‘రాధే శ్యామ్’ షూటింగ్‌పై లేటెస్ట్ అప్‌డేట్: అప్పటి నుంచే మొదలు.. ఒకేసారి మొత్తం
యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ నటిస్తోన్న తాజా చిత్రం 'రాధే శ్యామ్'. రాధాకృష్ణ కుమార్ రూపొందిస్తోన్న ఈ సినిమా షూటింగ్ ప్రారంభమై దాదాపు రెండేళ్లకు పైగానే అవుతోంది. అయినప్పటికీ చిత్రీకరణ మాత్రం పూర్తవలేదు. దీనికితోడు పలు అవాంతరాలు ఎదురవడం వల్ల ఈ సినిమాను అనుకున్న సమయానికి విడుదల చేయలేదు. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ నిరాశగా ఉన్నారు. ఇక, ఇప్పుడు కరోనా రెండో దశ ప్రభావం కొంత మేర తగ్గడంతో ఈ సినిమా షూటింగ్‌ను పున: ప్రారంభించాలని చిత్ర యూనిట్ భావిస్తోంది. అందుకు అనుగుణంగానే తాజాగా ఓ ప్లాన్‌ను రెడీ చేసినట్లు తెలిసింది.
తాజా సమాచారం ప్రకారం.. 'రాధే శ్యామ్' మూవీ షూటింగ్ జూన్ మూడో వారం నుంచి ప్రారంభం కాబోతుందట. ఈ షెడ్యూల్‌లోనే టాకీ పార్ట్ మొత్తాన్ని పూర్తి చేయబోతున్నారని అంటున్నారు. ఇక, హైదరాబాద్‌లో జరగనున్న ఈ షెడ్యూల్‌లో ప్రభాస్‌పై కొన్ని గ్రీన్ మ్యాట్ సీన్స్ చిత్రీకరించనున్నారు. అలాగే, హీరో హీరోయిన్లపైనా కొన్ని లవ్ సీన్స్ షూట్ చేస్తారట. వీటితో పాటు కృష్ణంరాజు ప్రభాస్ కాంబినేషన్ సన్నివేశాలను సైతం షూట్ చేయబోతున్నారని అంటున్నారు. వీటితో పాటే ఓ వీఎఫ్ఎక్స్‌తో కూడిన సాంగ్‌ను కూడా తీస్తారనే టాక్ వినిపిస్తోంది. మొత్తంగా సింగిల్ షెడ్యూల్‌లోనే ఇవన్నీ కంప్లీట్ చేసేస్తారట.

ఎంతో ప్రతిష్టాత్మకంగా రాబోతున్న 'రాధే శ్యామ్' మూవీలో 1960 దశకం నాటి ప్రేమకథను చూపించబోతున్నారట. ఇప్పటికే దీని నుంచి విడుదలైన పోస్టర్లు, టీజర్‌కు భారీ స్థాయిలో స్పందన వచ్చింది. ఫలితంగా సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ఇక, ఈ చిత్రాన్ని కృష్ణంరాజు సమర్పణలో యువీ క్రియేషన్స్, గోపీకృష్ణా మూవీస్ పతాకాలపై వంశీ, ప్రమోద్, ప్రశీద నిర్మిస్తున్నారు. పూజా హెగ్డే హీరోయిన్‌గా చేస్తోంది. ఇది తెలుగు, తమిళం, మలయాళం, కన్నడం, హిందీ భాషల్లో విడుదల కాబోతుంది.


Click it and Unblock the Notifications











