’లారెన్స్‌ని డైరెక్టర్‌గా వద్దన్నారు... రెబల్ ఫ్లాప్‌తో ప్రభాస్ ప్రామీస్ ఇదే’

పాన్ ఇండియా సూపర్‌స్టార్ ప్రభాస్ కెరీర్‌లో అతిపెద్ద డిజాస్టర్లలో ఒకటిగా నిలిచింది రెబల్. రాఘవ లారెన్స్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో తమన్నా, దీక్షాసేథ్ హీరోయిన్లుగా నటించగా.. రెబల్ స్టార్ కృష్ణంరాజు కీలకపాత్ర పోషించారు. సెప్టెంబర్ 28, 2012న విడుదలైన ఈ సినిమా దారుణ పరాజయాన్ని మూటకట్టుకుంది. దాదాపు 40 కోట్ల రూపాయల బడ్జెట్‌తో తెరకెక్కిన రెబల్ మూవీ.. బాక్సాఫీస్ వద్ద 44 కోట్ల రూపాయల గ్రాస్ మాత్రమే రాబట్టి ప్రభాస్ కెరీర్‌లో అతిపెద్ద డిజాస్టర్స్‌లో ఒకటిగా నిలిచింది.

ఇప్పటికీ రెబల్ సినిమా పేరు చెబితే ప్రభాస్ అభిమానులు ఉలిక్కిపడతారు. డార్లింగ్, మిస్టర్ పర్ఫెక్ట్ సినిమాలతో మంచి ఊపులో ఉన్న యంగ్ రెబల్ స్టార్‌ జోరుకు రెబల్ బ్రేక్‌లు వేసింది. ఈ సినిమా రిజల్ట్‌పై తాజాగా రెబల్ చిత్ర నిర్మాతలు జే పుల్లారావు, జే భగవాన్ స్పందించారు. ఓ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రెబల్ మూవీకి సంబంధించిన ఆసక్తికరమైన విశేషలు పంచుకున్నారు. ఈ వివరాల్లోకి వెళితే..

Prabhas Rebel Movie Failure Producers Reveal Shocking comments on Raghava Lawrence

రాఘవ లారెన్స్ మీద భగవాన్, పుల్లారావు ఇద్దరూ ప్రేమతో ఉన్నారా? కోపంతో ఉన్నారా? అని యాంకర్ అడగ్గా.. కోపంగానే ఉన్నాం. మేం అనుకున్న బడ్జెట్ వేరు. సినిమా అయ్యేసరికి డబుల్ అయిపోయింది. అనుకున్న బడ్జెట్‌కు సంబంధించి అగ్రిమెంట్స్ కూడా ఉన్నాయి. కానీ అది డబుల్ అయిపోయింది. ఇండస్ట్రీలో వాళ్లంతా వీళ్లు సినిమాను చేయలేరు, బయటపెట్టలేరు అనుకున్నారు. హీరోగారు చాలా కో ఆపరేట్ చేశారు.. సినిమా రిలీజయ్యే వరకు అది హెల్ప్ అయ్యింది.

ఆ సినిమాని లారెన్స్ గారితో చేసేటప్పుడు మేం అనుకున్న బడ్జెట్ .. సగం సినిమా చేసేసరికి అయిపోయింది. మరి మిగతా సగం సినిమా తీయాలి, ఇంకా ఎంత బడ్జెట్ ఉంది అనేది పెద్ద ప్రశ్న. లారెన్స్ గారు ఏ విషయంలోనూ కాంప్రమైజ్ అయ్యేవాళ్లు కాదు, కానీ దీనిని కంప్లీట్ చేయాలి. సగం సినిమా అయ్యేసరికి సినిమా పెద్ద లాస్ అనేది ప్రొడ్యూసర్స్‌గా మాకు తెలిసిపోయింది. అయినా సరే దానిని ఎక్కడా వదిలిపెట్టకుండా ఫస్ట్ డే ముహూర్తం రోజున ఎంత హుషారుగా ఉన్నామో అదే ఉత్సాహంతో కంప్లీట్ చేసి రిలీజ్ చేశాం.

