notifications











