‘రాధే శ్యామ్’ నుంచి సర్‌ప్రైజ్: బడా హీరోలకు షాకిచ్చిన ప్రభాస్.. కొత్త పోస్టర్‌తో అంచనాలు రెట్టింపు
దాదాపు దశాబ్ద కాలంగా తెలుగు సినీ ఇండస్ట్రీలో తన హవాను చూపిస్తూ.. 'బాహుబలి' నుంచి పాన్ ఇండియా స్టార్‌గా వెలుగొందుతున్నాడు యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్. ఈ మధ్య కాలంలో పంథాను మార్చుకున్న అతడు.. వరుసగా భారీ చిత్రాల్లోనే నటిస్తోన్నాడు. ప్రస్తుతం ఈ స్టార్ హీరో చేస్తున్న చిత్రాల్లో 'రాధే శ్యామ్' ఒకటి. రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోన్న ఈ సినిమా నుంచి తాజాగా సర్‌ప్రైజింగ్ అప్‌డేట్ వచ్చింది. దీంతో పలువురు బడా హీరోలకు షాకిచ్చినట్లైంది. ఇంతకీ ఏం జరిగింది? దానికి సంబంధించిన పూర్తి వివరాలపై మీరూ ఓ లుక్కేయండి!

కెరీర్‌లో తొలిసారి అలాంటి సినిమా
కొంత కాలంగా యాక్షన్ సినిమాల్లోనే నటిస్తోన్న ప్రభాస్.. ప్రస్తుతం రాధాకృష్ణ కుమార్‌తో 'రాధే శ్యామ్' చేస్తున్నాడు. దీన్ని కృష్ణంరాజు సమర్పణలో యువీ క్రియేషన్స్, గోపీకృష్ణా మూవీస్ పతాకాలపై వంశీ, ప్రమోద్, ప్రశీద నిర్మిస్తున్నారు. పూజా హెగ్డే హీరోయిన్‌గా చేస్తున్న ఈ మూవీని కూడా పాన్ ఇండియా రేంజ్‌లో రూపొందిస్తున్నారు. ఇందులో ప్రభాస్ తొలిసారి రొమాంటిక్ రోల్ చేస్తున్నాడు.

దాదాపు రెండేళ్లు.. వరుస బ్రేకులు
తొలినాళ్లలో వరుసగా సినిమాలు చేసిన ప్రభాస్.. 'బాహుబలి' నుంచి వేగాన్ని తగ్గించాడు. మంచి ఔట్‌పుట్ కోసం సినిమాకు చాలా సమయం తీసుకుంటున్నాడు. ఇదే 'రాధే శ్యామ్' విషయంలోనూ జరుగుతోంది. ఈ చిత్రం ప్రారంభమై దాదాపు రెండేళ్లు పూర్తైంది. అయినప్పటికీ ఇది ఫస్ట్ కాపీ రెడీ కాలేదు. పలుమార్లు ఆటంకం ఏర్పడడమే ఈ పరిస్థితికి ప్రధాన కారణం అన్న సంగతి విధితమే.

బిజినెస్ భారీగా.. రికార్డులు క్రియేట్
చిత్రీకరణ ప్రారంభమైన చాలా రోజుల వరకూ 'రాధే శ్యామ్' నుంచి ఎటువంటి అప్‌డేట్ రాలేదు. దీంతో చిత్ర యూనిట్‌పై ప్రభాస్ ఫ్యాన్స్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఆ మధ్య టీజర్, ఆ తర్వాత ప్రతి పండుగకూ ఒక పోస్టర్ చొప్పున వదిలారు. వీటి వల్ల సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. తద్వారా ఈ చిత్రానికి భారీ స్థాయిలో బిజినెస్ జరిగినట్లు టాక్ వినిపిస్తోంది.

గుమ్మడికాయ కొట్టేసిన రాధే శ్యామ్
'రాధే శ్యామ్' మూవీకి సంబంధించిన బ్యాలెన్స్ సీన్స్ చిత్రీకరణ ఇటీవలే ప్రారంభమైంది. ఇందులో కృష్ణంరాజు, పూజా హెగ్డేతో ప్రభాస్ చేయాల్సిన సన్నివేశాలతో పాటు ఓ గ్రీన్ మ్యాట్ సీన్స్ కూడా షూట్ చేశారు. ఇటీవలే ప్రభాస్ కూడా ఇందులో పాల్గొన్నాడు. ఈ నేపథ్యంలోనే రెండు రోజుల క్రితమే ఈ సినిమా షూట్‌ను కంప్లీట్ చేసేశారు. దీంతో రాధే శ్యామ్‌కు గుమ్మడికాయ కొట్టేశారు.

కొత్త రిలీజ్ డేట్ ప్రకటించిన యూనిట్
'రాధే శ్యామ్' మూవీని ఈ జూలైలోనే విడుదల చేయాలని అనుకున్నారు. కానీ, కరోనా సెకెండ్ వేవ్ కారణంగా చిత్రీకరణలు ఆగిపోయాయి. దీంతో అనుకున్న డేట్ దాటిపోయింది. ఈ క్రమంలోనే ఈ సినిమా కొత్త రిలీజ్ గురించి బయట పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా 'రాధే శ్యామ్'ను జనవరి 14న విడుదల చేస్తున్నట్లు చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది.
Recommended Video

టాలీవుడ్ స్టార్లకు షాకిచ్చిన ప్రభాస్
యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ 'రాధే శ్యామ్'ను సంక్రాంతికి రిలీజ్ చేస్తున్నారు. తద్వారా టాలీవుడ్ స్టార్లతో పోటీకి రెడీ అయిపోయాడు. ఈ సారి సంక్రాంతి బరిలో పవన్ రానా మూవీతో పాటు మహేశ్ బాబు 'సర్కారు వారి పాట' కూడా విడుదల కాబోతున్నాడు. వీటితో పాటు వెంకటేష్, వరుణ్ తేజ్ 'ఎఫ్3' కూడా రిలీజ్ కానుంది. ఇప్పుడు ప్రభాస్ ఎంట్రీతో పోటీ రసవత్తరంగా మారిపోతుంది.


Click it and Unblock the Notifications











