ప్రభాస్ ఫ్యాన్స్‌కు షాకింగ్ న్యూస్: ఆ మూవీ టీజర్ అప్పటి వరకూ రానట్టేనట

యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ - 'జిల్' ఫేం రాధాకృష్ణ కుమార్ కలయికలో వస్తున్న చిత్రం 'రాధే శ్యామ్'. ఈ చిత్రాన్ని కృష్ణంరాజు సమర్పణలో యువీ క్రియేషన్స్‌, గోపీకృష్ణా మూవీస్‌ పతాకాలపై వంశీ, ప్రమోద్‌, ప్రశీద ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పూజా హెగ్డే హీరోయిన్‌గా చేస్తున్న ఈ మూవీని కూడా పాన్ ఇండియా రేంజ్‌లో రూపొందిస్తున్నారు. రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా రాబోతున్న ఈ సినిమాలో ప్రభాస్ దొంగగా కనిపించబోతున్నాడని అంటున్నారు. 1960 దశకం నాటి ఫీల్ గుడ్ లవ్ స్టోరీతో పాటు పునర్జన్మల నేపథ్యంతో ఇది తెరకెక్కుతోందని అంటున్నారు.

ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో ప్రారంభం అయినప్పటికీ.. దీని నుంచి ఫ్యాన్స్ కోరుకున్నట్లుగా అప్‌డేట్స్ రావడం లేదు. దీంతో వాళ్లంతా నిరాశగా ఉన్నారు. ఒకానొక సందర్బంలో నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్‌ బ్యానర్‌పై సోషల్ మీడియా వేదికగా దాడి చేశారు. దీంతో కొన్ని పోస్టర్లు, సినిమా టైటిల్ రివీల్ చేశారు. ఈ క్రమంలోనే 'రాధే శ్యామ్' టీజర్ గురించి ప్రభాస్ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో చిత్ర దర్శకుడు రాధాకృష్ణ.. త్వరలోనే టీజర్‌ను వదలబోతున్నాం అని ఇటీవల ప్రకటించాడు. దీంతో సంక్రాంతికి అది వస్తుందని అంతా అనుకున్నారు.

 Prabhass Radhe Shyam Teaser Delay

'రాధే శ్యామ్' టీజర్ సంక్రాంతికి విడుదల కాలేదు. దీంతో అదెప్పుడు వస్తుందా అని అంతా వేయి కళ్లతో వేచి చూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇది ఇప్పట్లో వచ్చే అవకాశాలు లేవని తాజాగా ఓ న్యూస్ ఫిలిం నగర్ ఏరియాలో చక్కర్లు కొడుతోంది. వాస్తవానికి జనవరి నెలలోనే దీన్ని విడుదల చేయాలి అనుకున్నా అది సాధ్యం కావడం లేదని అంటున్నారు. ఇక, ఈ సినిమాకు సంబంధించిన చివరి షెడ్యూల్ త్వరలోనే ప్రారంభం కానుంది. దీనితో ఈ మూవీ షూటింగ్ కంప్లీట్ అవుతుంది. అప్పుడే టీజర్ వచ్చే చాన్స్ ఉందట. ఈ మూవీ తర్వాత ప్రభాస్ 'సలార్' మూవీని ప్రారంభించనున్నాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X