‘రాధే శ్యామ్’ నుంచి ప్రకటన వచ్చేసింది: డేట్‌తో పాటు ప్రభాస్ న్యూ స్టిల్ కూడా

టాలీవుడ్ టాప్ హీరో యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ నటిస్తోన్న తాజా చిత్రం 'రాధే శ్యామ్'. 'జిల్' ఫేం రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ చిత్రాన్ని కృష్ణంరాజు సమర్పణలో యువీ క్రియేషన్స్‌, గోపీకృష్ణా మూవీస్‌ పతాకాలపై వంశీ, ప్రమోద్‌, ప్రశీద ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. హాట్ బ్యూటీ పూజా హెగ్డే హీరోయిన్‌గా చేస్తోంది. జస్టిన్ ప్రభాకరన్ మ్యూజిక్ అందిస్తున్నారు. 1960 దశకం నాటి కథతో రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా రాబోతుందీ సినిమా. ఈ సినిమా నుంచి ప్రభాస్ ఫ్యాన్స్ కోరుకుంటోన్న అప్‌డేట్‌ను యూనిట్ కొద్ది సేపటి క్రితం పోస్టర్ ద్వారా వెల్లడించింది.

'రాధే శ్యామ్' నుంచి పెద్దగా అప్‌డేట్స్ రాకపోవడంతో ప్రభాస్ ఫ్యాన్స్ నిరాశగా ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ మూవీ టీజర్ ప్రేమికుల రోజును పురస్కరించుకుని ఫిబ్రవరి 14న విడుదల కాబోతుందని చిత్ర యూనిట్ ఇప్పటికే ప్రకటించింది. ఈ మేరకు ఓ ప్రీ టీజర్‌ను కూడా వదిలింది. ఇక, తాజాగా దీని గురించి ఓ పోస్టర్‌ను విడుదల చేసింది. అందులో ఫస్ట్ గ్లిమ్స్‌ను ఫిబ్రవరి 14 ఉదయం 9.18 గంటలకు రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించారు. అలాగే, ఇందులో ప్రభాస్ లుక్‌ను కూడా చూపించారు. స్టైలిష్ వాక్ చేస్తున్న యంగ్ రెబెల్ స్టార్ న్యూ స్టిల్ ఆకట్టుకుంటోంది.

Prabhass Radhe Shyam Teaser Date and Time Announced

'రాధే శ్యామ్' షూటింగ్ ఎప్పుడో ప్రారంభం అయినప్పటికీ.. చిత్రీకరణ మాత్రం ఇంకా పూర్తవలేదు. కీలకమైన కొన్ని సన్నివేశాలతో పాటు కృష్ణంరాజు - ప్రభాస్ కాంబినేషన్ సీన్స్ కూడా షూట్ చేయాల్సి ఉంది. దీనికి తోడు వీఎఫ్ఎక్స్ వర్క్ కూడా చాలా ఆలస్యం అవుతోంది. ఈ కారణంగానే ఈ మూవీ రిలీజ్ డేట్‌ను ఇంకా ప్రకటించలేదు. ఇదిలా ఉండగా.. ఈ మూవీలో ప్రభాస్ కార్ల దొంగగా నటిస్తున్నాడని ప్రచారం జరుగుతోంది. ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతోన్న ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X