మెగా ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్: రామ్ చరణ్‌కు ప్రభాస్ రిక్వెస్ట్.. ఆ నమ్మకంతోనే ఓకే చెప్పేశాడట.!
గతంతో పోలిస్తే తెలుగు సినీ ఇండస్ట్రీలో హీరోల మధ్య సత్సంబంధాలు బలపడుతున్నాయని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అప్పట్లో ఒకరి సినిమాలను మరొకరు పట్టించుకునే వారు కాదన్న అపవాదు ఉండేది. కానీ, ఇప్పుడు మాత్రం ఆ పరిస్థితి మారిపోయింది. తనకు పోటీగా ఉన్నా మరో హీరో సినిమా బాగా ఆడాలని ఆకాంక్షిస్తున్నారు. అలాగే, ఒకరి ఫంక్షన్లకు మరొకరు హాజరు అవుతున్నారు. అంతేకాదు, మిగిలిన హీరోలకు సలహాలు కూడా ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో రామ్ చరణ్‌కు ఓ విషయంలో ప్రభాస్ రిక్వెస్ట్ చేశాడని ఓ వార్త బయటకు వచ్చింది. వివరాలు....

ప్రభాస్ ఇలా.. రామ్ చరణ్ అలా
తెలుగు సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోలుగా వెలుగొందుతున్నారు యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్. ఈ ఇద్దరూ వరుస సినిమాలతో బిజీ బిజీగా గడుపుతున్నారు. ప్రస్తుతం ప్రభాస్.. రాధాకృష్ణ తెరకెక్కిస్తున్న చిత్రంలో నటిస్తున్నాడు. అలాగే, చరణ్.. దర్శకధీరుడు రాజమౌళి చిత్రం RRRలో జూనియర్ ఎన్టీఆర్‌తో కలిసి చేస్తున్నాడు.

మెగా హీరో.. అక్కడ కూడా బిజీనే
రామ్ చరణ్ తేజ్ హీరోగా సినిమాలు చేస్తూనే.. నిర్మాతగానూ వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. తన తండ్రి చిరంజీవి కమ్‌బ్యాక్ మూవీ ‘ఖైదీ నెంబర్ 150', ‘సైరా: నరసింహారెడ్డి'ని భారీ హంగులతో నిర్మించాడు. అలాగే ఈ సినిమాలతో పాటు మెగాస్టార్... కొరటాల శివతో చేస్తున్న ప్రాజెక్టును సైతం నిర్మిస్తున్నాడు. ప్రస్తుతం అతడు ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులతో బిజీగా ఉన్నాడు.

చరణ్‌తో సినిమా చేసేది వీళ్లేనా.?
ప్రస్తుతం RRR షూటింగ్‌తో రామ్ చరణ్ బిజీగా ఉన్నాడు. ఈ సినిమాతో పాటు తన తండ్రి చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. ఈ రెండు పూర్తి కాకముందే చెర్రీ మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇస్తాడని తెలుస్తోంది. ఈ క్రమంలోనే సందీప్ రెడ్డి వంగా, అనిల్ రావిపూడి సహా పలువురు డైరెక్టర్ల పేర్లు తెరపైకి వచ్చాయి. వీరితో పాటు తమిళ డైరెక్టర్ అట్లీ పేరు కూడా వినిపిస్తోంది.

రామ్ చరణ్‌కు ప్రభాస్ రిక్వెస్ట్
రామ్ చరణ్ తదుపరి సినిమా గురించి తాజాగా ఓ వార్త ఇండస్ట్రీ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. దీని ప్రకారం.. అతడు ‘సాహో' ఫేమ్ సుజిత్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. ఇటీవల యంగ్ డైరెక్టర్ చెర్రీకి కథ వినిపించాడని, దానికి అతడు ఓకే చెప్పేశాడని అంటున్నారు. అయితే, సుజిత్ కథను చెర్రీ వినడం వెనుక ప్రభాస్ పాత్ర ఉందని సమాచారం. అతని కోరిక మేరకే మెగా హీరో కథ విన్నాడని టాక్.
Recommended Video

ఆ నమ్మకంతోనే ఓకే చెప్పేశాడట.!
భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ‘సాహో' ప్రభాస్ ఫ్యాన్స్‌తో పాటు సామాన్య ప్రేక్షకులను నిరాశ పరిచింది. ఈ నేపథ్యంలో ఆ లోటును భర్తీ చేసి యంగ్ రెబెల్ స్టార్‌కు సూపర్ హిట్ ఇవ్వాలన్న ఉద్దేశ్యంతో సుజిత్.. ఓ కథను సిద్ధం చేశాడట. ఇప్పుడా కథనే చరణ్‌కు వినిపించాడని అంటున్నారు. కసిగా తయారు చేసిన కథ కావడంతోనే మెగా పవర్ స్టార్ దీనికి ఓకే చెప్పేశాడని ప్రచారం జరుగుతోంది.


Click it and Unblock the Notifications











