twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    స్పెషల్ డేను లాక్ చేసుకున్న ప్రభాస్: ఆరోజు ‘ఆదిపురుష్’ సర్‌ప్రైజ్ ఇవ్వబోతున్నాడట

    |

    వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు టాలీవుడ్ టాప్ హీరో యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్. 'బాహుబలి' తర్వాత తన రేంజ్‌ను పెంచుకున్న అతడు.. అప్పటి నుంచి పాన్ ఇండియా చిత్రాల్లోనే నటిస్తున్నాడు. ఇప్పటికే 'సాహో' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇక, ప్రస్తుతం రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో 'రాధే శ్యామ్' అనే సినిమాతో పాటు ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తోన్న 'సలార్'లోనూ నటిస్తున్నాడు. వీటితో పాటు యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ నేరుగా ఓ హిందీ చిత్రాన్ని చేయబోతున్నాడు. అదే బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఓం రౌత్ తెరకెక్కిస్తోన్న 'ఆదిపురుష్'.

    ఎద అందాలతో వల.. అమైరా దస్తూర్ రచ్చ

    ఎంతో ప్రతిష్టాత్మకంగా రాబోతున్న ఈ చిత్రం రామాయణం నాటి కథతో రూపొందుతోంది. ఇందులో ప్రభాస్ శ్రీరాముడిగానూ.. సీనియర్ హీర సైఫ్ అలీ ఖాన్ రావణుడిగానూ నటిస్తున్నారు. చెడు మీద మంచి గెలవడం అనే కాన్సెప్ట్‌తో తెరకెక్కుతోన్న ఈ చిత్రం మొదటి అప్‌డేట్‌కు డేట్ ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన సర్‌ప్రైజ్‌ను శ్రీరామనవమి సందర్భంగా ఏప్రిల్ 21న ఇవ్వబోతున్నారని తాజాగా ఓ న్యూస్ బాలీవుడ్ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. తాజా సమాచారం ప్రకారం.. ఆరోజు 'ఆదిపురుష్' మూవీలోని ప్రభాస్ రాముడి లుక్‌ను వదలబోతున్నారట.

    Prabhass Adipurush Update on Ramanavami

    తెలుగు, తమిళం, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని టీ సిరీస్ బ్యానర్‌పై భూషణ్ కుమార్, కృష్ణ కుమార్, ప్రసాద్ సుతార్, రాజేష్ నాయర్‌లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇందులో సీతగా టాల్ బ్యూటీ కృతీ సనన్ నటిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. అలాగే, లక్ష్మణుడిగా యాక్షన్ హీరో టైగర్ ష్రాఫ్‌ను తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇక, ఇప్పటికే ఈ మూవీ వీఎఫ్ఎక్స్ వర్క్ మొదలైన విషయం తెలిసిందే.

    English summary
    Adipurush is a mythological 3D movie directed by Tanhaji fame Om Raut. The movie casts Prabhas playing the main lead role in this movie. Produced by Bhushan Kumar. Adipurush will be shot in Hindi...
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X