ప్రభాస్ స్టామినా అంటే ఇది.. రికార్డులు తిరగరాస్తున్న ‘సాహో’!
Recommended Video

యంగ్ రెబల్‌స్టార్ ప్రభాస్ జన్మదినాన్ని పురస్కరించుకొని విడుదల చేసిన సాహో మేకింగ్ వీడియో ఇంటర్నెట్, సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. తక్కువ వ్యవధిలో ఎక్కువ వ్యూస్ సాధించిన మేకింగ్ వీడియోగా సరికొత్త రికార్డును సృష్టించింది. బాహుబలి తర్వాత ప్రభాస్ నటించిన చిత్రం కావడంతో భారీ అంచనాలు పెరిగాయి. అంచనాలకు తగినట్టే చాప్టర్ 1 వీడియోకు మంచి ఆదరణ లభించింది.

24 గంటల్లోనే
సాహో మేకింగ్ వీడియో రిలీజైన కొద్ది సేపట్లోనే వైరల్‌గా మారింది. 24 గంటల్లోనే ఈ వీడియోకు 10 మిలియన్ల వ్యూస్ లభించాయి. తెలుగు హీరోలలో మరే హీరో వీడియోకు ఇంత మొత్తంలో వ్యూస్ వచ్చిన దాఖలాలు తక్కువే.

యూట్యూబ్‌లో ప్రభాస్ ప్రభంజనం
సాహో మేకింగ్ వీడియో ప్రభంజనం య్యూట్యూబ్‌లో కూడా సాగింది. ఎక్కువ మంది లైక్ చేసిన మేకింగ్ వీడియోగా చరిత్ర సృష్టించింది. యూట్యూబ్‌లో సాహో మేకింగ్ వీడియోకు 4 మిలియన్లకుపైగా వ్యూస్ రావడం జరిగింది.

సోషల్ మీడియాలో వైరల్‌గా
ఇక సోషల్ మీడియాలో కూడా సాహో క్రేజ్ కొనసాగింది. సోషల్ మీడియాలో అతి ఎక్కువ మంది లైక్ చేసిన మేకింగ్ వీడియోగా సాహో ఓ ఘనతను సాధించింది. సోషల్ మీడియా ద్వారా సాహో మేకింగ్ వీడియోకు ఒక మిలియన్ వ్యూస్ లభించాయి.

అత్యధిక వ్యూస్‌తో సాహో
సోషల్ మీడియాలో సాహో మేకింగ్ వీడియో మరో ఘనతను సాధించింది. 24 గంటల్లో ఎక్కువ మందికి చేరిన మేకింగ్ వీడియోగా రికార్డును నమోదు చేసింది. 24 రోజల్లో 52 మిలియన్లకుపైగా వ్యూస్‌ను సాధించింది.

రూ.400 కోట్ల బడ్జెట్‌తో
బాహుబలి తర్వాత ప్రభాస్‌కు దేశవ్యాప్తంగా పెరిగిన అంచనాలతో సాహో చిత్రాన్ని సుమారు రూ.400 కోట్ల బడ్జెట్‌తో యూవీ క్రియేషన్ రూపొందిస్తున్నది. ఈ చిత్రానికి శంకర్, ఎహసాన్, లాయ్ సంగీతం అందిస్తుండగా, ఆర్ మాధి సినిమాటోగ్రఫీని అందిస్తున్నారు.

సుజిత్ రెడ్డి దర్శకత్వంలో
సుజిత్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో బాలీవుడ్ నటులు శ్రద్ధాకపూర్, నీల్ నితిన్ ముఖేష్, జాక్రీ ష్రాఫ్, మందిరాబేడి, ఎవ్లీన్ శర్మ, అరుణ్ విజయ్, వెన్నెల కిషోర్, మురళీ శర్మ తదతరులు నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని 2019లో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











