Don't Miss!
- News కాంగ్రెస్ ఖమ్మం సీటు పంచాయితీలో అనూహ్య మలుపు..!!
- Technology జియో సినిమా యాప్‌లో IPL మ్యాచ్‌లను ఉచితంగా చూస్తున్నారా.. రేపు కీలక ప్రకటన??
- Sports ఆ రూల్ వల్లే గెలిచాం- KL రాహుల్
- Automobiles క్రాష్ టెస్ట్‌లో హోండా అమేజ్‌కు గట్టి షాక్.. ఆ విభాగంలో ‘0' రేటింగ్.!!
- Lifestyle ఈ 4 రాశుల వారు ఉత్తమ సెక్స్ భాగస్వాములు అవుతారు... వీరిని లైఫ్ పార్ట్నర్ గా పొందడం అదృష్టం!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
ప్రభాస్ రాముడి లుక్ వైరల్.. ఆదిపురుష్ దర్శకుడు ఫిదా
పాన్ ఇండియా స్టార్ అనే పేరుకు సరైన బ్రాండ్ క్రియేట్ చేసుకున్న హీరో ప్రభాస్. బాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతో కాలంగా ఉంటున్న స్టార్స్ కి కూడా సాధ్యం కాలేని రికార్డులను అతను సొంతం చేసుకున్నాడు. బాహుబలి లాంటి ప్రభాస్ తో ఎంత భారీ బడ్జెట్ సినిమా అయినా చేయవచ్చని చాలా మందికి ఒక క్లారిటీ వచ్చేసింది. ఇక ప్రభాస్ బాలీవుడ్ టెక్నీషియన్స్ తో మొదటిసారి ఆదిపురుష్ అనే సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.
ఆ తరువాతనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ప్రభాస్
ఓం రావత్ దర్శకత్వంలో భారీ అంచనాలతో తెరకెక్కుతున్న ఆదిపురుష్ లో ప్రభాస్ రాముడి పాత్రలో కనిపించనున్నాడు. ఇప్పటికే సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు వేగాన్ని అందుకున్నాయి. దర్శకుడు ప్రభాస్ లుక్ పై కూడా ఒక క్లారిటీతో ఉన్నట్లు తెలుస్తోంది. ఓం రావత్ రాముడి పాత్ర డిజైన్ గురించి క్లారిటీ ఇచ్చిన తరువాతనే ప్రభాస్ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట.
ఎలా ఉండాలో అభిమానులే చెప్పేస్తారు.
అసలు మ్యాటర్ లోకి వస్తే.. సినిమాలో ప్రభాస్ రాముడిగా ఎలా కనిపిస్తాడు అనేది హాట్ టాపిక్ గా మారింది. ఇక ఫ్యాన్ మెడ్ పోస్టర్స్ కూడా చాలానే వైరల్ అవుతున్నాయి. ఈ రోజులల్లో అభిమానులే వారి హీరో ఎలా ఉండాలో దర్శకులకు ఒక హింట్ ఇస్తున్నారనే చెప్పాలి. ఇటీవల ఆదిపురుష్ కి సంబంధించిన ఒక స్పెషర్ కూడా పోస్టర్ చిత్ర యూనిట్ ని తాకింది.
దర్శకుడు ఓం రావత్ ఫిదా..
దర్శకుడు ఓం రావత్ కూడా ఆ పోస్టర్ ని చూసి ఎట్రాక్ట్ అయ్యారు. సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఎడిట్ చేసిన వారిని అభినందించారు. నిజంగా అద్భుతంగా ఉందని ఆయన చెప్పకనే చెప్పినట్లు చాలా ఈజీగా అర్ధమయ్యింది. ఇక ఆదిపురుష్ సినిమాలో ప్రభాస్ రాముడి పాత్ర ఇలానే ఉంటుందేమోనని అభిమానులు కూడా కామెంట్స్ చేస్తున్నారు.
త్వరలోనే స్పెషల్ అప్డేట్..
నిమిషాల్లోనే ఆ ఫ్యాన్ మేడ్ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది అంటే ప్రభాస్ లుక్ కోసం ఆడియెన్స్ ఏ రేంజ్ లో ఎదురుచూస్తున్నారో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ఇక రావణుడిగా సైఫ్ అలీ ఖాన్ నటించనున్న విషయం తెలిసిందే. ఇక మెయిన్ ఫిమేల్ లీడ్ సీత పాత్ర కోసం ఎలాంటి హీరోయిన్ ని సెలెక్ట్ చేసికోవాలా అని దర్శకుడు నిర్మాతలతో చర్చలు జరుపుతున్నారు. త్వరలోనే సినిమాకు సంబంధించిన ఒక స్పెషల్ అప్డేట్ వచ్చే అవకాశం ఉంది.