ప్రభాస్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. బీ రెడీ ఫర్ ఫస్ట్ లుక్.. ఎప్పుడంటే..?
ప్రభాస్ సినిమా కోసం కేవలం టాలీవుడ్ మాత్రమే ఎదురుచూడటం లేదు.. మొత్తం నేషనల్ వైడ్‌గా అభిమానులు ఎంతో ఆత్రుతతో వెయిట్ చేస్తున్నారు. బాహుబలి, సాహో సినిమా ల తరువాత ప్రభాస్ ఓ పీరియాడిక్ లవ్ స్టోరీని ఎంచుకున్నాడు. జిల్ ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీ ఇప్పటికే సగభాగం షూటింగ్‌ను పూర్తి చేసుకుంది. తాజాగా ఈ మూవీ అప్‌డేట్స్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి.

వాయిదాలు పడుతూ..
ఓ డియర్, రాధేశ్యామ్ అనే టైటిల్స్ పరిశీలనలో ఉన్న ఈ మూవీ నిరంతరం అవంతరాలే ఎదురువుతున్నాయి. ఏ షెడ్యూల్ కూడా అనుకున్న సమయానికి పూర్తి కాలేదు. అప్పట్లో యూరప్‌కు వెళ్లి.. తిరిగి వచ్చారు. ఇక్కడ లోకల్‌లో సెట్స్ వేసి షూట్ చేద్దామంటే అది కాస్తా ఆలస్యమైంది. ఇలా ప్రతీసారి ఏదో అడ్డంకి ఏర్పడుతూనే ఉంది.
తాజాగా కరోనా..
అయితే కరోనా ఎంతగా విజృంభించినా.. ఈసారి మాత్రం చిత్రయూనిట్ మాత్రం వెనుకడుగు వేయలేదు. యూరప్ షెడ్యూల్ చేయాల్సిందేనని పట్టుబట్టారు. ప్రభాస్, పూజా హెగ్డేల మీద అదిరిపోయే సీన్స్ తెరకెక్కించారు. దీనికి సంబంధించిన విశేషాలను తెలియజేస్తూ దర్శకుడు ట్వీట్ చేశాడు.

షెడ్యూల్ పూర్తి..
పది డిగ్రీల చలి, మంచు వర్షం, కరోనా వైరస్ ఇలా ఏదీ కూడా యూనిట్ స్పిరిట్‌ను దెబ్బ తీయలేకపోయింది.. అంటూ ఆ మధ్య ట్వీట్ చేశాడు డైరెక్టర్. తాజాగా యూరప్ షెడ్యూల్ పూర్తయిందని, సహకరించిన జార్జియా టీమ్‌కు ధన్యవాదాలు తెలిపాడు.
Recommended Video

ఫస్ట్ లుక్ వచ్చేస్తోంది..
త్వరలోనే ప్రభాస్ ఫస్ట్ లుక్ రాబోతోందని స్వయంగా డైరెక్టర్ ప్రకటించాడు. అయితే ఈ ఫస్ట్ లుక్ ఉగాది కానుకగా రిలీజ్ కానుందని తెలుస్తోంది. ఇక ఈ లెక్కన ప్రభాస్ ఫ్యాన్స్‌కు డబుల్ ధమకానే రెండు పండుగలు ఒకే సారి అన్నమాట.


Click it and Unblock the Notifications











