Prabhas సలార్ 90 సెకన్ల బీభత్సం.. ఇది అస్సలు ఊహించలేదుగా?
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కు ఏ స్థాయిలో స్టార్ డమ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆయన సినిమా కోసం అభిమానులు వేయి కళ్లతో ఎదురుచూస్తుంటారు. అలాంటిది ఇటీవల విడుదలైన ఆదిపురుష్ సినిమా చాలానే నిరాశ పరిచింది. ఇక సినిమాల ఫలితాలు పట్టించుకోనంత బిజీగా మిగతా చిత్రాలతో ప్రభాస్ ఉన్న విషయం తెలిసిందే. ప్రభాస్ చేస్తున్న క్రేజీ చిత్రాల్లో సలార్ ఒకటి. కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాకు సంబంధించిన ఓ క్రేజీ అప్డేట్ చక్కర్లు కొడుతోంది. అదేంటనే విషయంలోకి వెళితే..
దివంగత నటుడు కృష్ణంరాజు నట వారసుడిగా తెలుగు చిత్ర పరిశ్రమలోకి హీరోగా ఎంట్రీ ఇచ్చాడు డార్లింగ్ ప్రభాస్. తన నటన, డ్యాన్స్, ఫైట్స్ అన్నిటికి మించి మ్యాన్లీ లుక్ తో అతి కొద్దిపాటి సమయంలోనే టాలీవుడ్‌లో స్టార్ హీరోగా ఎదిగాడు. రాజమౌళి తెరకెక్కించిన 'బాహుబలి' సినిమాతో ఒక్కసారిగా పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు ప్రభాస్. ఈ సినిమా ప్రభాస్ చేసిన పాన్ ఇండియా చిత్రాలు, సాహో, రాధేశ్యామ్ తీవ్ర నిరాశకు గురి చేశాయి. ఇక లేటెస్ట్ ఆదిపురుష్ కూడా అదే కోవలో చేరింది.

ఇప్పుడు ప్రభాస్ అభిమానులు తర్వాతి సినిమాపైనే ఆశలు పెట్టుకున్నారు. ప్రభాస్ చేతిలో ఏకంగా ఐదారు సినిమాలు ఉండగా వాటిలో సలార్ పై భారీ అంచనాలే నెలకొన్నాయి. కేజీఏఫ్ తో దేశవ్యాప్తంగా సెన్సేషన్ క్రియేట్ చేసిన ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వస్తున్న సలార్ మూవీలో శృతి హాసన్ హీరోయిన్ గా చేస్తున్న విషయం తెలిసిందే. అలాగే మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్ గా నటిస్తున్నాడని టాక్. పొగరు ఫేమ్ శ్రీయా రెడ్డి కూడా కీలక పాత్ర పోషిస్తోంది.
సలార్ కు సంబంధించి తాజాగా ఓ క్రేజీ అప్డేట్ అభిమానులను సంతోషపెట్టనుంది. సలార్ టీజర్ ను ఈవారంలోనే విడుదల చేయనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే దీనికి సంబంధించిన పని అంతా పూర్తయిందట. 90 సెకన్ల పాటు ఉన్న సలార్ టీజర్ ను జూలై 7న రిలీజ్ చేయనున్నారని టాక్. అదిరిపోయే హై ఓల్టేజ్ యాక్షన్ సీన్సుతో 90 సెకన్లపాటు సలార్ టీజర్ బీభత్సం క్రియేట్ చేస్తుందని అంటున్నారు. యూట్యూబ్ లోకి సలార్ టీజర్ వస్తే ఇండస్ట్రీ లెక్కలన్నీ మార్చేస్తుందని, టీజర్ ను ఈ వారంలో రిలీజ్ చేస్తారని అస్సలు ఊహించలేదని నెటిజన్లు తెలుపుతున్నారు. ఇక సలార్ సినిమాను సెప్టెంబర్ 28న విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.


Click it and Unblock the Notifications











