Radheshyam Release Trailer: ప్రేమ విషయంలో ఆదిత్య ఊహ తప్పేనా.. ఆ సాహసాలు మైండ్ బ్లోయింగ్

ప్రభాస్ అభిమానులు మాత్రమే కాకుండా ఎంతో మంది సినీ ప్రేక్షకులు ఆతృతగా ఎదురుచూస్తున్న సినిమాలలో రాధేశ్యామ్ నెంబర్ వన్ స్థానంలో ఉంది. గత ఏడాది నుంచి ఎంతగానో ఊరిస్తున్న ఈ సినిమా మొత్తానికి ఈ ఏడాది సంక్రాంతికి విడుదల అవుతుంది అని అందరూ అనుకున్నారు. కానీ ఆ సమయానికి కరోనా కారణంగా వాయిదా పడిన విషయం తెలిసిందే. ఇక ఫైనల్ గా మార్చి 11వ తేదీన సినిమాను విడుదల చేయబోతున్నారు. అయితే ఈ సినిమాకు సంబంధించిన మరో రిలీజ్ ట్రైలర్ ను విడుదల చేయగా ఆ ట్రైలర్ సినిమా పై మరింత అంచనాలు పెంచేసింది.

Recommended Video

Radhe Shyam Release Trailer పవర్ ఫుల్ Prabhas | March 11th Release | Oneindia Telugu
మొదటి ట్రైలర్ తోనే భారీగా అంచనాలు

మొదటి ట్రైలర్ తోనే భారీగా అంచనాలు

సినిమాను ఈ ఏడాది సంక్రాంతికి విడుదల చేయాలని రాధేశ్యామ్ చిత్ర యూనిట్ సభ్యులు ఎంతగానో ప్రయత్నాలు చేశారు. భారీగా ప్రీ రిలీజ్ నిర్వహించడమే కాకుండా ఒక మంచి ట్రైలర్ ను కూడా విడుదల చేసిన విషయం తెలిసిందే. మొదటి ట్రైలర్ తోనే సినిమాపై ఒక్కసారిగా అంచనాలు పెరిగిపోయాయి. ఆ ట్రైలర్ లో సినిమాకు సంబంధించిన అనేక అంశాలను హైలెట్ చేశాడు.

సముద్రంలో సాహసాలు

సముద్రంలో సాహసాలు

ఇక ఇప్పుడు మరోసారి సినిమాపై మరింత హైప్ క్రియేట్ అయ్యే విధంగా రిలీజ్ ట్రైలర్ ను విడుదల చేయగా అందులో ప్రభాస్ క్యారెక్టర్ ను మరింత హైలైట్ చేస్తూ పామిస్ట్ గా అతను చాలా పవర్ ఫుల్ అని చూపించారు. అలాగే తన ప్రేమకోసం అతను చేసిన సాహసాలు ఏమిటి అనే అంశాలు కూడా హైలెట్ చేశారు. ప్రభాస్ సముద్రంలో చేసిన సాహస విన్యాసాలు కూడా ఈ ట్రైలర్ లో అద్భుతంగా ఉన్నాయి.

ఎప్పుడు చనిపోతాడో చెప్పనా?

ఎప్పుడు చనిపోతాడో చెప్పనా?

మనం ఆలోచిస్తున్నామని భ్రమ పడతాము. కానీ ముందే మన ఆలోచనలకు కూడా రాసి ఉంటాయి.. అనే డైలాగ్ తోనే ప్రభాస్ క్యారెక్టర్ పూర్తిగా అర్థమైపోయింది. కాలాన్ని ముందుగానే పసిగట్టే అతను చేతిరాత లతోనే భవిష్యత్తును చెబుతాడని తెలుస్తోంది. ఇతను ఎప్పుడు ఎలా చనిపోతాడో చెప్పనా? అనే డైలాగ్ తో కూడా హీరో మరణాన్ని కూడా ముందే పసిగట్టగలడు అని అర్థమయింది.

రెండో సారి చూసే అలవాటు లేదు..

రెండో సారి చూసే అలవాటు లేదు..

ఇంకొక సారి చేయి చూడు అంటే.. నాకు రెండో సారి చూసే అలవాటు లేదు... అని జగపతిబాబుకు ఇచ్చిన సమాధానంతో మరింత పవర్ఫుల్ గా ఉంది. సినిమాలో జగపతి బాబు ఒక నెగెటివ్ పాత్రలో కనిపించబోతున్నాడు. ఒకవైపు కాలానికి మరొకవైపు ప్రేమకు అలాగే ఇతర పరిస్థితులు విక్రమాదిత్య జీవితాన్ని ఎలాంటి మలుపులు తిప్పాయి అనే అంశం ఈ సినిమాలో హైలెట్ కాబోతున్నాయి.

ప్రేమ విషయంలో ఆదిత్య ప్రెడిక్షన్ తప్పు..

ప్రేమ విషయంలో ఆదిత్య ప్రెడిక్షన్ తప్పు అంటూ హీరోయిన్ చెప్పడం చూస్తుంటే విక్రమాదిత్య జీవితంలో ప్రేమ ఎలాంటి మలుపు తిప్పింది అనే పాయింట్ కూడా ఆసక్తికరంగా ఉంది. మొత్తంగా దర్శకుడు రాధాకృష్ణ రెండవ ట్రైలర్ ను చాలా అద్భుతంగా కట్ చేయించారు అని చెప్పవచ్చు. ఇక ట్రైలర్ చివరిలో ప్రేమకు విధికి జరిగే యుద్ధమే రాదేశ్యామ్ అని రాజమౌళి చెప్పిన వాయిస్ ఓవర్ కూడా అద్బుతంహా ఉంది. వాయిస్ ఓవర్ వస్తున్నప్పుడు కాలం మొత్తం వెనక్కి వెళుతున్నట్లుగా అనిపిస్తోంది. ఈ ట్రైలర్ లతోనే సినిమా ఒక్కసారిగా అంచనాలు పెంచేసింది. మరి ఫుల్ సినిమా ఎలాంటి అనుభూతిని ఇస్తుందో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X