ప్రభాస్‌ను టార్గెట్ చేసిన వేణుస్వామి భార్య.. అదిరిపోయేలా రెబల్ స్టార్ రియాక్షన్
సెలబ్రిటీ జ్యోతిష్యుడు వేణు స్వామి తరచుగా వివాదాలతో వార్తల్లో నిలుస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఆయన తన భార్యతో కలిసి చేసిన మిర్చి స్పూఫ్ వీడియోపై ప్రభాస్ ఎలా స్పందించారు అనే విషయాన్ని వెల్లడించారు. మరి ఇంతకీ ప్రభాస్ రియాక్షన్ ఎలా ఉంది అని ఇంట్రెస్టింగ్ విషయంపై లుక్కేద్దాం పదండి.
ప్రస్తుతం ఆయన సినీ సెలబ్రిటీలతో పాటు రాజకీయ నాయకుల జీవితాలకు సంబంధించిన భవితవ్యాన్ని కూడా బయట పెడుతూ వస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తరచుగా ఆయనపై సదరు సెలబ్రిటీల అభిమానులు మండిపడుతూ ఉంటారు. ప్రభాస్ కు అనారోగ్య సమస్యలు ఉన్నాయని, సలార్ మూవీ ప్లాఫ్ అవుతుంది అంటూ సంచలన కామెంట్స్ చేసి రెబల్ స్టార్ అభిమానుల ఆగ్రహానికి గురయ్యారు జ్యోతిష్యుడు వేణు స్వామి.

ప్రభాస్ నుంచి మొదలుకొని రామ్ చరణ్, ఉపాసన దంపతులు, వాళ్ళిద్దరి వారసురాలు క్లింకార, నయనతార ఆమె పిల్లలు వంటి విషయాల్లో ఇప్పటి దాకా స్వామి చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టించాయి. ఇక తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న వేణు స్వామి ప్రభాస్ గురించి కామెంట్స్ చేసినప్పుడు ఆయన అభిమానుల నుంచి ఎదురయ్యే నెగెటివిటీ గురించి మాట్లాడారు. తను ప్రభాస్ తో ఎంత క్లోజ్ గా ఉంటాడో కూడా చెప్పుకొచ్చారు.
రీసెంట్ గా ఆయన తన భార్యతో కలిసి చేసిన మిర్చి స్పూఫ్ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. మిర్చి మూవీలో అనుష్క ఎలాంటి అమ్మాయిని పెళ్లి చేసుకుంటావ్ అని ప్రభాస్ ను అడుగుతుంది. దానికి ఆయన చదువుకున్న అమ్మాయి అయితే బాగుంటుంది అని చెప్తాడు. చదువుకున్న అమ్మాయి అయితే సంపాదన, నువ్వు నేను సమానం అంటూ గొడవ పడుతుంది. చదువును ఏం చేసుకుంటావు తింటావా? పిల్లలకు ఏబిసిడి లు నేర్పించుకునే విధంగా ఉంటే చాలు అని చెప్పిన డైలాగ్ ప్రభాస్ ఫ్యాన్స్ కు బాగా గుర్తుండే ఉంటుంది.
దీన్నే వేణు స్వామి ఆయన భార్య కలిసి చేశారు. ఈ వీడియో గురించి ప్రస్తావించిన వేణు స్వామి దాన్ని చూశాక ప్రభాస్ ఎంత కూల్ గా రియాక్ట్ అయ్యారు అనే విషయాన్ని వెల్లడించారు. తనకన్నా వేణు స్వామి స్టైలిష్ గా ఉన్నారు అని చెప్పారట ప్రభాస్. తామిద్దరి మధ్య అంత క్లోజ్ నెస్ ఉంటుందని, కానీ ప్రభాస్ బాగుండాలని జాగ్రత్తలు చెప్తుంటే ఇదంతా తెలియని ఆయన అభిమానులు ట్రోలింగ్ ద్వారా నెగటివ్ కామెంట్స్ చేస్తారని చెప్పుకొచ్చారు వేణు స్వామి.
తాను, ప్రభాస్ ఎంత క్లోజ్ గా ఉంటామో తెలియని ప్రభాస్ పెద్దమ్మ శ్యామల కూడా తనపై అలాంటి కామెంట్స్ చేసిందని గుర్తు చేశారు. తనకు అందరు స్టార్స్ పర్సనల్ విషయాలన్నీ తెలుసని, కానీ వాటన్నింటి గురించి తను మాట్లాడనని, కేవలం వాళ్లు తీసుకోవలసిన జాగ్రత్తల గురించి మాత్రం చెప్పడమే తన పని అంటూ ప్రభాస్ తో తనకు ఉన్న సాన్నిహిత్యాన్ని బయటపెట్టారు వేణు స్వామి.
మరి ఇప్పటికైనా వీళ్ళిద్దరి మధ్య ఉన్న సాన్నిహిత్యం గురించి తెలుసుకొని ప్రభాస్ అభిమానులు వేణు స్వామి పట్ల పాజిటివ్ గా ఉంటారా అనేది చూడాలి.


Click it and Unblock the Notifications











