Radhe Shyam Song: ప్రభాస్ ఫ్యాన్స్‌కు బిగ్ సర్‌ప్రైజ్.. అలాంటి పోస్టర్‌తో అంచనాలు రెట్టింపు

సుదీర్ఘ కాలంగా తెలుగు సినీ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్‌తో హవాను చూపించి.. ఇప్పుడు పాన్ ఇండియా స్టార్‌గా అన్ని పరిశ్రమలపై దండయాత్ర చేస్తున్నాడు మన తెలుగు హీరో ప్రభాస్. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన 'బాహుబలి'తో తన సత్తాను ప్రపంచానికి పరిచయం చేసిన ఈ స్టార్ హీరో.. దాని తర్వాత అన్నీ పాన్ ఇండియా చిత్రాలనే చేస్తున్నాడు. రెండేళ్ల క్రితమే 'సాహో' అనే భారీ చిత్రాన్ని అదించాడు. ఆ తర్వాత అంటే ఇప్పుడు జిల్ మూవీతో దర్శకుడిగా మంచి గుర్తింపును అందుకున్న రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో 'రాధే శ్యామ్' అనే సినిమాను చేశాడు.

పాన్ ఇండియా రేంజ్‌లో రాబోతున్న 'రాధే శ్యామ్' మూవీ షూటింగ్ ప్రారంభమై దాదాపు రెండేళ్లకు పైగా అవుతోంది. మధ్యలో కరోనా లాక్‌డౌన్‌తో పాటు పలు ఆటంకాలు ఏర్పడడంతో ఈ సినిమా చిత్రీకరణ ఆలస్యం అవుతూ వచ్చింది. దీంతో సుదీర్ఘ ప్రయాణం తర్వాత అంటే ఇటీవలే ఈ చిత్రానికి సంబంధించిన టాకీ పార్ట్ మొత్తాన్ని పూర్తి చేసింది చిత్ర యూనిట్. ప్రస్తుతం దీనికి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఈ చిత్రంలో గ్రీన్ మ్యాట్ సీన్స్ (గ్రాఫిక్) ఎక్కువగా ఉండడంతో దీనికి చాలా సమయం పడుతుందని తెలుస్తోంది. ఇప్పుడు యూనిట్ దీనిపైనే ఫోకస్ చేసినట్లు తెలిసింది.

Prabhass Radhe Shyam First Single on November 15th

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తోన్న 'రాధే శ్యామ్' చిత్రాన్ని సంక్రాంతి కానుకగా వచ్చే ఏడాది జనవరి 14న ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నారు. ఈ నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలను వీలైనంత త్వరగా ప్రారంభించి.. ప్రేక్షకులకు ఈ సినిమాను మరింత చేరువ చేయాలని చిత్ర యూనిట్ భావిస్తోంది. అందుకు అనుగుణంగానే ఇప్పటికే ఈ సినిమా నుంచి టీజర్‌ను కూడా విడుదల చేశారు. దీనికి భారీ స్థాయిలో రెస్పాన్స్ రావడంతో ఎన్నో రికార్డులు బద్దలైపోయాయి. ఈ క్రమంలోనే ఇప్పుడీ మూవీ నుంచి మరో కానుక రాబోతుంది. దీని గురించి చిత్ర యూనిట్ తాజాగా ప్రకటన విడుదల చేసింది.

క్రేజీ కాంబినేషన్‌లో రాబోతున్న 'రాధే శ్యామ్' మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ రాబోతుంది. దీన్ని నవంబర్ 15న సాయంత్రం 5 గంటలకు విడుదల చేయబోతున్నారు. ఈ రాతలే అంటూ సాగే మెలోడీ సాంగ్‌ను కృష్ణ కాంత్ రాయగా.. యువన్ శంకర్ రాజా ఆలపించినట్లు తెలుస్తోంది. ఇక, ఈ సినిమాకు సంబంధించి తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం భాషలకు గానూ జస్టిన్ ప్రభాకరన్ సంగీతం అందించనున్నారు. అలాగే, హిందీకి మాత్రం మిథున్, మనన్ భరద్వాజ్‌ను తీసుకున్నారు. ఆయా భాషలకు సంబంధించిన సింగర్లతో పాటలను పాడించారు. దీంతో ఇవన్నీ ఎంతో బాగా వచ్చినట్లు తెలిసింది.

Prabhass Radhe Shyam First Single on November 15th

రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా భారీ బడ్జెట్‌తో రూపొందుతోన్న 'రాధే శ్యామ్' మూవీలో ప్రభాస్ జ్యోతిష్యుడిగా నటిస్తోన్నాడు. అలాగే, ఇది టైమ్ ట్రావెల్ కథ అని, పునర్జన్మల నేపథ్యంతో సాగే సినిమా అని అంటున్నారు. దీన్ని కృష్ణంరాజు సమర్పణలో యువీ క్రియేషన్స్‌, గోపీకృష్ణా మూవీస్‌ పతాకాలపై వంశీ, ప్రమోద్‌, ప్రశీద నిర్మిస్తున్నారు. పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోంది. వీళ్లతో పాటు సచిన్ ఖేడ్కర్, మురళీ శర్మ, భాగ్యశ్రీ, ప్రియదర్శి, కునాల్ రాయ్ కపూర్, ఫ్లోరా జాకబ్ సహా ఎంతో మంది ప్రముఖులు కీలక పాత్రలను చేస్తున్న విషయం తెలిసిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X