అసలు డైరెక్టర్‌గా లారెన్స్ పేరుని మేమే ప్రభాస్‌కి చెప్పాం. లారెన్స్‌తో చేస్తే ఒక మంచి కాంబినేషన్ అవుతుంది, మంచి సినిమా అవుతుందని మేమే నమ్మాం. కానీ ప్రభాస్ నాన్నగారు మాత్రం లారెన్స్‌తో మీరు పడలేరు, వేరే డైరెక్టర్‌ని ఆలోచించమని చెప్పారు. మేం ససేమిరా అనడంతో మీ ఇష్టమని ఆయన వదిలేశారు. లారెన్స్‌తో ప్రాజెక్ట్ కన్ఫర్మ్ అయిన తర్వాత కూడా ప్రభాస్ నాన్నగారు పెద్ద పార్టీ ఇచ్చారు. అంత ట్రబుల్ ఇస్తామని చెప్పినా.. బడ్జెట్ ఎక్కువ చేస్తారని చెప్పినా మంచి ప్రాజెక్ట్ అవుతుందని నమ్మి చేస్తున్నారు చాలా గ్రేట్ అని మమ్మల్ని మెచ్చుకున్నారు.

ప్లానింగ్ అనేది డైరెక్టర్ చేతుల్లోనే ఉంటుంది. విషయం అర్ధమయ్యేలోగా సగం సినిమా అయిపోయాక ఏం చేయగలం. గొడవపడితే అక్కడితో ఆగిపోతుంది. ఒకవేళ మంచి సినిమా అవుతుందేమో కంప్లీట్ చేయాలని అనుకున్నాం. ప్రభాస్ గారు దేవుడు లాంటి మనిషి .. ఆయన ఇంటికి భోజనానికి వెళితే వెజిటేరియన్ తినేవాళ్లు ఇబ్బండి పడాల్సిందే. ఏదైనా స్నాక్స్ పెట్టి, కాఫీ ఇచ్చిన తర్వాతే ప్రభాస్ మాట్లాడతారు. ఆయన షూటింగ్‌కి వస్తున్నాడంటే రోజుకు 20, 30 మందికి భోజనాలు వచ్చేవి. కృష్ణంరాజు గారు యాక్ట్ చేసినప్పుడు కూడా ఇంటి దగ్గరి నుంచి అలాగే భోజనం వచ్చేది. సెట్‌లో ఉన్న నిర్మాతలు, దర్శకులు, టాప్ టెక్నీషియన్స్‌కి ఖచ్చితంగా వడ్డించాల్సిందే.

రెబల్ రిజల్ట్ తర్వాత ప్రభాస్ మాకు ప్రామీస్ చేశారు.. ఖచ్చితంగా మీతో మరో సినిమా చేస్తానని చెప్పారు. మేమే ఆ ప్రామీస్‌ని ఇంకా ఉపయోగించుకోలేకపోయాం. రెబల్ తర్వాత ప్రభాస్ గారు పెద్ద స్థాయికి వెళ్లిపోయారు. మేం కలిస్తే చాలా రెస్పెక్ట్ ఇస్తారు.. చాలా ప్రేమగా మాట్లాడతారు. ఇప్పటికీ ప్రతి ఫెస్టివల్‌కి మాకు గ్రీటింగ్స్ వస్తాయి. రెబల్ అయిపోయిన తర్వాత పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళితే.. మీరు రెబల్ కోసం పడ్డ కష్టం నాకు తెలుసు, మీతో కష్టపడి సినిమా చేస్తానని ప్రామీస్ ఇచ్చారని పుల్లారావు, భగవాన్ చెప్పారు. ప్రస్తుతం వీరి వ్యాఖ్యలు చిత్ర పరిశ్రమలో హాట్ టాపిక్‌గా మారాయి.

Read more about: prabhas rebel raghava lawrence
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X