ప్రభాస్ అభిమానులకు గుడ్ న్యూస్: ‘రాధే శ్యామ్’ నుంచి అదిరిపోయే సర్‌ప్రైజ్‌లు అప్పుడే

నిన్న మొన్నటి వరకూ తెలుగు సినీ ఇండస్ట్రీకే పరిమితమైన టాలీవుడ్ టాప్ హీరో యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్.. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన 'బాహుబలి' నుంచి పాన్ ఇండియా రేంజ్‌కు ఎదిగిపోయాడు. దీని తర్వాత చేసిన 'సాహో'తో హిందీ ప్రేక్షకుల అభిమానాన్ని కూడా సొంతం చేసుకున్న అతడు.. అక్కడ మార్కెట్‌ను గణనీయంగా విస్థరించుకున్నాడు. ఇక, అప్పటి నుంచి పంథాను మార్చుకుని.. అన్నీ పాన్ ఇండియా రేంజ్ ప్రాజెక్టులే చేస్తున్నాడు. ఇందులో భాగంగానే యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం చేతి నిండా భారీ సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు.

'సాహో' వంటి యాక్షన్ ఎంటర్‌టైనర్ తర్వాత యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ నటించిన చిత్రమే 'రాధే శ్యామ్'. ఫీల్ గుడ్ లవ్ రొమాంటిక్ జోనర్‌లో రాబోతున్న ఈ మూవీని జిల్ మూవీతో అందరి దృష్టిని ఆకర్షించిన రాధాకృష్ణ కుమార్ తెరకెక్కించాడు. ఇప్పటికే దీనికి సంబంధించిన టాకీ పార్ట్ మొత్తం పూర్తి అయిపోయింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఈ చిత్రంలో గ్రీన్ మ్యాట్ సీన్స్ (గ్రాఫిక్) ఎక్కువగా ఉండడంతో దీనికి చాలా సమయం పడుతుందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ మూవీ నుంచి ఓ అదిరిపోయే న్యూస్ బయటకు వచ్చింది.

Prabhass Radhe Shyam Promossions From September

'రాధే శ్యామ్' చిత్రాన్ని సంక్రాంతి కానుకగా వచ్చే ఏడాది జనవరి 14న ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నారు. ఈ నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలను వీలైనంత త్వరగా ప్రారంభించి.. ప్రేక్షకులకు ఈ సినిమాను మరింత చేరువ చేయాలని చిత్ర యూనిట్ భావిస్తోంది. అందుకు అనుగుణంగానే 'రాధే శ్యామ్' ప్రమోషన్ కార్యక్రమాలను సెప్టెంబర్ నుంచి మొదలు పెట్టాలని డిసైడ్ అయ్యారట. ఇందులో భాగంగానే దీని నుంచి ముందుగా పాటలను ఒక్కొక్కటిగా వదలబోతున్నారని తెలుస్తోంది. వీటికి సంబంధించిన ప్రకటన అతి త్వరలోనే రాబోతుందనే టాక్ వినిపిస్తోంది.

ఇప్పటికే 'రాధే శ్యామ్' మూవీ నుంచి పలు పోస్టర్లు, ఓ గ్లిమ్స్ వీడియో విడుదల అయ్యాయి. వీటన్నింటికీ ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన వస్తోంది. వీటి తర్వాత ఇందులోని పాటలను రిలీజ్ చేయనున్నారు. ఇప్పటికే వీటికి సంబంధించిన రికార్డింగ్‌తో పాటు షూటింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది. 'రాధే శ్యామ్' తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం వెర్షన్లకు జస్టిన్ ప్రభాకరన్ సంగీతం అందిస్తుండగా.. హిందీకి మాత్రం పలువురు ప్రముఖులు కంపోజర్లుగా చేస్తున్నారు. ఇక, ఈ సినిమా కోసం సౌత్‌కు నార్త్‌కు వేరు వేరుగా సౌండ్ ట్రాక్‌లను రెడీ చేస్తున్న విషయం తెలిసిందే.

ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతోన్న 'రాధే శ్యామ్' మూవీలో ప్రభాస్ కార్ల దొంగగా నటిస్తోన్నట్లు చాలా రోజులుగా వార్తలు వస్తున్నాయి. అలాగే, ఇది టైమ్ ట్రావెల్ కథ అని, పునర్జన్మల నేపథ్యంతో సాగే సినిమా అని ప్రచారం జరుగుతోంది. ఈ సినిమాను కృష్ణంరాజు సమర్పణలో యువీ క్రియేషన్స్‌, గోపీకృష్ణా మూవీస్‌ పతాకాలపై వంశీ, ప్రమోద్‌, ప్రశీద నిర్మిస్తున్నారు. పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోంది. వీళ్లతో పాటు సచిన్ ఖేడ్కర్, మురళీ శర్మ, భాగ్యశ్రీ, ప్రియదర్శి, కునాల్ రాయ్ కపూర్, ఫ్లోరా జాకబ్ సహా ఎంతో మంది ప్రముఖులు కీలక పాత్రలను పోషిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X