Don't Miss!
- Sports
విరాట్ కోహ్లీ-రోహిత్ శర్మ మధ్య విభేదాలు నిజమే: మాజీ ఫీల్డింగ్ కోచ్ శ్రీధర్
- News
అగ్నివీరుల కోసం ఇకపై కామన్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్: పాన్ ఇండియా రిక్రూట్మెంట్స్: ఆర్మీ ప్రకటన
- Finance
adani issue: అదానీ వ్యవహారంపై స్పందించిన కేంద్ర మంత్రి.. హెచ్చుతగ్గులు సాధారణమేనంటూ వ్యాఖ్యలు
- Lifestyle
మీ సెక్స్ జీవితాన్ని మెరుగుపరచుకోవడానికి ఇలా చేయండి..సెక్స్ లో ఆనందాన్ని పొందండి!
- Technology
ఐఫోన్ 14 పై రూ.12000 వరకు ధర తగ్గింది! ఆఫర్ ధర ,సేల్ వివరాలు!
- Travel
ఏపీలో ఆధ్యాత్మిక పర్యాటకానికి టూరిజం శాఖ సరికొత్త రూట్ మ్యాప్!
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
RRR nomination for Golden Globes జక్కన్నను చూస్తే గర్వంగా ఉంది.. రాజమౌళిపై ప్రభాస్ ప్రశంసల వర్షం
ప్రపంచంలోనే అత్యంత గుర్తింపు, గౌరవం ఉన్న అవార్డులకు RRR చిత్రం నామినేట్ కావడంపై యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రశంసలు కురిపించారు. అమెరికాతోపాటు అంతర్జాతీయ సినిమా రంగంలో అద్బుతమైన, ఉత్తమ చిత్రాలు, సంగీతానికి అవార్డులను ఇచ్చే ప్రతిష్టాత్మక గోల్డెన్ గ్లోబ్ అవార్డులకు RRR చిత్రం నామినేట్ కావడం తెలిసిందే. హాలీవుడ్ ఫారిన్ ప్రెస్ అసోసియేషన్ ఇచ్చే ఈ అవార్డుకు దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి రూపొందించిన ఈ సినిమా ఎంపిక కావడంపై దేశవ్యాప్తంగా మంచి స్పందన లభిస్తున్నది. ఈ నేపథ్యంలో ప్రభాస్ తన ఇన్స్‌టాగ్రామ్‌లో పోస్టు పెడుతూ..

ది గ్రేటెస్ట్ ఎస్ఎస్ రాజమౌళి గారు ప్రపంచాన్ని జయించేందుకు సిద్ధంగా ఉన్నారు. ఉత్తమ డైరెక్టర్‌గా న్యూయార్క్ ఫిల్మ్ క్రిటిక్స్ సర్కిల్ అవార్డు, అలాగే లాస్ ఎంజెలెస్ ఫిల్మ్ క్రిటిక్స్ అవార్డ్స్‌ను అందుకొన్నందుకు కంగ్రాట్స్ అని గతంలో ప్రభాస్ పోస్టు పెట్టి అభినందించారు.
తాజాగా RRR మూవీ గోల్డెన్ గ్లోబ్ అవార్డు కోసం నామినేట్ కావడంపై ప్రభాస్ హర్షం వ్యక్తం చేశారు. RRR మూవీ గోల్డెన్ గ్లోబ్స్ అవార్డుకు నామినేట్ కావడం చాలా గర్వంగా ఉంది. ఈ ఘనతకు కారణమైన రాజమౌళి, జూనియర్ ఎన్టీఆర్, రాంచరణ్‌కు హృదయపూర్వక అభినందనలు. ఈ సందర్భంలో RRR మూవీ యూనిట్‌కు ప్రత్యేకంగా ధన్యవాదాలు అని ప్రభాస్ తన పోస్టులో తెలిపారు.
గోల్డెన్ గ్లోబ్స్ అవార్డు 2023 కోసం బెస్ట్ పిక్చర్, నాన్ ఇంగ్లీష్ కేటగిరీ అవార్డు, అలాగే బెస్ట్ ఒరిజినల్ సాంగ్ (నాటు నాటు) కేటగిరీలో నామినేట్ అయ్యింది. ఈ సినిమాకు ఎంఎం కీరవాణి సంగీతం అందించిన సంగతి తెలిసిందే.