‘రాధే శ్యామ్’ రిలీజ్‌పై రాబోతున్న ప్రకటన: ఎక్కువ శాతం అదే వెలువడే అవకాశం

యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ - టాలెంటెడ్ డైరెక్టర్ రాధాకృష్ణ కుమార్ కాంబినేషన్‌లో రాబోతున్న చిత్రం 'రాధే శ్యామ్'. లవ్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోన్న ఈ సినిమా షూటింగ్ ప్రారంభమై చాలా కాలమే అవుతోంది. కానీ, చిత్రీకరణ మాత్రం ఇంకా పూర్తి కాలేదు. ఈ నేపథ్యంలో కరోనా రెండో దశ రావడంతో కొంచెం బ్యాలెన్స్ ఉండగానే షూటింగ్ నిలిపి వేయాల్సి వచ్చింది. ఫలితంగా ఈ సినిమా అనుకన్న సమయానికి వస్తుందా? రాదా? అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఈ చిత్రం విడుదల గురించి త్వరలోనే అధికారిక ప్రకటన రాబోతుందట.

'రాధే శ్యామ్' మూవీని జూలై 30 విడుదల చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ఇప్పటికే అధికారికంగా ప్రకటించింది. అయితే, ఇప్పుడు దాదాపు పది రోజులకు పైగానే షూటింగ్ బ్యాలెన్స్ ఉండిపోయింది. అందులోనూ మరికొన్ని రోజుల వరకూ షూటింగులు మొదలయ్యే అవకాశం లేదు. దీంతో ఈ సినిమా విడుదల వాయిదా పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ప్రచారం జరుగుతోంది. తాజా సమాచారం ప్రకారం.. 'రాధే శ్యామ్' రిలీజ్ గురించి అతి త్వరలోనే ప్రకటన వెలువడబోతుందట. ఇందులో ఎక్కువ శాతం వాయిదా పడిన విషయాన్నే ప్రకటించబోతున్నారనే టాక్ వినిపిస్తోంది.

Prabhass Radhe Shyam Postpone Announcement Coming Soon

ఎంతో ప్రతిష్టాత్మకంగా రాబోతున్న 'రాధే శ్యామ్' మూవీ 1960 దశకం నాటి కథతో రూపొందుతున్నట్లు ఎప్పటి నుంచో వార్తలు వస్తున్నాయి. అదే సమయంలో ఇది పునర్జన్మల కథ అని కూడా ప్రచారం జరుగుతోంది. ఇక, ఇప్పటికే విడుదలైన అన్ని పోస్టర్లు, టీజర్‌కు మంచి స్పందన వచ్చింది. ఈ సినిమాను కృష్ణంరాజు సమర్పణలో యువీ క్రియేషన్స్‌, గోపీకృష్ణా మూవీస్‌ పతాకాలపై వంశీ, ప్రమోద్‌, ప్రశీద నిర్మిస్తున్నారు. పూజా హెగ్డే హీరోయిన్‌గా చేస్తోంది. ఇది తెలుగు, తమిళం, మలయాళం, కన్నడం, హిందీ భాషల్లో విడుదల కాబోతుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X