Radheshyam ఓటీటీ రిలీజ్ డేట్ కూడా ఫిక్స్ అయినట్లే.. అలా జరిగితే మరింత తొందరగా..?

గత ఏడాది నుంచి ప్రేక్షకులు ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్న సినిమాల్లో రాధేశ్యామ్ సినిమా టాప్ లిస్టులో ఉంది అనే చెప్పాలి. సాహో సినిమా తర్వాత ప్రభాస్ చాలా తొందరగా రాధే శ్యామ్ సినిమాను విడుదల చేయాలని అనుకున్నారు. కానీ అనుకోకుండా ఈ సినిమా వాయిదా పడుతూ వచ్చిన విషయం తెలిసిందే. మొత్తానికి ఈ నెల 11వ తేదీన సినిమాను ప్రపంచ వ్యాప్తంగా ప్రభాస్ కెరీర్ లోనే అత్యధిక థియేటర్లలో విడుదల చేయబోతున్నారు. అయితే ఈ సినిమాలో ఓటీటీ లో ఎప్పుడు విడుదల చేస్తారు అనే విషయం లో కూడా ప్రస్తుతం ఒక న్యూస్ హాట్ టాపిక్ గా మారింది. ఆ వివరాల్లోకి వెళితే..

ఏ మాత్రం మిస్ చేసుకోవద్దు అని..

ఏ మాత్రం మిస్ చేసుకోవద్దు అని..

బాహుబలి సినిమాతో ఒక్కసారిగా నెంబర్ వన్ పాన్ ఇండియా స్టార్ హీరోగా మారిపోయిన ప్రభాస్ తో ఆ సినిమా చేయాలని ప్రస్తుతం అగ్ర దర్శకులు ఎంతో ఆసక్తిని చూపిస్తున్నారు. ప్రభాస్ కూడా మంచి కథలు వస్తే ఏ మాత్రం మిస్ చేసుకోవద్దు అని.. అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చే విధంగా సినిమాలు చేయాలని అనుకుంటున్నాడు.

ప్రస్తుతం ప్రభాస్ రాధే శ్యామ్ సినిమాతో కూడా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకోవాలని చూస్తున్నాడు. ఈ సినిమా రొమాంటిక్ లవ్ అడ్వెంచర్ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

ఫస్ట్ డే ఫస్ట్ షో..

ఫస్ట్ డే ఫస్ట్ షో..

రాధే శ్యామ్ సినిమాను ఈ సంక్రాంతికి విడుదల చేయాలని అనుకున్న విషయం తెలిసిందే. భారీగా ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా నిర్వహించారు. కానీ పరిస్థితులు అనుకూలించకపోవడంతో మార్చి 11వ తేదీన విడుదల చేసేందుకు సిద్ధమయ్యారు. ఇప్పటికే ఓవర్సీస్లో ఈ సినిమాకు సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ కూడా ఓపెన్ అయినట్లుగా తెలుస్తోంది. మొదటిరోజు మొదటి షో చూడాలి అని అభిమానులు కూడా టికెట్ల కోసం ఎగబడుతున్నారు.

మొదటి రోజే రికార్డ్

మొదటి రోజే రికార్డ్

ఇండియాలో ఎక్కువ మంది ప్రేక్షకులు ఎదురు చూస్తున్న నెంబర్ వన్ సినిమాలలో కూడా రాధే శ్యామ్ టాప్ లిస్టులో ఉంది అన్నట్లు సోషల్ మీడియాలో బజ్ చూస్తేనే అర్థమవుతుంది. సినిమాకి సంబంధించిన ప్రతి ఒక్క విషయం కూడా ఈజీగా ట్రెండ్ అవుతుంది అని చెప్పాలి. తప్పకుండా మొదటి రోజే ఈ సినిమా 100 కోట్ల బాక్సాఫీస్ కలెక్షన్స్ అందుకుంటుంది అని బాక్సాఫీస్ పండితులు అంచనా వేస్తున్నారు.

ఓటీటీ రిలీజ్..?

ఓటీటీ రిలీజ్..?

ఇక మార్చి 11వ తేదీన విడుదల కాబోతున్న ఈ సినిమా ఓటీటీలోకి ఎప్పుడు వస్తుంది అనే విషయంలో కూడా అనేక రకాల కథనాలు వెలువడుతున్నాయి. అమెజాన్ ప్రైమ్ ఈ సినిమాకు సంబంధించిన ఓటీటీ హక్కులను సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. అయితే ముందుగా ఒప్పందం చేసుకున్న ప్రకారం సినిమా థియేటర్స్ లోకి వచ్చిన 50 రోజుల తర్వాతనే పోటీలో విడుదల చేయాల్సి ఉంటుంది.

Recommended Video

Radhe Shyam లో Prabhas కి ఉండే వరమే .. ఆఖరికి శాపంలా మారుతుంది | Filmibeat Telugu
అనుకున్న దానికంటే ముందే..

అనుకున్న దానికంటే ముందే..

రాధేశ్యామ్ సినిమా 11వ తేదీన విడుదలైన తర్వాత పాజిటివ్ టాక్ వస్తే మాత్రం పది రోజుల పాటు ఈ సినిమా బాక్సాఫీస్ కలెక్షన్స్ తో మంచి క్రేజ్ అందుకుంటుంది అని చెప్పవచ్చు. అయితే మార్చి 25 వ తేదీ త్రిబుల్ ఆర్ సినిమా విడుదల అవుతుంది కాబట్టి ఆ సినిమా హడావిడిలో రాధేశ్యామ్ హావా తగ్గే అవకాశం ఉంటుంది. అందుకే ఏప్రిల్ మొదటి వారంలోనే సినిమా ఓటీటీ లోకి వచ్చే అవకాశం ఉంటుంది అని మరొక కొత్త టాక్ వినిపిస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X