Radhe shyam Release Date: అద్భుతమైన ఫొటోతో అఫీషియల్ డేట్.. అనుకున్నదానికంటే ముందే..
టాలీవుడ్ ఇండస్ట్రీలో రాబోయే అతిపెద్ద సినిమాల్లో రాధేశ్యామ్ ఒకటి. రెబల్ స్టార్ ప్రభాస్ రెండు విభిన్నమైన పాత్రలలో నటించిన ఈ సినిమాపై ప్రేక్షకులలో అంచనాలు అయితే మామూలుగా లేవు. గత ఏడాది సమ్మర్ లో ప్రేక్షకుల ముందుకు రావాల్సిన ఈ సినిమా కరోనా కారణంగా వాయిదా పడుతూనే ఉంది. ఇక ఫైనల్ గా నేడు సినిమాకి సంబంధించిన మరొక అఫీషియల్ డేట్ ను తెలియజేశారు. ఒక అద్భుతమైన ఫొటోను కూడా విడుదల చేశారు. ఆ వివరాల్లోకి వెళితే..

భారీ బడ్జెట్ తో..
ప్రభాస్ - పూజా హెగ్డే జంటగా నటించిన రాధేశ్యామ్ సినిమా లవ్ అడ్వెంచర్ సినిమాగా తెరకెక్కిన విషయం తెలిసిందే. యూవీ క్రియేషన్స్ - గోపికృష్ణ మూవీస్ ఈ సినిమాను సంయుక్తంగా నిర్మించింది. ఈ సినిమాను 300కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మించినట్లు తెలుస్తోంది. విభిన్నమైన కాలాలకు సంబంధించిన లవ్ ట్రాక్ ఎపిసోడ్స్ తో సినిమా ఆకట్టుకోబోతున్నట్లు సమాచారం.

వేగంగా పూర్తి చేయాలని..
రాధేశ్యామ్ సినిమాను ప్రభాస్ చాలా వేగంగా పూర్తి చేయాలని అనుకుని మొదలు పెట్టాడు. ఈ సినిమాను మొదట 150కోట్ల బడ్జెట్ లోపే తెరకెక్కించాలని అనుకున్నారు. కానీ ఆ తరువాత ప్రభాస్ రేంజ్ ను దృష్టిలో ఉంచుకొని బడ్జెట్ రేంజ్ పెంచక తప్పలేదు. అంతే కాకుండా సినిమాలో విజువల్ ఎఫెక్ట్స్ కోసం కూడా అనుకున్న దానికంటే భారీగా ఖర్చు చేయాల్సి వచ్చింది.

న్యూ రిలీజ్ డేట్
ప్రస్తుతం అందరి ఫోకస్ కూడా రాధేశ్యామ్ విడుదల డేట్ పైనే ఉంది. అసలైతే ఈ సినిమాను సంక్రాంతికి విడుదల చేయాలని అనుకున్నారు. అంతకుముందు మూడు సార్లు విడుదల డేట్స్ ను మార్చుకున్న రాధేశ్యామ్ యూనిట్ ఈసారి తప్పకుండా అనుకున్న సమయానికి విడుదల చేయాలని ఫిక్స్ అయ్యారు. కొద్దిసేపటి క్రితమే సినిమా విడుదల డేట్ ను ప్రకటించారు. మార్చి 11వ తేదీన ఈ సినిమాను విడుదల చేయాలని ఫిక్స్ అయ్యారు.

అద్భుతమైన పోస్టర్
ఇక సినిమా విడుదల డేట్ తో పాటు ఒక అద్భుతమైన పోస్టర్ ను విడుదల చేశారు. లవ్ అండ్ డెస్టినీ మధ్యలో జరిగే ఒక బిగ్గెస్ట్ వార్ అంటూ ఒక భారీ షిప్ సముద్రం అలజడి మధ్యలో మ్యూనిగిపోతున్నట్లుగా హైలెట్ చేశారు. ఇక పోస్టర్ సినిమాపై మరింత అంచనాలను పెంచేసింది. సినిమాకు సంబంధించిన ట్రైలర్ సాంగ్స్ కూడా పాజిటివ్ వైబ్రేషన్స్ క్రియేట్ చేసిన విషయం తెలిసిందే. మరి సినిమా బాక్సాఫీస్ వద్ద ఏ రేంజ్ లో సక్సెస్ అవుతుందో చూడాలి.
Recommended Video

ప్రభాస్.. రాబోయే సినిమాలు
ప్రభాస్ రాధేశ్యామ్ అనంతరం సలార్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆ సినిమాలో కూడా ప్రభాస్ రెండు విభిన్నమైన పాత్రల్లో నటిస్తున్నాడు. ఇక ఆ సినిమాను ఇదే ఏడాది జూలై 29న విడుదల చేయాలని చూస్తున్నారు. ఇక ఆ తరువాత ప్రభాస్ ఆదిపురుష్, ప్రాజెక్ట్ K స్పీరిట్ వంటి సినిమాలను లైన్ లో పెట్టిన విషయం తెలిసిందే.


Click it and Unblock the Notifications











