Don't Miss!
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
- Technology ఎయిర్ కండిషనర్ AC ను కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తున్నారా... అయితే ఇవి తెలుసుకోండి..!
- News నాకు అండగా, చీకటిలో వెలుగుగా..
- Travel వేసవిలో సందర్శించేందుకు దేశంలోని బెస్ట్ ఆఫ్‌బీట్ హిల్ స్టేషన్లు ఇవే..
- Automobiles కారు ప్రియులకు గుడ్‌న్యూస్.. భారతీయ మార్కెట్లోకి సరికొత్త కారుతో వస్తోన్న 'ఫోర్డ్'!!
- Lifestyle భార్యా భర్త గొడవపడినా..బంధం బలంగా ముందుకు కొనసాగాలంటే ఇవి పాటించాలి..
- Sports భారత్.. టీ20 వరల్డ్ కప్ 2024 కొట్టాలంటే: లెజెండరీ ప్లేయర్ సలహా
‘రాధే శ్యామ్’ నుంచి సర్ప్రైజింగ్ వీడియో: ప్రీ టీజర్‌తో మేటర్ రివీల్ చేసిన ప్రభాస్ టీమ్
వరుసగా భారీ చిత్రాల్లోనే నటిస్తూ పాన్ ఇండియా స్టార్‌గా మారిపోయాడు యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్. ఈ క్రమంలోనే ప్రస్తుతం అతడు నటిస్తోన్న చిత్రం 'రాధే శ్యామ్'. 'జిల్' ఫేం రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రాన్ని కృష్ణంరాజు సమర్పణలో యువీ క్రియేషన్స్, గోపీకృష్ణా మూవీస్ పతాకాలపై వంశీ, ప్రమోద్, ప్రశీద ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పూజా హెగ్డే హీరోయిన్గా చేస్తున్న ఈ మూవీని కూడా పాన్ ఇండియా రేంజ్లో రూపొందిస్తున్నారు. రొమాంటిక్ ఎంటర్టైనర్గా రాబోతున్న ఈ ప్రతిష్టాత్మక మూవీ షూటింగ్ దాదాపుగా పూర్తయింది.
కొద్ది రోజులుగా 'రాధే శ్యామ్' టీజర్ గురించి ఎన్నో వార్తలు వస్తున్నాయి. ప్రేమికుల రోజును పురస్కరించుకుని ఫిబ్రవరి 14న దీన్ని విడుదల చేయబోతున్నారని ప్రచారం జరుగుతోంది. అందుకు అనుగుణంగానే తాజాగా ఈ మూవీ ప్రీ టీజర్ రిలీజ్ అయింది. అందరూ అనుకుంటున్నట్లే 'రాధే శ్యామ్' టీజర్‌ను ఫిబ్రవరి 14నే విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. ఇక, ఈ వీడియోలో 'బాహుబలి'లోని ప్రభాస్ లుక్‌తో పాటు 'సాహో'లోని వైలెంట్ గెటప్‌ను కూడా చూపించారు. అలాగే, తాజా చిత్రంలోని రొమాంటిక్ రెబెల్ స్టార్‌ను కూడా యాడ్ చేశారు.
ఇదిలా ఉండగా.. 'రాధే శ్యామ్' షూటింగ్ ఎప్పుడో ప్రారంభం అయినప్పటికీ.. రిలీజ్ విషయంలో క్లారిటీ మాత్రం రాలేదు. పైగా దీని నుంచి ఫ్యాన్స్ కోరుకున్నట్లుగా అప్డేట్స్ రావడం లేదు. దీంతో వాళ్లంతా నిరాశతో యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై సోషల్ మీడియా వేదికగా దాడి చేశారు. ఈ కారణంగానే ప్రీ టీజర్‌ను వదిలినట్లు తెలుస్తోంది. అన్ని సినిమాల రిలీజ్ డేట్లు ప్రకటిస్తున్నా.. ఈ మూవీని ప్రేక్షకుల ముందుకు ఎప్పుడు తీసుకొస్తున్నారు అన్న దానిపై మాత్రం అనౌన్స్ చేయలేదు. దీనికి వీఎఫ్ఎక్స్ వర్క్ ఆలస్యం అవడమే కారణమని సమాచారం.