twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఏడాదిలో 150 కోట్ల సంపాదన వదులుకున్న ప్రభాస్.. షాకింగ్ రీజన్స్!

    |

    బాహుబలి తర్వాత యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్యాన్ ఇండియా స్టార్ అయిపోయాడు. పెద్ద ఎత్తున ఆయన మార్కెట్ పెరిగిపోవడంతో ఆయన చేస్తున్న అన్ని సినిమాలని ప్యాన్ ఇండియా లెవల్లో రిలీజ్ చేస్తున్నారు. చివరిగా సాహో సినిమా చేసిన ఆయన ప్రస్తుతం రాధేశ్యామ్ చేస్తున్నారు. అయితే ఆయన ఏకంగా ఏడాది కాలంలో 150 కోట్ల రూపాయల సంపాదన మిస్ అయినట్టు చెబుతున్నారు. ఆ వివరాల్లోకి వెళితే

    వరుస సినిమాలు

    వరుస సినిమాలు


    సాహో తరువాత రాధేశ్యామ్ సినిమా సెట్స్ మీద ఉండగానే ప్రభాస్ మరో మూడు సినిమాలు అనౌన్స్ చేశారు. నాగ్అశ్విన్ డైరెక్షన్లో ఓ సైన్స్ ఫిక్షన్ సినిమా, బాలీవుడ్ మూవీ 'ఆదిపురుష్'‌, ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్ అనే సినిమాలు చేస్తున్నాడు. అయితే రాధే శ్యాం సినిమా షూటింగ్ లో ఆయన త్వరలో పాల్గొనే అవకాశం ఉందని అంటున్నారు.

     సెలెబ్రిటీ బ్రాండ్స్

    సెలెబ్రిటీ బ్రాండ్స్

    ఆ సంగతి పక్కన పెడితే సాధారణంగా సెలబ్రిటీలు బ్రాండ్ ఎండార్స్‌మెంట్‌లు ఎక్కువగానే చేసుకుంటూ ఉంటారు. చాలా మంది నటులు పెద్ద బ్రాండ్లతో కలిసిపని చేయడ్నానికి ఆసక్తి కనబరుస్తూ ఉంటారు. అలా చేస్తే సినిమాల కంటే ఎక్కువే ఆదాయం లభిస్తూ ఉంటుంది. ఈ ఎండార్స్‌మెంట్‌ల విషయంలో చాలా తక్కువ మంది హీరోలు వెనకడుగు వేస్తూ ఉంటారు.

    సూపర్ క్రేజ్ తో బంపర్ ఆఫర్

    సూపర్ క్రేజ్ తో బంపర్ ఆఫర్

    కానీ బాహుబలి ప్రభాస్ ఇటీవలి కాలంలో పెద్ద బ్రాండ్ ఎండార్స్‌మెంట్ ఆఫర్లను తిరస్కరించారని తెలుస్తోంది. దుస్తులు నుండి ఎలక్ట్రానిక్స్ వరకు, ఎఫ్‌ఎంసిజి వరకు, అన్ని ప్రతిష్టాత్మక బ్రాండ్లు ప్రభాస్ ను తమ బ్రాండ్స్ ను ప్రమోట్ చేయమని కోరాయట. ప్రభాస్ కి ఇంటర్నేషనల్ రేంజ్ లో ఉన్న జనాదరణ బట్టి ఒక బ్రాండ్‌కు మంచి పేరు తీసుకురాగల సామర్థ్యం ఉందని నమ్మి ఆయనకు భారీగానే ఆఫర్లు వచ్చాయట.

    ఏకంగా 150 కోట్లను వదులుకుని

    ఏకంగా 150 కోట్లను వదులుకుని

    అలా ప్రభాస్ గత ఏడాదిలో ₹ 150 కోట్లకు పైగా బ్రాండ్ ఎండార్స్‌మెంట్‌ ఆఫర్లను తిరస్కరించాడని అంటున్నారు. ఆయన ఈ బ్రాండ్ ఎండార్స్‌మెంట్‌లన్నింటినీ తిరస్కరించడానికి కారణం ఆయన అంతకు ముందే కొన్ని బ్రాండ్స్ తో పనిచేస్తూ ఉండడమే. ఆయన గతంలో కొన్ని బ్రాండ్‌లను ఆమోదించాడు, వాటినే కొనసాగిస్తాడని అంటున్నారు. ఆయన కొత్త వాటి కోసం ఎదురుచూడడని అంటున్నారు.

    Recommended Video

    Koratala Siva సాప్ట్ వేర్ జాబ్ వదిలేసి.. Acharya కోసం సెంటిమెంట్ క్విట్ || Filmibeat Telugu
    2017లోనే 18 కోట్లు

    2017లోనే 18 కోట్లు

    ఇక 18 కోట్ల విలువైన ఎండార్స్‌మెంట్స్‌ను ప్రభాస్ తిరస్కరించారని ఆయన ప్రతినిధి గతంలో వెల్లడించారు. ''ప్రభాస్ ని అనేక బ్రాండ్లు సంప్రదించాయని, అయితే మొత్తంగా ఆయన 18 కోట్ల విలువైన బ్రాండ్ ఎండార్స్‌మెంట్‌ను తిరస్కరించాడు" అని ఆయన 2017లో ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. ఇక గతంలో దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి కూడా తన సినిమా మీద దృష్టి పెట్టడానికి 10 కోట్ల విలువైన బ్రాండ్ ఎండార్స్‌మెంట్‌లను వదులుకున్నాడని చెప్పిన సంగతి తెలిసిందే.

    English summary
    as per latest reports prabhas has declined brand endorsement offers worth over ₹150 crores in just the past one year."
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X