గల్లీలో సిక్స్ ఎవడైనా కొడుతాడు.. స్టేడియంలో కొట్టేవాడికే రేంజ్.. సాహో ట్రైలర్ రిలీజ్
Recommended Video
ప్రభాస్ ఫ్యాన్స్ ఆసక్తిని రెట్టింపు చేసేలా సాహో సినిమా నుంచి కీలకమైన అప్డేట్ రిలీజ్ చేశారు మేకర్స్. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా సుజీత్ దర్శకత్వంలో రూపొందిన భారీ బడ్జెట్ మూవీ 'సాహో'. ఇటీవలే షూటింగ్ కంప్లీట్ చేసుకొని ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా చిత్రయూనిట్ సినిమాపై ఆసక్తిని పెంచుతూ నటీనటుల లుక్స్ రిలీజ్ చేసింది. ఈ నేపథ్యంలోనే తాజాగా సాహో ట్రైలర్ రిలీజ్ చేశారు.

2 నిమిషాల 47 సెకన్లు.. మిరిమిట్లు గొలిపే యాక్షన్ సన్నివేశాలు
2 నిమిషాల 47 సెకన్ల నిడివితో కట్ చేయబడిన సాహో ట్రైలర్‌లో అబ్బురపరిచే యాక్షన్ సన్నివేశాలు చూపించారు. అబుదాబిలో షూట్ చేసిన భారీ యాక్షన్ సీన్స్, ప్రభాస్ పర్‌ఫార్‌మెన్స్ ఆకట్టుకుంటోంది. విజువల్ ఎఫెక్ట్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అదిరింది. ముంబైలో జరిగిన భారీ రాబరీ నేపథ్యంలో సినిమా ఉంటుందని తెలుస్తోంది.

గల్లీలో సిక్స్ ఎవడైనా కొడతాడు.. స్టేడియంలో కొట్టేవాడికే
అమృతా నాయర్ అనే పోలీస్ ఆఫీసర్ పాత్రలో శ్రద్ద కపూర్ నటించింది. యాక్షన్ సీన్స్ తో పాటు ప్రభాస్, శ్రద్ద కపూర్ మధ్య రొమాంటిక్ సీన్స్‌కి కూడా ట్రైలర్ లో సరైన ప్రాధాన్యత ఇచ్చారు. మనం డే నైట్ లాగా.. ఒకటి వస్తే మరొకటి వెళ్ళిపోవాలి.. మనలాగా అంటూ శ్రద్ద చెప్పిన డైలాగ్ ఆసక్తి రేపుతోంది. గల్లీలో సిక్స్ ఎవడైనా కొడతాడు.. స్టేడియంలో కొట్టేవాడికే ఒక రేంజ్ ఉంటది అంటూ మురళీశర్మ తో ప్రభాస్ చెప్పిన డైలాగ్ చిత్రంలో ఆయన క్యారెక్టర్ కి అద్దం పడుతోంది.
విడుదలైన కొద్దిసేపటి లోనే వైరల్
ఇప్పటికే విడుదలైన అన్ని అప్‌డేట్స్ సాహో సినిమాపై భారీ హైప్ క్రియేట్ చేయడంతో సాహో ట్రైలర్ కోసం దేశవ్యాప్తంగా ఆతృతగా ఎదురు చూశారు ప్రేక్షకులు. దీనికి తోడు గత కొద్ది రోజులుగా సాహో ట్రైలర్ వస్తోందంటూ సోషల్ మీడియాలో చేసిన ప్రమోషన్‌తో నెటిజన్లంతా ఈగర్‌గా వెయిట్ చేశారు. దీంతో విడుదలైన కాసేపట్లోనే లక్షల్లో వ్యూస్ రాబడుతూ వైరల్ అయింది సాహో ట్రైలర్.

సాహో మూవీ
యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై దాదాపు 400 కోట్ల భారీ బడ్జెట్‌తో హై టెక్నికల్ వాల్యూస్‌తో తెరకెక్కింది సాహో సినిమా. యంగ్ డైరెక్టర్ సుజీత్ దర్శకత్వంలో రూపొందిన ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్ సినిమాలో ప్రభాస్, శ్రద్ధ కపూర్ జంటగా నటించారు. హీరోయిన్ శ్రద్ద కపూర్‌కి ఇదే తొలి తెలుగు సినిమా కావడం విశేషం. ఇంకా ఈ చిత్రంలో నీల్ నితిన్ ముఖేష్, టైగర్ ష్రాఫ్, అరుణ్ విజయ్, మురళీ శర్మ, వెన్నెల కిషోర్ లాంటి భారీ తారాగణం పాలు పంచుకున్నారు. ఈ సినిమా ఆగస్టు 30వ తేదీన భారీ అంచనాల నడుమ విడుదల కానుంది.


Click it and Unblock the Notifications











