Don't Miss!
- News హైదరాబాద్, కరీంనగర్ కాంగ్రెస్ అభ్యర్థులు వీరే: ఖమ్మంలో హీరో వెంకటేష్ వియ్యంకుడు
- Sports T20 World Cup 2024 బ్రాండ్ అంబాసిడర్‌గా పరుగుల చిరుత.!
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Technology OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- Automobiles 323 కి.మీ రేంజ్‌తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
‘రాధే శ్యామ్’ టీజర్ డేట్ ఫిక్స్: అదిరిపోయే స్పెషల్ డేను లాక్ చేసిన ప్రభాస్
వరుస సినిమాలతో ఫుల్ జోష్ మీదున్నాడు యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్. ఈ మధ్య కాలంలో మొత్తం పాన్ ఇండియా సినిమాలనే చేస్తున్న అతడు.. మంచి ఫలితాలను రాబడుతున్నాడు. తద్వారా దేశ వ్యాప్తంగా ఫాలోయింగ్‌తో పాటు మార్కెట్‌ను పెంచుకుంటున్నాడు. ఇప్పటికే దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన 'బాహబలి' సిరీస్‌తో పాటు సుజిత్ దర్శకత్వంలో వచ్చిన 'సాహో'తో తన స్టామినాను ప్రపంచానికి పరిచయం చేశాడు ప్రభాస్. ఈ క్రమంలోనే 'రాధే శ్యామ్' అనే రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్తో కొద్ది రోజుల్లోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.
'జిల్' ఫేం రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ నటిస్తోన్న చిత్రమే 'రాధే శ్యామ్'. కృష్ణంరాజు సమర్పణలో యువీ క్రియేషన్స్, గోపీకృష్ణా మూవీస్ పతాకాలపై వంశీ, ప్రమోద్, ప్రశీద ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పూజా హెగ్డే హీరోయిన్గా చేస్తున్న ఈ మూవీని కూడా పాన్ ఇండియా రేంజ్లో రూపొందిస్తున్నారు. రొమాంటిక్ ఎంటర్టైనర్గా రాబోతున్న ఈ మూవీ షూటింగ్ దాదాపుగా పూర్తయింది. మిగిలిన ఒక షెడ్యూల్లో కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో 'రాధే శ్యామ్' టీజర్ రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
తాజా సమాచారం ప్రకారం.. 'రాధే శ్యామ్' టీజర్‌ను ప్రేమికుల రోజు సందర్భంగా ఫిబ్రవరి 14న విడుదల చేయబోతున్నారట. ఇప్పటికే దీనికి సంబంధించిన కట్స్, ఎడిటింగ్ వర్క్ కూడా జరుగుతోందని అంటున్నారు. వాస్తవానికి ఈ మూవీ టీజర్ గత సంక్రాంతికే వస్తుందని ప్రచారం జరిగింది. ఆ తర్వాత గణతంత్ర దినోత్సవం రోజు రిలీజ్ చేస్తారని అనుకున్నారు. కానీ, అది జరగలేదు. దీంతో ప్యూర్ లవ్ స్టోరీతో వస్తున్న సినిమా కాబట్టి.. ప్రేమికుల రోజున విడుదల చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇక, ఇందులో కృష్ణంరాజు, ప్రియదర్శి సహా పలువురు నటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.