Radhe Shyam Teaser: ట్విస్ట్ ఇచ్చిన రాధే శ్యామ్ టీమ్.. విక్రమాదిత్య ఎవరో తెలిస్తే షాక్ అవుతారు!

ప్రభాస్.. తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రజలకే కాదు.. దేశ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులందరికీ అస్సలు పరిచయం చేయనవసరం లేని పేరిది. అంతలా ఇతగాడు ఇండియన్ సినిమాపై ప్రభావాన్ని చూపిస్తున్నాడు. టాలీవుడ్‌ హీరోగా కెరీర్‌ను ఆరంభించిన అతడు.. చాలా తక్కువ సమయంలోనే స్టార్‌గా ఎదిగిపోయాడు. ఈ క్రమంలోనే 'బాహుబలి' చిత్రంతో పాన్ ఇండియా లెవెల్‌లో క్రేజ్‌ను సంపాదించుకున్నాడు. అప్పటి నుంచి వెనుదిరిగి చూడకుండా దూసుకెళ్తున్నాడు. ఇక, ప్రభాస్ ప్రస్తుతం చేస్తున్న చిత్రాల్లో 'రాధే శ్యామ్' ఒకటి. ఈరోజు అతడి పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాకు సంబంధించిన టీజర్‌ను విడుదల చేశారు. ఇందులో బిగ్ ట్విస్ట్‌ను రివీల్ చేసి షాకిచ్చారు. ఆ సంగతులేంటో చూద్దాం పదండి!

‘రాధే శ్యామ్'గా వస్తున్న ప్రభాస్

‘రాధే శ్యామ్'గా వస్తున్న ప్రభాస్

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం రాధాకృష్ణ కుమార్‌తో 'రాధే శ్యామ్' అనే మూవీ చేస్తున్నాడు. దీన్ని కృష్ణంరాజు సమర్పణలో యువీ క్రియేషన్స్‌, గోపీకృష్ణా మూవీస్‌ పతాకాలపై వంశీ, ప్రమోద్‌, ప్రశీద నిర్మిస్తున్నారు. పూజా హెగ్డే హీరోయిన్‌గా చేస్తున్న ఈ మూవీని కూడా పాన్ ఇండియా రేంజ్‌లో రూపొందిస్తున్నారు. ఈ సినిమాలో ప్రభాస్ రొమాంటిక్ పాత్రను చేస్తున్నాడు.

 మళ్లీ అదే రీతిలో చాలా ఆలస్యం

మళ్లీ అదే రీతిలో చాలా ఆలస్యం

'బాహుబలి' ప్రభాస్ నుంచి సినిమాల వేగాన్ని తగ్గించాడు. మంచి ఔట్‌పుట్ కోసం సినిమాకు చాలా సమయం తీసుకుంటున్నాడు. ఇదే 'రాధే శ్యామ్' విషయంలోనూ జరుగుతోంది. ఈ చిత్రం రెగ్యూలర్ షూటింగ్ ప్రారంభమై చాలా కాలమే అయినా.. పలుమార్లు ఆటంకం ఏర్పడడం వల్ల టాకీ పార్ట్ అనుకున్న సమయానికి పూర్తి కాలేదు. దీంతో చాలా లేట్‌గా పూర్తైపోయింది.

బిజినెస్ కూడా భారీ స్థాయిలోనే

బిజినెస్ కూడా భారీ స్థాయిలోనే

'రాధే శ్యామ్' ప్రారంభమైన చాలా రోజుల వరకూ ఎటువంటి అప్‌డేట్ రాలేదు. దీంతో చిత్ర యూనిట్‌పై ప్రభాస్ అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఆ మధ్య టీజర్, ఆ తర్వాత ప్రతి పండుగకూ ఒక పోస్టర్ చొప్పున వదిలారు. వీటి వల్ల సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. తద్వారా ఈ చిత్రానికి భారీ స్థాయిలో బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాల టాక్.

‘రాధే శ్యామ్' టీజర్ విడుదల

‘రాధే శ్యామ్' టీజర్ విడుదల

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ పుట్టినరోజు నేడు (అక్టోబర్ 23). దీన్ని పురస్కరించుకుని 'రాధే శ్యామ్' మూవీ నుంచి టీజర్ రాబోతుందని చిత్ర యూనిట్ మూడు రోజుల క్రితమే ప్రకటించింది. అందుకు అనుగుణంగానే తాజాగా ఈ వీడియోను విడుదల చేశారు. 78 సెకెన్ల నిడివి ఉన్న ఈ టీజర్ ప్రభాస్ అభిమానులకే కాకుండా సినీ ప్రియులందరినీ ఎంతగానో ఆకట్టుకుంటోంది.

ఇంగ్లీష్ డైలాగ్స్... స్టైలిష్ గెటప్

'రాధే శ్యామ్' నుంచి విడుదలైన టీజర్‌లో ప్రభాస్ పోషిస్తోన్న విక్రమాదిత్య పాత్రను పరిచయం చేశారు. ఇందులో అతడు ఇంగ్లీష్‌లో డైలాగులు చెబుతుండగా.. కింద సబ్‌ టైటిల్స్ వేశారు. ఇక, ఇందులో ప్రభాస్ కనిపించిన తీరు హైలైట్‌గా ఉంది. అలాగే, చివర్లో కనిపించిన విజువల్స్, బ్యాగ్రౌండ్ స్కోర్ ఆకట్టుకునేలా ఉన్నాయి. మొత్తంగా ఈ టీజర్ అదిరిపోయేలా డిజైన్ చేశారు.

చివర్లో ట్విస్ట్ ఇచ్చిన విక్రమాదిత్య

చివర్లో ట్విస్ట్ ఇచ్చిన విక్రమాదిత్య

'రాధే శ్యామ్' టీజర్‌లో ప్రభాస్ 'నువ్వు ఎవరో నాకు తెలుసు.. కానీ, నీకు చెప్పను. ప్రేమలో నీ మనసు ఎప్పుడు విరిగిపోయిందో నాకు తెలుసు.. కానీ, నీకు చెప్పను. నీ ఓటమి నాకు తెలుసు.. నాకీ నీకు చెప్పను. నీ చావు నీకు తెలుసు.. కానీ, నీకు చెప్పను. నాకు అన్నీ తెలుసు.. కానీ, నీకు చెప్పను. చెప్పినా మీ ఆలోచనలకు అందదు. నా పేరు విక్రమాదిత్య.. నేను దేవుడిని కాదు.. కానీ మీలో ఒకడికి కూడా కాదు. జ్యోతిష్యుడు విక్రమాదిత్య' అంటూ తన పాత్రను తాను పరిచయం చేసుకున్నాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X