రాధే శ్యామ్ నుంచి సర్‌ప్రైజింగ్ అనౌన్స్‌మెంట్: విక్రమాదిత్య ఎవరు అంటూనే రిలీజ్ డేట్‌పై క్లారిటీ

దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన 'బాహుబలి' సిరీస్‌తో పాన్ ఇండియా హీరోగా ఎదిగిపోయాడు యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్. ఆ వెంటనే 'సాహో' అనే యాక్షన్ మూవీ చేసి దేశ వ్యాప్తంగా గుర్తింపుతో పాటు మార్కెట్‌ను కూడా భారీ స్థాయిలో పెంచుకున్నాడు. ఈ ఉత్సాహంతోనే కొంత కాలంగా వరుసగా సినిమాలను చేస్తూ దూసుకుపోతున్నాడు. ఇక, ప్రభాస్ ప్రస్తుతం చేస్తున్న చిత్రాల్లో 'రాధే శ్యామ్' ఒకటి. జిల్ ఫేం రాధాకృష్ణ కుమార్ తెరకెక్కించిన ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమా నుంచి ఓ సర్‌ప్రైజింగ్ అప్‌డేట్ వచ్చింది. ఆ సంగతులేంటో చూద్దాం పదండి!

తొలిసారి రొమాంటిక్ మూవీలో ప్రభాస్

తొలిసారి రొమాంటిక్ మూవీలో ప్రభాస్

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం రాధాకృష్ణ కుమార్‌తో 'రాధే శ్యామ్' చేస్తున్నాడు. దీన్ని కృష్ణంరాజు సమర్పణలో యువీ క్రియేషన్స్‌, గోపీకృష్ణా మూవీస్‌ పతాకాలపై వంశీ, ప్రమోద్‌, ప్రశీద నిర్మిస్తున్నారు. పూజా హెగ్డే హీరోయిన్‌గా చేస్తున్న ఈ మూవీని కూడా పాన్ ఇండియా రేంజ్‌లో రూపొందిస్తున్నారు. ఇందులో ప్రభాస్ తొలిసారి రొమాంటిక్ పాత్రను చేస్తున్న విషయం తెలిసిందే.

ఎప్పుడో మొదలైంది... వాటి వల్లే ఇలా

ఎప్పుడో మొదలైంది... వాటి వల్లే ఇలా

ఆరంభం నుంచీ వరుసగా సినిమాలు చేసిన ప్రభాస్.. 'బాహుబలి' నుంచి వేగాన్ని తగ్గించాడు. మంచి ఔట్‌పుట్ కోసం సినిమాకు చాలా సమయం తీసుకుంటున్నాడు. ఇదే 'రాధే శ్యామ్' విషయంలోనూ జరుగుతోంది. ఈ చిత్రం రెగ్యూలర్ షూటింగ్ ప్రారంభమై చాలా కాలమే అయినా.. పలుమార్లు ఆటంకం ఏర్పడడం వల్ల టాకీ పార్ట్ అనుకున్న సమయానికి పూర్తి కాలేదు.

బిజినెస్ కూడా భారీగానే జరగడంతో

బిజినెస్ కూడా భారీగానే జరగడంతో

'రాధే శ్యామ్' ప్రారంభమైన చాలా రోజుల వరకూ ఎటువంటి అప్‌డేట్ రాలేదు. దీంతో చిత్ర యూనిట్‌పై ప్రభాస్ అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఆ మధ్య టీజర్, ఆ తర్వాత ప్రతి పండుగకూ ఒక పోస్టర్ చొప్పున వదిలారు. వీటి వల్ల సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. తద్వారా ఈ చిత్రానికి భారీ స్థాయిలో బిజినెస్ జరిగినట్లు టాక్ వినిపిస్తోంది.

బ్యాలెన్స్ షూట్ కంప్లీట్.. ఇప్పుడా పని

బ్యాలెన్స్ షూట్ కంప్లీట్.. ఇప్పుడా పని

'రాధే శ్యామ్' మూవీకి సంబంధించిన బ్యాలెన్స్ సీన్స్ చిత్రీకరణ ఇటీవలే ప్రారంభమైంది. ఇందులో కృష్ణంరాజు, పూజా హెగ్డేతో ప్రభాస్ చేయాల్సిన సన్నివేశాలతో పాటు ఓ గ్రీన్ మ్యాట్ సీన్స్ కూడా షూట్ చేశారు. ఆ వెంటనే పోస్ట్ ప్రొడక్షన్ పనులను కూడా ప్రారంభించారు. ప్రస్తుతం ఇదే ప్రాసెస్ జరుగుతున్నట్లు తెలుస్తోంది. గ్రాఫిక్ వర్క్ ఎక్కువగా ఉండడంతో లేట్ అవుతుందట.

రాధే శ్యామ్ సర్‌ప్రైజ్ అనౌన్స్‌మెంట్

రాధే శ్యామ్ సర్‌ప్రైజ్ అనౌన్స్‌మెంట్

యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా 'రాధే శ్యామ్' మూవీ నుంచి టీజర్ రాబోతుందని చాలా రోజులుగా ప్రచారం జరుగుతోంది. అందుకు అనుగుణంగానే తాజాగా దీనికి సంబంధించిన ప్రకటన వచ్చేసింది. ఈ మేరకు చిత్ర యూనిట్ ఓ పోస్టర్‌ను విడుదల చేసింది. ఇందులో 'రాధే శ్యామ్' టీజర్ అక్టోబర్ 23, ఉదయం 11:16 గంటలకు వస్తుందని తెలిపింది.

విక్రమాదిత్య ఎవరు అంటూ ఆసక్తిగా

విక్రమాదిత్య ఎవరు అంటూ ఆసక్తిగా

'రాధే శ్యామ్' టీజర్‌కు సంబంధించిన ప్రకటన చేసిన సమయంలోనే చిత్ర యూనిట్ 'విక్రమాదిత్య ఎవరు' అంటూ అందరిలో ఆసక్తిని రేకెత్తించింది. దీర్ఘంగా ఆలోచిస్తున్నట్లు ఉన్న ప్రభాస్ ఫొటోను వదలడంతో టీజర్‌పై అంచనాలు పెరిగిపోతున్నాయి. ఇక, ఈ సినిమాను జనవరి 14నే ప్రేక్షకుల ముందుకు తీసుకుని వస్తున్నట్లు చిత్ర యూనిట్ పోస్టర్‌లో చూపించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X