For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ప్రభాస్ ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్: ‘రాధే శ్యామ్’ సర్‌ప్రైజ్ వచ్చేది ఇప్పుడు కాదట

    |

    ఇంత కాలం తెలుగు సినీ ఇండస్ట్రీలో హవాను చూపించి.. ఇప్పుడు పాన్ ఇండియా స్టార్‌గా అన్ని పరిశ్రమలపై దండయాత్రకు సిద్ధం అవుతున్నాడు యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన 'బాహుబలి'తో తన సత్తాను ప్రపంచానికి పరిచయం చేసిన ఈ స్టార్ హీరో.. దాని తర్వాత అన్నీ పాన్ ఇండియా చిత్రాలనే చేస్తున్నాడు. రెండేళ్ల క్రితమే 'సాహో' అనే భారీ చిత్రాన్ని అదించాడు. ఆ తర్వాత అంటే ఇప్పుడు జిల్ మూవీతో దర్శకుడిగా మంచి గుర్తింపును అందుకున్న రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో 'రాధే శ్యామ్' అనే సినిమాలో నటించాడు.

    అనసూయకు నెలలు అంటూ అభి సంచలన వ్యాఖ్యలు: ప్రెగ్నెన్సీపై అందరి ముందే ఊహించని ఆన్సర్

    'రాధే శ్యామ్' మూవీ షూటింగ్ ప్రారంభమై దాదాపు రెండేళ్లకు పైగా అవుతోంది. మధ్యలో కరోనా లాక్‌డౌన్‌తో పాటు పలు ఆటంకాలు ఏర్పడడంతో ఈ సినిమా చిత్రీకరణ ఆలస్యం అవుతూ వచ్చింది. దీంతో సుదీర్ఘ ప్రయాణం తర్వాత అంటే ఇటీవలే ఈ చిత్రానికి సంబంధించిన టాకీ పార్ట్ మొత్తాన్ని పూర్తి చేసింది చిత్ర యూనిట్. ప్రస్తుతం దీనికి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఈ చిత్రంలో గ్రీన్ మ్యాట్ సీన్స్ (గ్రాఫిక్) ఎక్కువగా ఉండడంతో దీనికి చాలా సమయం పడుతుందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో దీని నుంచి ఓ షాకింగ్ న్యూస్ లీకైంది.

     Prabhass Radhe Shyam First Single on October

    యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ నటిస్తోన్న 'రాధే శ్యామ్' చిత్రాన్ని సంక్రాంతి కానుకగా వచ్చే ఏడాది జనవరి 14న ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నారు. ఈ నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలను వీలైనంత త్వరగా ప్రారంభించి.. ప్రేక్షకులకు ఈ సినిమాను మరింత చేరువ చేయాలని చిత్ర యూనిట్ భావిస్తోంది. అందుకు అనుగుణంగానే 'రాధే శ్యామ్' ప్రమోషన్ కార్యక్రమాలను సెప్టెంబర్ నుంచి మొదలు పెట్టాలని డిసైడ్ అయ్యారని ఆ మధ్య వార్తలు వచ్చాయి. అయితే, తాజా సమాచారం ప్రకారం.. వాటిని ఈ నెలలో మొదలు పెట్టడం లేదట. అక్టోబర్ నుంచి అప్‌డేట్లను వదులుతారట.

    Evaru Meelo Koteeswarulu షోకు షాకింగ్ రేటింగ్: చరిత్ర సృష్టించిన ఎన్టీఆర్.. దానితో పోలిస్తే మాత్రం!

    'రాధే శ్యామ్' విడుదలకు చాలా ఎక్కువ సమయమే ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో అప్పుడే ప్రమోషన్ కార్యక్రమాలు మొదలు పెట్టాల్సిన అవసరం లేదని చిత్ర యూనిట్ ఆలోచిస్తున్నట్లు తాజాగా ఓ న్యూస్ ఫిలిం నగర్‌లో వైరల్ అవుతోంది. అంతేకాదు, వచ్చే నెలలో ఈ సినిమాలోని ఫస్ట్ సింగిల్‌ను విడుదల చేయాలని అనుకుంటున్నారట. ఆ నెలలో హీరో ప్రభాస్, హీరోయిన్ పూజా హెగ్డే పుట్టినరోజులు ఉన్నాయి. వాటిని పురస్కరించుకుని ఏదో ఒక రోజున ఈ చిత్రంలోని మొదటి పాటను విడుదల చేస్తారన్న టాక్ వినిపిస్తోంది. అప్‌డేట్ ఆలస్యం కావడంతో ఫ్యాన్స్ నిరాశగా ఉన్నారు.

    భారీ బడ్జెట్‌తో రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోన్న 'రాధే శ్యామ్' మూవీలో ప్రభాస్ కార్ల దొంగగా నటిస్తోన్నట్లు చాలా రోజులుగా ప్రచారం జరుగుతోంది. అలాగే, ఇది టైమ్ ట్రావెల్ కథ అని, పునర్జన్మల నేపథ్యంతో సాగే సినిమా అని అంటున్నారు. దీన్ని కృష్ణంరాజు సమర్పణలో యువీ క్రియేషన్స్‌, గోపీకృష్ణా మూవీస్‌ పతాకాలపై వంశీ, ప్రమోద్‌, ప్రశీద నిర్మిస్తున్నారు. పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోంది. వీళ్లతో పాటు సచిన్ ఖేడ్కర్, మురళీ శర్మ, భాగ్యశ్రీ, ప్రియదర్శి, కునాల్ రాయ్ కపూర్, ఫ్లోరా జాకబ్ సహా ఎంతో మంది ప్రముఖులు కీలక పాత్రలను చేస్తున్నారు.

    English summary
    Young Rebel Star Prabhas upcoming film is Radhe Shyam Under Radha Krishna Kumar Direction. This Movie First Single Release on October.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X