ప్రేక్షకులకు ప్రభాస్ రిక్వెస్ట్.. దయచేసి ఇలా చేయండని పేర్కొంటూ పోస్ట్

వాతావరణం మార్పులు చోటు చేసుకోవడం, అపరిశుభ్రత కారణంగా ప్రస్తుతం రాష్ట్రమంతా విష జ్వరాలు విజృంభిస్తున్నాయి. ఎంతో మంది ప్రజలు డెంగీ, టైఫాయిడ్ లాంటి వైరల్ ఫీవర్స్ బారిన పడుతున్నారు. ఈ విషయమై ఇప్పటికే ప్రభుత్వం పలు సూచనలు జారీ చేస్తూ చర్యలు చేపడుతోంది. తాజాగా ఈ అంశంపై యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ స్పందిస్తూ ఫేస్‌బుక్ పోస్ట్ పెట్టారు. ఆ వివరాలు చూస్తే..

ప్రజలంతా తగు జాగ్రత్తలు పాటించాలంటూ ప్రభాస్

ప్రజలంతా తగు జాగ్రత్తలు పాటించాలంటూ ప్రభాస్

విష జ్వరాలు విజృంభించడానికి ప్రధాన కారణం దోమలు. ఇంటి పరిసరాలు పరిశుభ్రంగా ఉండకపోవడం కారణంగా దోమలు వ్యాప్తి చెందుతాయి. ఈ దోమల కారణంగా జనం అనారోగ్యం పాలవుతున్నారు. ఇప్పటికే విష జ్వరాలు బాగా వ్యాప్తి చెందాయి. ఈ నేపథ్యంలో దీనిపై ప్రభాస్ స్పందిస్తూ ప్రజలంతా తగు జాగ్రత్తలు పాటించాలని సూచించారు.

మీ కుటుంబాన్ని రక్షించుకోండి.. ఇలా చేయండి

మీ కుటుంబాన్ని రక్షించుకోండి.. ఇలా చేయండి

''దయచేసి మిమ్మల్ని, మీ కుటుంబాన్ని రక్షించుకోండి. డెంగ్యూ లాంటి విష జ్వరాల బారిన పడకుండా జాగ్రత్త పడండి. ఈ మేరకు మీ ఇల్లు, పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుకోండి. మీ ఇంటి చుట్టూ ప్రక్కల మురుగు నీటి నిల్వలు లేకుండా చూసుకోండి.. అదేవిధంగా వాటర్ ట్యాంక్స్ ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోండి'' అని తన పోస్ట్‌లో పేర్కొన్నారు ప్రభాస్.

తన ఇంటి పరిసరాలను పరిశీలిస్తూ దిగిన ఫొటో

తన పోస్ట్‌తో పాటు తన ఇంటి పరిసరాలను పరిశీలిస్తున్న పిక్ షేర్ చేశారు ప్రభాస్. దీంతో ఆయన చేసిన ఈ పోస్ట్ నెట్టింట వైరల్ అయింది. విష జ్వరాల బారిన పడకండి అంటూ ప్రభాస్ కల్పిస్తున్న అవగాహన చూసి ఆయన అభిమానులు సాహో అంటున్నారు. ప్రభాస్ చేసిన ఈ సూచన తప్పక పాటిస్తామని పేర్కొంటూ కామెంట్స్ పెడుతున్నారు నెటిజన్లు.

అంతకుముందు నాగార్జున

ఇదే విషయమై ఇప్పటికే అక్కినేని నాగార్జున స్పందించిన సంగతి తెలిసిందే. మీ ఇల్లు, పనిచేస్తున్న పరిసరాల్లో మురికి నీటి నిల్వలు లేకుండా చూసుకోవాలని సూచిస్తూ ఆయన ట్వీట్ పెట్టారు. దీంతో సెలెబ్రిటీలు చేస్తున్న ఈ అవగాహనా కార్యక్రమాలపై సినీ, రాజకీయ వర్గాల్లో పాజిటివ్ స్పందన వస్తోంది.

సాహో.. ప్రభాస్

సాహో.. ప్రభాస్

ఇక ప్రభాస్ తాజా సినిమా సాహో గురించి చెప్పుకుంటే.. సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కి ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా 500 కోట్ల క్లబ్ దిశగా పరుగులు పెడుతోంది. చిత్రంలో ప్రభాస్, శ్రద్ద కపూర్ నటనకు మంచి మార్కులు పడ్డాయి. నిర్మాణ విలువలు భేష్ అనిపించుకున్నాయి. ప్రస్తుతం సాహో విజయవంతంగా ప్రదర్శించబడుతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X