Radhe Shyam: నెల రోజుల ముందే బుకింగ్స్ మొదలు.. ఆ ఒక్క థియేటర్‌లో మాత్రమే అవకాశం
కొంత కాలంగా వరుసగా సినిమాల మీద సినిమాలను ప్రకటిస్తూ ఫుల్ జోష్‌తో కనిపిస్తున్నాడు పాన్ ఇండియన్ సూపర్ స్టార్ ప్రభాస్. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన 'బాహుబలి'తో తన స్టామినాను ప్రపంచానికి పరిచయం చేసుకున్న అతడు.. అప్పటి నుంచి వెనుదిరిగి చూడకుండా దూసుకుపోతున్నాడు. ఫలితంగా వరుసగా భారీ చిత్రాలను అనౌన్స్ చేస్తూ సత్తా చాటుతున్నాడు. ఇప్పటికే 'సాహో'తో ఉత్తరాది ప్రేక్షకులకు సైతం చేరువ అయిన అతడు.. తన మార్కెట్‌ను కూడా భారీ స్థాయిలో పెంచుకున్నాడు. ఈ క్రమంలోనే ప్రభాస్ ఇప్పుడు 'రాధే శ్యామ్' అనే సినిమాతో రాబోతున్నాడు.
'జిల్'తో తన సత్తాను నిరూపించుకున్న దర్శకుడు రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తోన్న చిత్రమే 'రాధే శ్యామ్'. ఈ మూవీ షూటింగ్ ప్రారంభమై దాదాపు రెండేళ్లకు పైగానే అవుతోంది. మధ్యలో కరోనా లాక్‌డౌన్‌తో పాటు పలు ఆటంకాలు ఏర్పడడంతో ఈ సినిమా చిత్రీకరణ ఆలస్యం అవుతూ వచ్చింది. దీంతో సుదీర్ఘ ప్రయాణం తర్వాత అంటే ఇటీవలే ఈ చిత్రానికి సంబంధించిన టాకీ పార్ట్ మొత్తాన్ని పూర్తి చేసింది చిత్ర యూనిట్. ప్రస్తుతం దీనికి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు చేస్తున్నారు. అవి కూడా దాదాపుగా పూర్తి కావొచ్చాయి. దీంతో చిత్ర యూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలను ప్రారంభించేసింది.

మెల్‌బోర్న్‌లో ఉన్న ఐమాక్స్ థియేటర్‌లో జనవరి 14 ఉదయం 7.30 గంటలకు వేయనున్న 'రాధే శ్యామ్' ప్రీమియర్ షో బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి. ఇది తెలుగు లాగ్వేజ్‌లో వచ్చినా ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ వేస్తారట. ఇలా అయిన చాలా తక్కువ సమయంలోనే సగానికి సగం టికెట్లు అమ్ముడైపోయాయి. మరికొన్ని గంటల్లోనే టికెట్లు అయిపోయినట్లు బోర్డు పెట్టబోతున్నారని తెలుస్తోంది. అంటే ఆస్ట్రేలియాలో కూడా ప్రభాస్ క్రేజ్ ఏ రేంజ్‌లో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇదిలా ఉండగా.. తెలుగు రాష్ట్రాల్లో మాత్రం జనవరి ఆరంభంలోనే టికెట్ల బుకింగ్స్ మొదలయ్యే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. మిగిలిన ప్రాంతాల్లో డిసెంబర్ చివరి వారం నుంచే అమ్మకాలు జరుగుతాయనే టాక్ వినిపిస్తోంది.
మెల్‌బోర్న్‌లో ఉన్న ఐమాక్స్ థియేటర్‌లో 'రాధే శ్యామ్' బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి. ఇలా అయిన చాలా తక్కువ సమయంలోనే సగానికి సగం టికెట్లు అమ్ముడైపోయాయి. మరికొన్ని గంటల్లోనే టికెట్లు అయిపోయినట్లు బోర్డు పెట్టబోతున్నారని తెలుస్తోంది. అంటే ఆస్ట్రేలియాలో కూడా ప్రభాస్ క్రేజ్ ఏ రేంజ్‌లో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇదిలా ఉండగా.. తెలుగు రాష్ట్రాల్లో మాత్రం జనవరి ఆరంభంలోనే టికెట్ల బుకింగ్స్ మొదలయ్యే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. మిగిలిన ప్రాంతాల్లో డిసెంబర్ చివరి వారం నుంచే అమ్మకాలు జరుగుతాయనే టాక్ వినిపిస్తోంది.
క్రేజీ కాంబినేషన్‌లో ప్రతిష్టాత్మకంగా రాబోతున్న 'రాధే శ్యామ్' మూవీలో ప్రభాస్ జ్యోతిష్యుడిగా నటిస్తోన్నాడు. అలాగే, ఇది టైమ్ ట్రావెల్ కథ అని, పునర్జన్మల నేపథ్యంతో సాగే సినిమా అని అంటున్నారు. దీన్ని కృష్ణంరాజు సమర్పణలో యువీ క్రియేషన్స్, గోపీకృష్ణా మూవీస్ పతాకాలపై వంశీ, ప్రమోద్, ప్రశీద నిర్మిస్తున్నారు. పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోంది. వీళ్లతో పాటు సచిన్ ఖేడ్కర్, మురళీ శర్మ, భాగ్యశ్రీ, ప్రియదర్శి, కునాల్ రాయ్ కపూర్, ఫ్లోరా జాకబ్ వంటి వాళ్లు కీలక పాత్రలను చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











