Radhe Shyam Censor Report: ప్రభాస్ సినిమాకు ఆ సర్టిఫికెట్.. అన్ని గంటల రన్ టైమ్
రెబెల్ స్టార్ కృష్ణంరాజు వారసుడిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి.. తక్కువ సమయంలోనే స్టార్‌గా ఎదిగిపోయాడు ప్రభాస్. కెరీర్ ఆరంభంలో తెలుగు సినిమాలు మాత్రమే చేసిన అతడు.. ప్రత్యేకమైన ఇమేజ్‌తో పాటు భారీ స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్‌ను కూడా సంపాదించుకున్నాడు. ఇక, రాజమౌళి తెరకెక్కించిన 'బాహుబలి' సిరీస్ నుంచి ప్రభాస్ పాన్ ఇండియా స్టార్‌గా మారిపోయాడు. ఈ చిత్రం నుంచి పంథాను మార్చుకున్న అతడు.. వరుసగా భారీ సినిమాలనే చేస్తున్నాడు. తద్వారా తన క్రేజ్‌ను విశ్వవ్యాప్తం చేసుకోవడంతో పాటు మార్కెట్‌ను కూడా గణనీయంగా విస్థరించుకుని సత్తా చాటుతున్నాడు.
'జిల్' మూవీతో దర్శకుడిగా మంచి గుర్తింపును అందుకున్న రాధాకృష్ణ కుమార్ డైరెక్షన్‌లో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన చిత్రమే 'రాధే శ్యామ్'. ఈ మూవీ షూటింగ్ ప్రారంభమై దాదాపు మూడేళ్లకు పైగానే అయింది. అయితే, మధ్యలో కరోనా లాక్‌డౌన్‌తో పాటు పలు ఆటంకాలు రావడంతో ఈ సినిమా చిత్రీకరణ అనుకున్న సమయానికి పూర్తి కాలేదు. దీంతో సుదీర్ఘ ప్రయాణం తర్వాత అంటే ఇటీవలే ఈ చిత్రానికి సంబంధించిన టాకీ పార్ట్ మొత్తాన్ని చిత్ర యూనిట్ కంప్లీట్ చేసుకుంది. ఆ వెంటనే మొదలైన పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా ఇప్పటికే పూర్తి అయినట్లు తెలుస్తోంది.
పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ నటించిన ప్రతిష్టాత్మక చిత్రం 'రాధే శ్యామ్'ను సంక్రాంతి కానుకగా ఈ ఏడాది జనవరి 14న ప్రేక్షకుల ముందుకు తీసుకు రావాలని డిసైడ్ అయ్యారు. అందుకే ప్రమోషన్ కార్యక్రమాలను సైతం మొదలెట్టి.. ఇప్పటికే పలు టీజర్, ట్రైలర్, పాటలను కూడా విడుదల చేశారు. అన్ని భాషల్లోనూ వాటికి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. సినిమా విడుదలకు అంతా రెడీ అనుకున్న సమయంలోనే కరోనా ప్రభావం కారణంగా ఇది వాయిదా పడింది. దీంతో ఇప్పుడు మళ్లీ అప్‌డేట్లు ఇస్తున్నారు. ఇందులో భాగంగానే కొన్ని పాటల ప్రోమోలు, రిలీజ్ ట్రైలర్‌ను కూడా విడుదల చేశారు.

'రాధే శ్యామ్' మూవీ విడుదలకు సమయం దగ్గర పడడంతో చిత్ర యూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలను ముమ్మరం చేసేసింది. ఇందులో భాగంగానే ప్రభాస్, పూజా హెగ్డే సహా యూనిట్ సభ్యులు ఈవెంట్లను నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఈ మూవీ సెన్సార్ పూర్తైనట్లు తెలిసింది. ఇక, దీనికి సెన్సార్ బోర్డ్ సభ్యులు యూ/ఏ సర్టిఫికెట్‌ను జారీ చేశారు. ఈ సినిమా మొత్తం 2 గంటల 30 నిమిషాల నిడివితో రాబోతుంది. తాజా సమాచారం ప్రకారం.. ఈ సినిమా అదిరిపోయేలా వచ్చిందని అంటున్నారు. దీంతో ఈ మూవీపై ఉన్న అంచనాలన్నీ రెట్టింపు అయిపోతున్నాయి.
క్రేజీ కాంబినేషన్‌లో రూపొందిన 'రాధే శ్యామ్' మూవీలో ప్రభాస్ జ్యోతిష్యుడిగా నటిస్తోన్నాడు. అలాగే, ఇది టైమ్ ట్రావెల్ కథ అని, పునర్జన్మల నేపథ్యంతో సాగే సినిమా అని అంటున్నారు. దీన్ని కృష్ణంరాజు సమర్పణలో యువీ క్రియేషన్స్, గోపీకృష్ణా మూవీస్ పతాకాలపై వంశీ, ప్రమోద్, ప్రశీద నిర్మిస్తున్నారు. పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోంది. వీళ్లతో పాటు సచిన్ ఖేడ్కర్, మురళీ శర్మ, భాగ్యశ్రీ, ప్రియదర్శి, కునాల్ రాయ్ కపూర్, ఫ్లోరా జాకబ్ వంటి వాళ్లు కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. ఇది మార్చి 11న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.


Click it and Unblock the Notifications











