ప్రభాస్ అభిమానులకు సిద్ శ్రీరామ్ ఊహించని ట్రీట్: ఈ సారి ఎఫెక్ట్ మామూలుగా ఉండదట

తెలుగు సినీ ఇండస్ట్రీలోకి ఏమాత్రం అంచనాలు లేకుండానే ఎంట్రీ ఇచ్చి.. చాలా తక్కువ సమయంలోనే స్టార్‌గా ఎదిగిపోయాడు యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్. అలా అలా ఓ మోస్తరు సినిమాలు చేస్తూ వచ్చిన అతడు.. 'బాహుబలి'తో ఇండియన్ స్టార్ అయిపోయాడు. ఈ మూవీతో అతడి మార్కెట్ కూడా భారీ స్థాయిలో పెరిగిపోయింది. ఆ తర్వాత వచ్చిన 'సాహో' కూడా ఉత్తరాదిలో మంచి ప్రభావాన్నే చూపించింది. అందుకే అప్పటి నుంచి పాన్ ఇండియా రేంజ్ చిత్రాల్లోనే నటిస్తున్నాడు. ఈ క్రమంలోనే ఇప్పుడు 'రాధే శ్యామ్' అనే రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌లో నటిస్తున్నాడు.

జిల్ మూవీతో దర్శకుడిగా మంచి గుర్తింపును అందుకున్న రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తోన్న చిత్రమే 'రాధే శ్యామ్'. ఈ మూవీ షూటింగ్ ప్రారంభమై దాదాపు రెండేళ్లకు పైగా అవుతోంది. మధ్యలో కరోనా లాక్‌డౌన్‌తో పాటు పలు ఆటంకాలు ఏర్పడడంతో ఈ సినిమా చిత్రీకరణ ఆలస్యం అవుతూ వచ్చింది. దీంతో సుదీర్ఘ ప్రయాణం తర్వాత అంటే ఇటీవలే ఈ చిత్రానికి సంబంధించిన టాకీ పార్ట్ మొత్తాన్ని పూర్తి చేసింది చిత్ర యూనిట్. ప్రస్తుతం దీనికి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. అవి కూడా దాదాపుగా పూర్తి కావొచ్చాయి.

Prabhass Radhe Shyam Second Song on December First Week

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తోన్న 'రాధే శ్యామ్' చిత్రాన్ని సంక్రాంతి కానుకగా వచ్చే ఏడాది జనవరి 14న ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నారు. ఈ నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలను వీలైనంత త్వరగా ప్రారంభించి.. ప్రేక్షకులకు ఈ సినిమాను మరింత చేరువ చేయాలని చిత్ర యూనిట్ భావిస్తోంది. ఇందులో భాగంగానే ఇటీవలే ఈ సినిమా నుంచి 'ఈ రాతలే' అంటూ సాగే సాఫ్ట్ మెలోడీ సాంగ్‌ను విడుదల చేశారు. దీనికి భారీ స్థాయిలో స్పందన వచ్చింది. అదే సమయంలో పలు రికార్డులు కూడా నమోదయ్యాయి. దీంతో ఇప్పుడు మరో సాంగ్‌ను రెడీ చేస్తున్నట్లు తెలుస్తోంది.

'రాధే శ్యామ్' సినిమా నుంచి ఇప్పుడు రెండో పాటను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు తెలిసింది. సిద్ శ్రీరామ్ ఆలపించిన ఈ పాటను డిసెంబర్ మొదటి వారంలో రిలీజ్ చేయబోతున్నారట. దీనికి సంబంధించిన ప్రకటన రెండు మూడు రోజుల్లో రానుందనే టాక్ వినిపిస్తోంది. ఇది మంచి ఫాస్ట్ నెంబర్ బీట్‌తో సాగే పాట అని అంటున్నారు. అందులోనూ సిద్ పాడిన పాట కావడంతో ఇది ఏ రేంజ్‌లో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ఇదిలా ఉండగా.. ఈ సినిమాకు సంబంధించి తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం భాషలకు గానూ జస్టిన్ ప్రభాకరన్ సంగీతం అందించనున్నారు. అలాగే, హిందీకి మాత్రం మిథున్, మనన్ భరద్వాజ్‌ను తీసుకున్నారు.

'రాధే శ్యామ్' మూవీలో ప్రభాస్ జ్యోతిష్యుడిగా నటిస్తోన్నాడు. అలాగే, ఇది టైమ్ ట్రావెల్ కథ అని, పునర్జన్మల నేపథ్యంతో సాగే సినిమా అని అంటున్నారు. దీన్ని కృష్ణంరాజు సమర్పణలో యువీ క్రియేషన్స్‌, గోపీకృష్ణా మూవీస్‌ పతాకాలపై వంశీ, ప్రమోద్‌, ప్రశీద నిర్మిస్తున్నారు. పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోంది. వీళ్లతో పాటు సచిన్ ఖేడ్కర్, మురళీ శర్మ, భాగ్యశ్రీ, ప్రియదర్శి, కునాల్ రాయ్ కపూర్, ఫ్లోరా జాకబ్ వంటి వాళ్లు నటిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X