‘రాధే శ్యామ్’ నుంచి అదిరిపోయే అప్‌డేట్: వాటి కోసం మొదలు పెట్టిన ప్రభాస్
పాన్ ఇండియా హీరో యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ నటిస్తోన్న తాజా చిత్రం 'రాధే శ్యామ్'. ఫీల్ గుడ్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోన్న ఈ సినిమాను రాధాకృష్ణ కుమార్ తెరకెక్కిస్తున్నాడు. ఈ మూవీ షూటింగ్ ప్రారంభమై దాదాపు రెండేళ్లకు పైగానే అవుతోంది. అయినా చిత్రీకరణ మాత్రం ఇంకా పూర్తి కాలేదు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభాస్ మరికొన్ని చిత్రాలను ఒప్పుకుని వాటి షూటింగ్‌లో పాల్గొనడంతో పాటు కరోనా సెకెండ్ వేవ్ కారణంగా బ్యాలెన్స్ వర్క్ అలాగే ఉండిపోయింది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ భారీ సినిమా చివరి షెడ్యూల్ ఈరోజు ప్రారంభం అయింది.
'రాధే శ్యామ్' మూవీ చివరి షెడ్యూల్‌ను ఈరోజు హైదరాబాద్‌లో ప్రారంభించారు. దీనికి సంబంధించిన పిక్స్ కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఈ షెడ్యూల్‌లోనే సినిమా టాకీ పార్ట్ మొత్తాన్ని పూర్తి చేయబోతున్నారట. ఇక, ఇందులో ప్రభాస్‌పై కొన్ని గ్రీన్ మ్యాట్ సీన్స్ చిత్రీకరించనున్నారు. అలాగే, హీరో హీరోయిన్లపైనా కొన్ని లవ్ సీన్స్ షూట్ చేస్తారట. వీటితో పాటు కృష్ణంరాజు ప్రభాస్ కాంబినేషన్ సన్నివేశాలను సైతం షూట్ చేయబోతున్నారని అంటున్నారు. వీటితో పాటే ఓ వీఎఫ్ఎక్స్‌తో కూడిన సాంగ్‌ను కూడా తీస్తారనే టాక్ బాగానే వినిపిస్తోంది.

ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతోన్న 'రాధే శ్యామ్' మూవీలో యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ కార్ల దొంగగా నటిస్తున్నట్లు ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతోంది. అలాగే, ఇది పునర్జన్మలకు సంబంధించిన కథ అని కూడా అంటున్నారు. దీంతో ఈ సినిమాపై అంచనాలు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. ఇదిలా ఉండగా.. ఈ చిత్రాన్ని కృష్ణంరాజు సమర్పణలో యువీ క్రియేషన్స్, గోపీకృష్ణా మూవీస్ పతాకాలపై వంశీ, ప్రమోద్, ప్రశీద నిర్మిస్తున్నారు. పూజా హెగ్డే హీరోయిన్‌గా చేస్తోంది. ఇది తెలుగు, తమిళం, మలయాళం, కన్నడం, హిందీ భాషల్లో విడుదల కాబోతుంది.


Click it and Unblock the Notifications











