పండగలా దిగివచ్చి అభిమానులకు కిక్కిచ్చిన ప్రభాస్.. రాధేశ్యామ్ ఉగాది గిఫ్ట్
టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్ సాహో అనంతరం వెండితెరకు చా గ్యాప్ ఇచ్చాడు. దీంతో అభిమానులు అతని కోసం చాలా ఆతృతగా ఎదురుచూస్తున్నారు. లాక్ డౌన్ అనంతరం వీలైనంత త్వరగా రావాలని అనుకున్నప్పటికి కుదరలేదు. ఇక చిత్ర యూనిట్ సర్ ప్రైజ్ లు ఇవ్వడంలో ఆలస్యం చేస్తూనే ఉంది. ఇక ఉగాది సందర్భంగా రాధేశ్యామ్ కు సంబంధించిన ఒక స్పెషల్ పోస్టర్ ను వదిలారు.

స్పీడ్ పెంచాలని..
బాహుబలి అనంతరం స్పీడ్ పెంచాలని అనుకున్న ప్రభాస్ అనుకోకుండా మళ్ళీ అదే తరహాలో ఆలస్యంగా రావాల్సి వస్తోంది. సాహో విడుదల సమయంలో అభిమానులకు ఒక మాట కూడా ఇచ్చాడు. ఇక నుంచి ఈ విధంగా ఆలస్యం చేయకుండా తొందరగా రావడానికి ప్రయత్నం చేస్తానని చెప్పాడు. కానీ పరిస్థితుల ప్రభావం వలన ఎప్పటిలానే అభిమానులు ఎదురుచూడాల్సి వస్తోంది.

ప్రమోషన్ విషయంలో..
జిల్ దర్శకుడు రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న రాధేశ్యామ్ సినిమాను యూవీ క్రియేషన్స్ టీ సిరీస్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. కేవలం తెలుగులోనే కాకుండా నార్త్ లో కూడా సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. అయితే చిత్ర యూనిట్ ప్రమోషన్ విషయంలో మాత్రం నెమ్మదిగా అడుగులు వేయడం అభిమానులకు నచ్చడం లేదు.

టీజర్ వస్తుందని అనుకుంటే..
టీజర్ విడుదల చేస్తామని గత ఏడాది నుంచి చెప్పుకుంటూ వస్తున్నారు. ఆ మధ్య ఫస్ట్ లుక్ టీజర్ ను విడుదల చేసిన విషయం తెలిసిందే. ఇక ఆ తరువాత మళ్ళీ మరో సర్ ప్రైజ్ ఏమి ఇవ్వలేదు. ఎదో పోస్టర్స్ ద్వారా మ్యానేజ్ చేస్తూ వస్తున్నారు. ఇక ఉగాది సందర్భంగా టీజర్ వస్తుందని అనుకున్న ఆడియెన్స్ కు ఒక పోస్టర్ తోనే సరిపెట్టారు.

ఎన్నో ఫెస్టివల్స్.. కానీ ప్రేమ ఒక్కటే
ఎన్నో ఫెస్టివల్స్.. కానీ ప్రేమ ఒక్కటే .. ప్రభాస్ లవ్లీ లుక్ ను విడుదల చేశారు. ఈ పోస్టర్ లో ప్రభాస్ చాలా కొత్తగా కనిపిస్తున్నాడు. ఇక సినిమాను జూలై 30న వరల్డ్ వైడ్ గా పాన్ ఇండియా సినిమాగా రిలీజ్ చేస్తున్న విషయం తెలిసిందే. పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో రెబల్ స్టార్ కృష్ణంరాజు కూడా ముఖ్యమైన పాత్రలో కనిపించబోతున్నారు.


Click it and Unblock the Notifications











