Radhe Shyam కోసం 12 దేశాల్లో పనులు: అందుకే సినిమాలో అది హైలైట్ కాబోతుందట

దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన 'బాహుబలి' సినిమా ఇండియన్ ఫిల్మ్ హిస్టరీలోనే రికార్డులను తిరగ రాసిన విషయం తెలిసిందే. అదే సమయంలో మన సినిమా స్టామినా ప్రపంచం అంతా కనిపించింది. ఇక, ఈ చిత్రంతోనే టాలీవుడ్ స్టార్ హీరో ప్రభాస్.. పాన్ ఇండియా రేంజ్‌కు ఎదిగిపోయాడు. అక్కడి నుంచి వెనుదిరిగి చూడని అతడు.. ఆ వెంటనే 'సాహో' అనే యాక్షన్ సినిమాతో ఉత్తరాది ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యాడు. దీంతో ప్రభాస్‌ రెట్టించిన ఉత్సాహంతో సినిమాల మీద సినిమాలు చేస్తూ వస్తున్నాడు. ఇక, యంగ్ రెబెల్ స్టార్ ప్రస్తుతం చేస్తున్న సినిమాల్లో 'రాధే శ్యామ్' ఒకటి.

రొమాంటిక్ ఫీల్ గుడ్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోన్న 'రాధే శ్యామ్' చిత్రాన్ని రాధాకృష్ణ కుమార్ తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో ప్రారంభం అయింది. కానీ, అనివార్య కారణాల వల్ల చాలా సార్లు షూటింగ్ వాయిదా పడింది. ఇక, ఇటీవలే ఈ సినిమాకు సంబంధించిన టాకీ పార్ట్‌ను కూడా పూర్తి చేసుకున్నారు. కానీ, పోస్ట్ ప్రొడక్షన్ పనులు బ్యాలెన్స్ ఉండడంతో ఇప్పటి వరకూ ఫస్ట్ కాపీని రెడీ చేయలేకపోయారు. అయినప్పటికీ అన్ని పనులనూ వేగంగా జరుపుతున్నారు. అలాగే, మధ్య మధ్యలో కొన్ని అప్‌డేట్లను కూడా ఇస్తూ వస్తున్నారు. దీంతో ఈ సినిమా దేశ వ్యాప్తంగా భారీ స్థాయిలో అంచనాలను ఏర్పరచుకుంది.

Prabhass Radhe Shyam VFX Work Going in 12 Countries

ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతోన్న 'రాధే శ్యామ్' మూవీని సంక్రాంతి కానుకగా జనవరి 14న ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నారు. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ అప్పుడే ప్రమోషన్ కార్యక్రమాలను కూడా మొదలు పెట్టేశారు. ఇందులో భాగంగానే ఇప్పటికే పలు పాటలను, గ్లిమ్స్ వీడియోను విడుదల చేశారు. వీటన్నింటికీ ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన వచ్చింది. ఫలితంగా ఎన్నో రికార్డులు కూడా బద్దలైపోయాయి. ఈ క్రమంలోనే ఇప్పుడు ఈ సినిమా నుంచి ట్రైలర్‌ను కూడా ఇటీవలే ఓ ఈవెంట్‌ను నిర్వహించి మరీ విడుదల చేశారు. ఇది భారీ రెస్పాన్స్‌ను అందుకుని నేషనల్ రికార్డులు క్రియేట్ చేసింది.

క్రేజీ కాంబినేషన్‌లో రాబోతున్న 'రాధే శ్యామ్' మూవీ విడుదలకు సమయం దగ్గర పడుతోంది. దీంతో ఈ సినిమాకు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుపుతున్నారు. తాజాగా దీనిపై చిత్ర దర్శకుడు రాధాకృష్ణ కుమార్ స్పందించాడు. 'రాధే శ్యామ్‌కు వీఎఫ్ఎక్స్ వర్క్ చాలా ఎక్కువగా ఉంది. దీని కోసం కమల్ కణ్ణన్ 24 గంటలూ పని చేస్తూనే ఉన్నారు. అంతేకాదు, ఈ సినిమా కోసం దాదాపు 12 దేశాల్లో వీఎఫ్ఎక్స్ వర్క్ జరుగుతోంది. ఇదే సినిమాలో హైలైట్ కాబోతుంది. దీన్ని ఎంతో క్వాలిటీగా చూపించబోతున్నాం. ఇది చూసిన వాళ్లంతా మరో ప్రపంచానికి వెళ్లిపోతారు' అని వెల్లడించాడు.

ఫీల్ గుడ్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోన్న 'రాధే శ్యామ్' మూవీలో ప్రభాస్ జ్యోతిష్యుడిగా నటిస్తోన్నాడు. అలాగే, ఇది టైమ్ ట్రావెల్ కథ అని, పునర్జన్మల నేపథ్యంతో సాగే సినిమా అని అంటున్నారు. దీన్ని కృష్ణంరాజు సమర్పణలో యువీ క్రియేషన్స్‌, గోపీకృష్ణా మూవీస్‌ పతాకాలపై వంశీ, ప్రమోద్‌, ప్రశీద నిర్మిస్తున్నారు. పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోంది. వీళ్లతో పాటు సచిన్ ఖేడ్కర్, జగపతి బాబు, మురళీ శర్మ, భాగ్యశ్రీ, ప్రియదర్శి, కునాల్ రాయ్ కపూర్, ఫ్లోరా జాకబ్ వంటి వాళ్లు కీలక పాత్రలను చేస్తున్న విషయం తెలిసిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X